Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
వివాహం తర్వాత మీరు ఆశించే కొన్ని ఫన్నీ విషయాలు..!
వివాహం అనేది జీవితంలో ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం. పెళ్ళి చూపులు లేదా నిశ్చితార్ధం జరిగినప్పటి నుండి స్త్రీ మరియు పురుషుల మనస్సులో ఏదో ఆందోళన.. అలజడి. స్త్రీ మనస్సులో ఇంట్లో వారిని వదిలి వెళ్ళాల్సివస్తుందని..అత్త ఇంట్లో ఎవరూ ఎలా ఉంటారో తెలియదు..వారితో ఎలా నడుచుకోవాలని, వంటవార్పులు ఎలా చేయాలని భయపడుతుంటారు. పెళ్ళి జరిగే వరకూ మనస్సులో ఇవే ఆలోచనలు. పెళ్ళి జరిగాక ఉదా: పెళ్ళి చేసుకొన్న తర్వాత వంట చేయక తప్పదు. బ్యాచులర్ గా ఉన్నప్పుడు వంటింట్లో అడుగు పెట్టరు. చేతులు కాల్చుకొని ఉండరు. అయితే పెళ్ళి తర్వాత ఇవన్నీ ఖచ్చితంగా నిర్వర్థించాల్సిన బాధ్యతలు.
ఇలా ప్రయోగాత్మకంగా చేసేవి కొన్ని తమాషాగా అనిపిస్తాయి. పెళ్ళి చేసుకొన్న తర్వాత అలాంటి కొన్ని ఫన్నీ విషయాలు అనుభవపూర్వకమైనవి కొన్ని మీకోసం అందిస్తున్నాం. చాలా సార్లు ఈ విషయాలు ప్రాక్టికల్ గా కంటే ఫన్నీగా కనిపిస్తాయి. మీరు నిజాలు తెలుసుకొన్న తర్వాత నవ్వకమానరు...!

హోమ్ ఫుడ్ ను ఇష్టపడాలి లేదా ఆశించాలి : పెళ్ళి తర్వాత ఈ అలవాటును అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. చాలా వరకూ ఎక్కువసార్లు భయటే భోజనం చేసేస్తుంటాం. అదే పెళ్ళైన తర్వాత వారి భార్యలు వండిపెట్టే ఇంటి ఫుడ్ తో ఎంచక్కా పొట్టలు పెంచేసుకోవచ్చు. అందుకే ఇంటి ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.
మీరు నిజంగా చెప్పకపోతే: వివాహం చేసుకొన్న తర్వాత తరచూ పొగడ్తలు ఇస్తూ ఉండాలి. సరదాగా అలా పొగడలేదనుకోండి, తర్వాత బయట ఫుడ్ కే కొన్ని రోజులు పరిమితం కావాల్సి ఉంటుంది. కాబట్టి, కొత్తగా వచ్చిన భార్య అంత పెద్ద కుక్ కాకపోయినప్పటికి భర్త మాత్రం అప్పుడప్పుడు అభినందిస్తుండాలి.
చిన్న చిన్న గొడవలను ఆహ్వానించండి: పెళ్ళి తర్వాత ప్రతి స్త్రీ పురుషుల విషయంలో సాధారణంగా జరిగే ఫన్నీవిషయాల్లో ఇది ఒకటి. చిన్న చిన్న చిలిపి గొడవలు, పోరాటాలు భార్య భర్తల సంబంధాన్ని బలపరచడమే కాదు..ఆరోగ్యకరమైనది కూడా. అలాంటి పోరాటాలు మీ వైవాహిక జీవితంలో కొన్ని టిట్ బిట్స్ ఉన్నాయి.
అత్తగారితో చిన్న గొడవలు: స్త్రీ, పురుషులందరూ పెళ్ళి తర్వాత ఇలా అత్తలతో పోట్లాటను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పెళ్లి తర్వాత అతి సాధారణ మరియు చిన్న విషయాలకు గొడవులు రావడం అనేది సహజం. అందుకు సరైన అవగాహన మరియు అత్తగారితో సర్దుబాటు లేకపోవడం కనిపిస్తుంది. వివాహం తర్వాత అత్తగారి పోరాటాలు ఎదుర్కోవడానికి గొడవకు కారణం అయిన విషయాన్ని అవాయిడ్ (తొలగించుకోవడం) చేయడం మరియు సున్నితంగా మెయింటైన్ చేయడం ఈ రెండే ముఖ్యమైన ట్రిక్స్...
ఆమెను పొగడాలి: స్త్రీ రెడీ అవ్వడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అయితే ఇది చూడటానికి కొంత ఇబ్బందిగా మరియు తమాషా అనిపించినా...ఇందంతా భర్తను ఆకట్టుకోవాడానికి మరియు ఆసక్తి కలిగించడానికి ప్రయత్నిస్తారని తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఎదుటి వారిని సంతోష పెట్టడానికి చేసే ప్రయత్నం మీకు చాలా మంచి ఫీల్ కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
