Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
డేటింగ్ లైఫ్: అమ్మాయిల నుంచి అబ్బాయిలు కోరేదేంటి?
చాలా మంది పార్ట్నర్స్ కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు డేటింగ్(సహజీవనం) చేసిన తర్వాత, మహిళలు వారి పార్ట్నర్ కి అసలు ఏం కావాలి అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఫీలవుతారు. అదేవిధంగా మగవారు కూడా భావిస్తారు. అటువంటి వారి ప్రకారం మగవారు మహిళల మనస్సును తెలుసుకోలేరు మరియు వారికి వాస్తవంగా ఏం కావాలని కూడా గ్రహించలేరు. ఇలా సంతోషంగా గడిపే ఇద్దరు పార్టర్స్ మధ్య పోట్లాట మొదలైందంటే దాని పర్యవ్యసనం ఎంత వరకూ దారితీస్తోందో ఎవ్వరికీ తెలియదు.
ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు... వారి మనస్సులు కూడా కలిసి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొన్నప్పుడే వారి జీవితం సవ్వంగా సాగుతుంది. అయితే మీరు ఇప్పటికే మీ పార్ట్నర్ తో చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నట్లేతే కనుక మీ పార్టర్ మీలో ఏం కోరుకుంటున్నాడో... వాటి యాక్షన్ మరియు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోండి... సహజంగా అన్ని సమయాల్లో మీ పార్ట్నర్ మీ నుండి ఏమి కోరుకుంటాడో తెలుసుకొని మీ సంబంధాన్ని బలపలరచుకోవడానికి కొన్ని సాధారణ విషయాలు మీ కోసం..

నీ జీవితాన్ని మొత్తం నాకు ఇచ్చేయాలంటారు?: ఒక వేళ పార్ట్నర్(మ్యాన్) తన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, తనకు కాబోయే పార్ట్నర్ మాత్రం తనకోసంమే జీవించాలనే విధంగా కోరుకుంటారు. పూర్తి దృష్టిని, ఆమె సమయాన్నంత అతని కోసమే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అతను ఏమి చెప్పినా ఒక తోలు బొమ్మలాగా జీవిత కాలం బానిసలా పడిఉండాలని కోరుకొంటాడు. మెన్ సాధారణంగా ఫ్రెండ్స్ తో గడపాలన్నా.. ప్రశాంతత కావాలన్ని, పార్ట్నర్ ను అవాయిడ్ చేసి సంతోషంగా గడపగలడు. అదే పార్ట్నర్ (మహిళ) ఆ విధంగా ప్రవర్తించినప్పుడు తప్పనిసరిగా గొడవలు మొదలవుతాయి.
అతని దారిలోనే నడవాలనే ఆంక్షలు పెడతారు?: ఎందుకో తెలియదు కానీ, ఈ విషయంలో మాత్రం ఎప్పటికీ ఆడవారిని, మగవారు డామినేట్ చేస్తూనే ఉన్నారు. వారే పై చేయిగా వుండి ఆధిపత్యం చేయాలని అనుకుంటారు. ఏ పనిచేసినా అతనికి తెలిసే చేయాలి. అతని కంట్రోల్లోనే ఉండాలి. మీలో అతనికి నచ్చని నడవడిక మీలోలోపాన్ని వెదికి మరీ దాన్ని మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మార్చుకోవాలి వత్తిడి చేస్తాడు. ముఖ్యంగా ఇది ఒక్కటే ప్రతి ఒక్క మగవాడు వారి పార్ట్నర్స్ నుండి కోరేది. ఉదాహరణకు గతంలో నీవు జీవించిన విధానం, నీకు నచ్చిన విధంగా మెలగడం, స్వేచ్చగా తిరగడం వంటి వాటిని అతను మొదట్లో ఇష్టపడ్డా... తర్వాత తర్వాత కొన్ని నెలలు...కొన్ని సంవత్సరాల తర్వాత అవన్నీ విరుద్దగా భావిస్తాడు. క్రమక్రమంగా అవన్నీ అతని కోపంతో, ఆధిపత్యంతో బయటపడుతాయి..ఇలాంటి గమనించాలి.
మేల్ ఫ్రెండ్స్(బాయ్ ఫ్రెండ్స్) ఉండకూడదంటారు?: చాలా మంది మగవారు, తమ పార్ట్నర్ కు ఇతర మేల్ ఫ్రెండ్స్ ఉండకూడదనే అనుకుంటారు. ఎక్కువగా తనతోనే గడపాలి. తనతోనే ఫ్రెండ్ షిఫ్ గా ఉండాలి. లేదా కొంత మంది ఫీమేల్(ఆడవారు)తో ఫ్రెండ్ షిప్ చేయొచ్చు కానీ....ఇతర బాయ్ ఫ్రెండ్స్ మాత్రం ఉండకూడదని కోరుకుంటారు. బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే వారి పార్ట్నర్ గురించి అంతాగా పట్టించుకోకుండా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. అయితే అదే సమయంలో స్త్రీలు కూడా తన పార్ట్నర్ ఇతర గర్ల్ ఫ్రెండ్ తో తిరగం సహించలేరు. అయితే బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడినా, తిరిగినంత మాత్రానా వారు పట్టించుకోలేదు అంటే అతనికి మీ మీద భద్రతలేదని మాత్రం చెప్పలేం... మీ మీద నమ్మకమే అలా చేయించి ఉండవచ్చు...
నా తర్వాతే ఎవరైనా..!: సాధారణంగా మగవారు చిన్న పిల్లల మనస్థత్వాన్ని కలిగి ఉంటారంటారు. ఎందుకంటే ఎప్పుడూ వారు పార్ట్నర్ వారి మీద దృష్టి పెట్టాలని భావిస్తుంటారు. తల్లిదండ్రలు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడరుకొన్నట్లు... మగవారు తమ పార్ట్నర్ అలా చూసుకోవాలని ఆశిస్తాడు. ప్రతి మగవాడు తన పార్ట్నర్ తన స్వంతమనుకుంటాడు. అందుకే ఎప్పుడూ మగవారు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. ఇవన్నీ మగవారు తన పార్ట్నర్ నుండి కోరుకొనే సహజమైనటువంటి విషయాలు...ఇది మీరు అంగీకరిస్తారా...? ఇలాంటి సందర్భాలు మీకు ఎదురైనాయా...?



Click it and Unblock the Notifications
