Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఈ వార్షికోత్సవానికి మీ భర్తకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు.?
ప్రతి ఏడాది చాలా జంటలు వారి వార్షికోత్సవాన్ని అదే ఉత్సాహం, ప్రేమతో ప్రతి ఏటా జరుపుకుంటారు. మీరు కూడా అటువంటి ఒక జంట అయితే, శుభాకాంక్షలు! ఈ ఏడాది మీ వార్షికోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి మీరు ఏమి చేయవచ్చో తెలుసుకొందాం రండి. వార్షికోత్సవం రోజున ప్రతి ఏటా మీరు ఎంచుకొన్న ఒక రెస్టారెంట్ లో ఆ మార్పులేని విందులు, ఆ విసుగుపుట్టించే కుటుంబాల కలయిక వంటి వాటి కంటే ముందుకు పోవడానికి ఈ పేజి మీకు సహాయం చేస్తుంది. మీ భర్తను ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన బహుమతితో ఆశ్చర్యపరచాలంటే ఈ క్రింది ఆలోచనలను తనిఖీ చేయండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
ఆ రోజును ఒక ప్రేమలేఖతో మొదలు పెట్టండి: మీరు అతన్ని ప్రేమిస్తున్నారని చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఎల్లప్పుడు సంతోషకరమైన వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి మూడు అద్భుతమైన పదాలను అతని చెవిలో చెప్పవచ్చు, కాని ఈ ఏడాది దీనిని కొద్దిగా రుచికరంగా చేద్దాం. అందుకని, ఒక కాగితం, పెన్ను తీసుకోండి. ఇప్పుడు, అతని గురించి మీరు మెచ్చిన అంశాలు వ్రాయండి, ఈ ఏడాది అతను మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి చేసినవి రాయండి. ఈ ప్రేమలేఖను కేవలం చేతికి అందివ్వకండి. అతని కారు డాష్ బోర్డ్ పై పెట్టండి, అతను చిన్న పని పై బయటకు వెళ్ళగానే, అతనికి ఫోన్ చేసి ఉత్తరం చదవమని చెప్పండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
అతని శరీరాన్ని మర్దన చేయండి: మంచిది, దీని వలన తిరిగి ప్రేమ పుడుతుంది! మీ భర్తను మీరు నిజంగా గారాబం చేయాలనుకొంటే, అతనికి వేడి శరీర మర్దన చేయండి. మర్దన గదిని సువాసన కొవ్వత్తులతో, తక్కువ కాంతిదీపాలతో అలంకరించడం మరవకండి. రోజు చివరలో అతనికి మర్దన చేయండి అందువల్ల బయట చీకటిగా ఉంటుంది, మనసులో ప్రేమ వెలుగును నింపుతుంది. మీరు టేబుల్ పైన కూడా తక్కువ కాంతి వచ్చే దీపాలను, దీపాల అలంకరణ సామాగ్రిని వాడి పరిసరాలను ఆరాధనీయంగా కూడా చేయవచ్చు.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
అతని ఇష్టమైన వంటకాలు అన్ని వండండి: మీరు అతన్ని కొన్ని కిరాణా వస్తువుల కోసం లేదా ఏదో పని మీద బయటకు పంపండి. ఈ సమయాన్ని అతను తినడానికి ఇష్టపడే ప్రతి వస్తువును వండటానికి కేటాయించండి. అతనికి ఇష్టమైన కేకు, భోజనం, పానీయాలు, స్నాకులు వంటి వాటితో అతన్ని ఆశ్చర్యపరచండి. మీకు కొంత ఎక్కువ సమయం ఉంటే, ఇంటిని అలంకరించడానికి దానిని కేటాయించండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
ఒక చిన్న ప్రయాణాన్నిబహుమతిగా ఇవ్వండి: మీ భర్త కష్టపడి పని చేస్తూ, తీవ్రమైన పని వలన తరచూ ఒత్తిడికి లోనవుతుంటే, ఒక గొప్ప చిన్న ప్రయాణాన్ని అతనికి బహుమతిగా ఇవ్వండి. మీరు హవాయి, మాల్దీవులు లేదా ఏదైనా ప్రాంతానికి విశ్రాంతి పొందటానికి వెళ్ళవచ్చు. అతను ఎల్లప్పుడు వెళ్దామని అనుకొనే ప్రాంతానికి రెండు టికెట్లను వెంటనే కొనండి. చిన్న ప్రయాణానికి అర్జంటుగా కావాలంటే వెంటనే సెలవు ఇవ్వకుండా చిరాకు పుట్టించే బాస్ ఉంటే మీ భర్తను వార్షికోత్సవానికి కొన్ని రోజులు ముందే సెలవుకు దరఖాస్తు చేయమని చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో అతనికి చెప్పకండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
విలువైన పరికరాలు అతనికి ఇవ్వండి: అతను రాజునని ఊహించుకొనే విధంగా మీ భర్తకు ఖరీదైనది ఏదైనా ఇవ్వండి. 24 క్యారెట్ల బంగారు మెడగొలుసు, మందమైన ప్లాటినం గొలుసు లేదా వజ్రాలు పొదిగిన ఒక రిస్ట్ వాచీని బహుమతిగా ఇవ్వండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వండి: కొంత మంది మగవారికి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద మోజు ఉంటుంది. మీ భర్త అటువంటి మనిషి అయితే, అతను కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువును మీరు బహుమతి గా ఇవ్వండి. ఒక మంచి సెల్ ఫోన్, ఒక ల్యాప్ టాప్ లేదా అతనికి నచ్చిన ఇతర వస్తువును బహుమతిగా ఇవ్వండి.

ఈ వార్షికోత్సవానికి మీ భర్త కోసం ఓ మంచి గిప్ట్ ఐడియా...!
అతనికి బట్టలు కొనండి: బిజినెస్ సూట్స్ మగవారికి ఉత్తమమైన వార్షికోత్సవ బహుమతులు. వీటి వలన వారు ఇంకా అందంగా కనిపిస్తారు. తన సమావేశాలలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఒక అర్మాని లేదా వేరొక ఖరీదైన బిజినెస్ సూట్ ను మీ భర్త కోసం కొనండి. వార్షికోత్సవ బహుమతులుగా పనికి వచ్చే చాల రకాల వస్త్రాలు దొరుకుతాయి.



Click it and Unblock the Notifications
