Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సోదరీ... సోదరుల ప్రేమానుబంధాలే... రక్షా బంధన్!
మానవ సంబంధాలలో ఒకే తల్లికి పుట్టిన ఇరువురి వ్యక్తుల పవిత్రమైన బంధం మానవ భావోద్వేగాలకు అద్దం పడుతుంది. ఈ భావ వ్యక్తీకరణనే మనం -‘రక్షా బంధన్ 'లేదా ‘ రాఖీ ' వేడుకగా జరుపుకుంటాము. రాఖీ కట్టటంలో ఒక సోదరి తన సోదరుడిపై గల అమూల్య ప్రేమను సంకేతంగా వ్యక్తపరుస్తుంది. అది సోదరీ సోదరుల బంధం తెలుపుతుంది. వారిమద్య గల ప్రేమానురాగాలకు సంకేతంగా ఉంటుంది. అది సోదరుడికి ఒక రక్షణగా భావించబడుతుంది.

రాఖీ రోజున అక్కలు, చెల్లళ్ళు తమ సోదరులకు దీర్ఘాయుష్షు ప్రసాదించమని భగవంతుడిని కోరతారు. అతని దీవెనలు అందుకొంటారు. సోదరులు ప్రతిగా వారికి మంచి బహుమతులు అందిస్తూ, జీవితాంతం మీ తోడుగా ఉంటామని కోరతారు.
ఈ వేడుకను సాధారణంగా హిందూమత సాంప్రదాయంలోని శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఆడ పిల్లలు రాఖీలను తమ సోదరుల కుడిచేయి మణి కట్టుకు కడతారు. బహుమతులు అందుకుంటారు. అయితే, ఈ వేడుకలను మరి కొంతమంది తమ సంఘీభావాన్ని ప్రదర్శించటానికి కూడా కొంతమంది యువకులను తమ తోటి సోదరులవలే భావిస్తున్నామంటూ రాఖీలు కడతారు. ఒకరికొకరు తాము జీవితంలో అండదండలతో కొనసాగుతామని తెలుపుకుంటారు. వీరు సోదరీ సోదరులు కాకపోయినప్పటికి ఒక పవిత్ర అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా ఈ రాఖీని కట్టుకుంటారు.
రాఖీ అంశంగా మన చరిత్ర పుటలు తిరగేస్తే, రాఖీ కట్టడమనేది ప్రాచీన కాలంలో కొన్ని రాజ్యాల మధ్య, రాజులు, రాణులు కూడా దీనిని ఆచరించేవారని తెలుస్తోంది. రాజపుత్ర, మరాఠా రాణులు ఆ నాటి ముఘల్ చక్రవర్తులకు, రాజులకు వారి మధ్య ఎన్ని విభేధాలు ఉన్నప్పటికి రాఖీలు పంపి సంబంధాలు ఎంతో సమన్వయంచేసుకొని సోదరీ సోదరులవలే ఆనందించారని కూడా తెలుస్తోంది. ఈ బంధాల కారణంగా కొన్ని శత్రు రాజ్యాల మధ్య మిత్రత్వం ఏర్పడి కొన్ని వివాహ బంధాలు కూడా చోటు చేసుకున్నాయి. హిందూ మహా రాజు పోరస్ లేదా పురుషోత్తముడి భార్య ఆనాడు తమపై దండెత్తిన అలెగ్జాండర్ కు రాఖీ కట్టి యుద్ధంలో తన భర్తను రక్షించుకుందని కూడా చరిత్ర చెపుతోంది.
రాఖీ వంటి సంప్రదాయాలు సమాజంలోని విభేధాలను, శత్రుత్వాలను మరుగు పరుస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. అవి ప్రేమ, అనుబంధం, వంటి భావాలకు ప్రతీకలుగా మానవుల మధ్య నిలచి వారి జీవితాలలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ హిందూ పండుగ వేడుకల వెనుకగల రహస్యాలు ఎప్పటికపుడు సమాజాన్ని ఆనందంలో కొనసాగేలా చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications