Latest Updates
-
ఫిల్టర్స్, మేకప్‌తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.! -
కోయంబత్తూర్ అన్నపూర్ణ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా..పూరీ,ఇడ్లీ,చపాతీ,పలావ్ లోకి కేక! -
జూన్ 17-23 వార ఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం.. మీ రాశి ఉందా? -
పురుషుల్లో వంధ్యత్వం.. వీర్యకణాల సంఖ్యను పెంచే యోగాసనాలివే.! -
జూన్ 17 గ్రహాల సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, జాక్ పాట్ మీదే! -
బుధవారం గణపతి, విష్ణు పూజతో జ్ఞానం, ఐశ్వర్యం.. ఈ మంత్రం పఠిస్తే చాలు.! -
కార్తీక మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనదిప్రతి సోమవారం దీపం ఎందుకు వెలిగించాలి? -
నేడు ఆకాశంలో అద్భుతం: బుధ గ్రహం దర్శనం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు! -
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.!
ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన పెళ్లి.. ఛాయిస్ మీదే..!
ఇద్దురు వ్యక్తుల మధ్య శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన అన్యోన్య బంధమే పెళ్లి. స్పష్టంగా చెప్పాలంటే పెళ్లనేది భాగస్వాముల మధ్య ప్రత్యేకమైన వ్యక్తిగత అనుబంధం ఏర్పడేందుకు పునాది. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిపై మరొకరు ఆధారపడి షరతులు లేని ప్రేమాభిమానాలతో సాగిపోయే జీవితానికి ఆహ్వానం పలికే ఒక మధురమైన సన్నివేశం.
పెళ్లి కేవలం భార్యాభర్తలు సంసార సుఖం అనుభవిస్తూ పిల్లల్ని కనడం కోసమే కాదు. తోడుగా, నీడగా కష్టసుఖాల్లో, ఆరోగ్య, అనారోగ్య సమయాల్లో, ఎండా వానల్లో ఒకరికొకరు ఆసరాగా ఉంటూ దాంపత్య మాధుర్యాన్ని పొందడం కోసం. భాగస్వామి పట్ల అంకితభావం ఎంతో ముఖ్యం. పెళ్లితో మనుషుల జీవితాల్లో చాలామందికి ఒక కొత్త మలుపు మొదలవుతుంది. మతాలు ఏవైనా పెళ్లి అనేది భాగస్వాములు జీవితకాలం కలిసి ఉండాలన్నది ప్రధాన ఆశయం.గతంలో తల్లిదండ్రుల ఇష్టానుసారం పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు పెళ్లికి ముందే యువతీ యువకుల స్నేహాలు, ప్రేమలు, డేటింగుల వంటివి జరుగుతున్న సందర్భాలున్నాయి.
తెలిసి తెలియని ఉరకలు వేసే వయస్సు, ఒకరినొకరి ఇష్టపడి, ప్రేమ మొదలై పెళ్ళిళ్లకు దారితీస్తోంది. అంతటితో సవ్వంగా ఉంటే పర్వాలేదు. కానీ ఆ ఇద్దరి మధ్య జీవితంపై అవగాహన లేక, పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్న జంటలు ఎన్నోఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం వారికి సరైన మార్గదర్శకాలు చెప్పేవారు లేకపోవడం, ఆపైన కొన్ని లైంగిక భ్రమలు వీరిని ఈ స్థితికి తెచ్చిపెడుతున్నాయి.

ప్రేమ... పెళ్ళి రెండూ అవ్వగానే.. వెంటనే పిల్లలు..కొద్దిరోజూలు అన్యోన్యంగా గడిపిన వారు రెండు మూడు సంవత్సరాలకే విడిపోవడంతో తీవ్రంగా నష్టపోయేది వారి పిల్లలు. వారి జీవితాలకు కావలసిన రక్షణ కరువైపోతోంది. ఈ విషయంపై విడాకులు తీసుకునే దంపతులు ఆలోచించే స్థితిలో ఉండరు. పెళ్లనేది ఆట కాదు. తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుని తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు.
