Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పురుషుడికంటే....మహిళకే అధిక ట్రబుల్...!
ప్రేమ అద్భుత ఆనందాలకు నిలయం కాని అందులో తీవ్ర నిరాశలు కూడా ఉంటాయనేది ఒక సామెత. కాగా, ఇటీవల అమెరికాలో ప్రేమ కధలపై రీసెర్చి చేయగా అందులో సుమారు 44 శాతం మహిళలు తమ ప్రేమ విఫలమైనందుకు విడిపోయినందుకు తీవ్రంగా బాధ పడగా, పురుషులు మాత్రం 19 శాతం వరకే ....పోతే పోయిందిలే....ఐ యామ్ హేపీ అనేశారట. ఒక మంచి సంబంధాన్ని వదిలేసినా, చెడు సంబంధంలో ఎక్కువ కాలం ఉన్నా లేక మీరు ప్రేమించిన వారిని బాధించినా...మహిళలు మాత్రమే బాధ పడతారని పరిశోధన తెలుపుతోంది.

ఒక సంబంధాల నిపుణులు డా. సీమా హింగోరాణి మేరకు మహిళలు జరిగిన ప్రేమ విఫలతలకు పురుషులకంటే కూడా అధికంగా బాధ పడతారట. మరి ఈ రకంగా విఫలత సంబంధాలలో మహిళలు చూసేదేమిటి? అసలు సంబంధం కొరకు అధికంగా ఆరాట పడితే, అది త్వరలోనే కూడా విఫలత చెందే అవకాశం ఉంటుందంటారు నిపుణులు. నాలుగేళ్ళు చెట్టా పట్టాలేసుకొని జంటలు ఆనందించేసినా, పెళ్ళి దగ్గరకు వచ్చే సరికి పురుషుడు రెడీగా ఉండడు. అపుడే ఏం తొందర డార్లింగ్ అంటాడు. అది విఫలం కావటం మహిళ బాధ పడటం జరుగుతుంది. మహిళ తొందర పడుతోంది అంటే, ఆమెకు కుటుంబ సభ్యులనుండి, సమాజం నుండి ఒత్తిడి ఉంటుంది. అన్నిటికి మించి ఆమె గర్భవతి అయితే, మరి మరింత త్వరపడాల్సిందే. భవిష్యత్తుపై కావలసినంత బెంగ ఆమెకు ఉంటుంది. మరి కొంతమంది జంటలు, ఎన్నాళ్ళు తమ సంబంధం కొనసాగినా, ఇరువురూ కూడా వివాహం ఊసే ఎత్తనివారు కూడా ఉంటారు.
సంబంధం బోర్ కొట్టేస్తే, కొత్త రకాలుగా ఆనందించండి. కలసి సమయం గడపండి. మరోమారు మీలోని ఉత్సాహం రగిలించండి. మహిళలకు భావోద్రేకాలు అధికం. కనుకనే వారు సమస్యలను ఆలోచిస్తారు. దానికి కారణం వారిలోని హార్మోన్లు కూడాను. ఒక సంబంధం విఫలం అయితే, వివిధ కారణాలుగా ఆమే మరి బాధ పడేది. మహిళ జీవితంలో వయసు ప్రధానం. ఆమె వివాహం, పిల్లలు, తన భధ్రత, ఆనందం అన్ని ఆలోచిస్తుంది. ఏదేని తప్పు జరిగితే తాను ఆశించిన దానికి వ్యతిరేకమైతే, నిందలు ఆమెకే. తనను తానే నిందించుకుంటుంది.
సంబంధం విఫలమైతే ఆమె తప్పు తనపైనే వేసుకుంటుంది. ఆమె బాధ పడేందుకు కారణం హృదయ సంబంధిత హార్మోన్లు ఆమెలోనే అధికంగా రిలీజ్ అవుతాయి. అంతేకాదు సంబంధ విఫలతలో బాధ పడేది ఆమె. కాని పురుషుడు మరోమారు వెనక్కు తిరిగి చూడకుండా జీవితంలో ముందురకే సాగిపోతాడు. మొదటిలో పురుషుడు మహిళ అవసరాలను తీరుస్తారు. కాని క్రమేణా వారు తప్పుకుంటారు. అపుడే ఆమె మోసగించబడ్డానని భావిస్తుంది. గతంలో మహిళలు పోయిన అవకాశాల గురించే ఆలోచించేవారు. కాని నేటి మహిళలు పరిస్ధితి విఫలం అయితే, ఎలా వెనక్కు మళ్ళాలో కూడా తెలిసి కొంటున్నారు.



Click it and Unblock the Notifications
