Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
రక్షా బంధన్ ....రక్షణకు హామీ ఇస్తున్నా....!

ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణి కట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈపండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది.
చరిత్ర పుటలలో ఈ రాఖీ పండుగ ప్రాధాన్యతను పరిశీలిస్తే....
రాణి కర్ణావతి మరియు చక్రవర్తి హుమయూన్
చరిత్రలో ప్రాచీన కాలంలోనే, ఈ పండుగ రాణి కర్ణావతి మరియు చక్రవర్తి హుమయూన్ ల మధ్య సోదరీ సోదరుల పండుగగా రక్షాబంధన్ కట్టటం జరిగింది. మధ్య యుగంలో రాజపుత్రులు ముస్లిం రాజులనుండి దండయాత్రలను ఎదుర్కొనేవారు. చిత్తూర్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి రక్షించుకోటానికి సోదరిని రక్షించే రాఖీ ని చక్రవర్తి హుమయూన్ కు పంపింది. ఆమె చేసిన ఈ చర్యకు చక్రవర్తి హుమయూన్ గుండె కరిగింది. ఇక అంతే హుమయూన్ తన సైన్యాలను తీసుకొని వెంటనే వెళ్ళి ఆమె రాజ్యాన్ని గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి కాపాడాడు.
అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు రాజు పురుషోత్తముడు
చరిత్రలో మరో పుట తిరగేస్తే, క్రీ. పూ. 300 సంవత్సరంలో మాసిడోనియా రాజు అలెగ్జాండర్ ఇండియాపై దండెత్తాడు. రాజు పురుషోత్తముడు అతడిని ఎదుర్కొన్నాడు. అయితే, పరిస్ధితిని గమనించిన అలెగ్జాండర్ భార్య రాజు పురుషోత్తముడికి రాఖీ కట్టింది. అంతే, రాజు ఆమెను ఒక సోదరిగా ఆమోదించాడు. జరిగిన యుద్ధంలో అవకాశం వచ్చినప్పటికి పురుషోత్తముడు అలెగ్జాండర్ నుండి రక్షించబడ్డాడు.
ఇండియాలోని ప్రతి పండుగకు ఒక మతపర విశేషం ఉంటుంది. అది దేవతలకు సంబంధించినదిగా కూడా ఉంటుంది.
శ్రీ క్రిష్ణుడు మరియు ద్రౌపతి
శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో క్రిష్ణుడు తన చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతూంటే, అక్కడే ఉన్న ద్రౌపతి తన చీర కొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు.
బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి
రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.
సైనిక సిబ్బంది - మన దేశ సైన్యం నిరంతరం మన దేశ సరిహద్దుల రక్షణా భారం చేపడుతూంటుంది. సరిహద్దు ప్రాంతాల గ్రామాల బాలికలు, మన సైనిక సిబ్బందిని తమ సోదరులుగా భావిస్తూ, వారికి రక్షా బంధన్ పండుగ రోజున రాఖీలు కడతారు. మన దేశ ప్రజలను శత్రువలనుండి రక్షించవలసినదిగా కోరతారు.
ఇండియాలో జరిగే వివిధ సాంప్రదాయక పండుగలలో రక్షాబంధన్ పండుగ ఒకటి. సోదరీ సోదరుల మధ్య గల అనుబంధాన్ని ఆచరించే పండుగగా ఇది ఏర్పడింది. కష్టంలోను, సుఖంలోను మీకు ఒక సోదరుడిగా మేము ఉన్నాము...అంటూ చాలామంది పురుషులు, తాము సోదరి సమానంగా భావించే స్త్రీలకు రాఖీలు కట్టటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తోంది.



Click it and Unblock the Notifications