కళలు కనే జీవితానకి, నిజజీవితం భిన్నంగా ఉంటుంది. చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో పూలపాన్పుల కన్నా ముళ్లబాటలే ఎక్కువగా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు జీవితాలు ఉండాలని తప్పటడుగులు వేయకూడదు. భార్యాభర్తల మధ్య సామాజిక, ఆర్థిక, ఆవేశ, మేథో పరమైన సమతుల్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద అగాధాలు సృష్టించే ప్రమాదం ఉంది. గ్యాస్ అయిపోయించి బుక్ చేయండంటే.. సరే అని మరుసటి రోజు ఆఫీసులో బిజీగా ఉండి మరిచిపోయాను అని చెబుతుంటారు. వంటింట్లో కుళాయి లీకవుతుంటే బాగు చేయించమని భార్య చెబుతుంది. పని ఒత్తిడిలో వాయిదాలు వేయడం మంచిది కాదు. ఏపని అయినా ఇద్దరు షేర్ చేసుకొని పూర్తి చేసుకొడం మంచి పద్దతి.
ముఖ్యంగా కొంత మందికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. తన సొంతం అనే భావన అధికంగా ఉండే భాగస్వాముల్లో అసూయ వస్తుంది. భాగస్వామి శరీరం, మనసు, తెలివి, ప్రవర్తన వంటివి అన్నీ తనవి మత్రమే అనుకునే వారుంటారు. ఇది ఎలుగుబంటి కౌగిలి మాదిరి తయారవుతుంది. మనసు అర్థం చేసుకుని ఒకరినొకరు ఊపిరి పీల్చుకునే వ్యవధిని సమకూర్చుకోవాలి. భాగస్వామితో వ్యంగ్యంగా మాట్లాడ్డం లేదా మౌనంతో ఇబ్బంది పెట్టడం వంటి ఆయుధాలు ఎప్పుడూ ప్రయోగించకూడదు. భావాన్ని స్పష్టంగా చెప్పగల్గడం, ఇద్దరు తమ సమస్యలు చర్చించిచుకొని పరిష్కరించుకోవడంతో అన్యోన్య దాంపత్యానికి సహకరిస్తాయి.
ప్రేమతో చేసే పనులను చిరు అభినందనలతో మెచ్చుకోవడం, గుర్తించినట్లు సంకేతాల ద్వారా తెలియజేయడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామి 'ఇగో'ని ప్రదర్శించకూడదు. దానిని గౌరవించడం మరువకూడదు. ఇద్దరూ సర్దుకుపోయే ధోరణి అలవరచుకుంటే వారి సంసారం చూడముచ్చటగా ఉంటుంది. అతిగా పొగడనవసరం లేదు. పెద్ద మనిషి తరహాగా, ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి. దానివల్ల వారి జీవితం ఆనందమయం అవుతుంది.
శాంతంగా ఉండాలి!భాగస్వామి తాను చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఏం చెప్పదలచుకున్నారో దాన్ని వారి శరీర భాష ఆధారంగా గ్రహించగల్గాలి. చెప్పలేక పోతున్న విషయాలను కూడా ఊహించగల్గాలి. ఉత్సాహంగా ఏదైనా చెపుతున్నప్పుడు వినాలి. మధ్యలో అడ్డుతగలకూడదు. భాగస్వామి చెప్పేదాన్ని ఖండించకూడదు. మనిషి ఆత్మగౌరవం దెబ్బతిందంటే వివాహ పునాదులు కదిలిపోతాయి.
ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండవు. వాగ్యుద్ధాలు జీవితాన్ని విషాదం వైపు తీసుకుపోతాయి. ముఖ్యంగా పడకగదిలో సమస్యలను చర్చించడం మొదలుపెట్టకూడదు. స్నేహితులు భాగస్వాములుగా ఉండరు. భాగస్వాములు స్నేహితులుగా ఉండరని చాలామంది నమ్మకం. కాని భాగస్వామి స్నేహంగా ఉన్నప్పుడే జీవితం అన్ని విధాల వికసిస్తుంది.



Click it and Unblock the Notifications