Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శృంగార జీవితానికి సరసం..విరసం చాలా అవసరం..!
దంపతులు తమ దాంపత్యంలో విసుగుదలను పోగొట్టుకోవాలనుకుంటే వారిద్దరి మధ్యా సరసానికి తగినంత స్పేస్ వుండాలి. కొత్తగా పెళ్లయిన వ్యక్తులు కూడా ఇటీవల, వయసు మీద పడిపోయిన వాళ్లల్లా వ్యవహరిస్తు న్నారు. పెళ్లి కాగానే తమకు అంతకు ముందు లేని పెద్దరికం వచ్చేసినట్టుగాను, తామిక చిన్న పిల్లలం కాదు బాధ్యతగా వుండాలి అనే వైఖరితోను వుంటున్నారు. బరువు బాధ్య తలు తీసుకోవడం తపకాదు కానీ అదే పనిగా వాటిగురించి ఆలోచిస్తూ గడపడం వారిలో వున్న చిలిపితనానికి స్వస్తి చెబుతుంది. ఆ చిలిపితనమే వారి దాంపత్య జీవితాన్ని పరిమళభరితం చేస్తుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య లైంగిక విన్యాసాలకు అవరోధమవుతుంది. ఫలితంగా వారిరువురి సెక్స్ జీవితం, ఒక తప్పని సరి అంశంగా మాత్రమే మిగిలి పోతున్నది. దంపతులు ఏ వయసులో వున్నవారైనా ఎప్ప టికీ అమర ప్రేమికులే ! ఈ సంగతిని వారు గుర్తించాలి.
వారి మధ్య మధుర భావనలకు వయసు మళ్లదు. ఆ మధుర భావనల్లో సరసం ఎంత ముఖ్యమో విరసం అంటే చిలిపి తగాదాలు కూడా అంతే ముఖ్యం. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టేసినా సరే ఇంకా టీనేజీ ప్రేమి కుల్లానే పడక గదిలో వుండగలిగితే అది వారి దాంపత్య జీవితాన్ని ఇంకా ఇంకా మధురం చేస్తుంది. నిరంతరం ఒకే విధమయిన జీవితాన్ని గడిపే భార్యా భర్తలు మధ్య సరస సల్లాపాలు ఒక రిలీఫ్‌ను కలిగిస్తాయి. నవ్యతను అందిస్తాయి. సరసంలో భాగంగా ఒకరినొక రు పొగుడుకోవడం, ఒకరి విషయాలను మరొకరు ఆరాధనా పూర్వకంగా మెచ్చుకోవడం చేస్తే ఒక విధమై న ఆనందం కలుగుతుంది. అలాగే అపుడపుడు పెట్టుకునే గిల్లికజ్జాలు కూడా వారి ఇరువురిని దగ్గర చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, శృతి మించని ఈ తగాదాలు వారిద్దరి మధ్యా నెలకొని వున్న స్తబ్దతను పోగొడతాయి.

కోపం నటిస్తూ, వాదులాడుకోవడం, ఒకరినొకరు కసురుకోవడం, ఒకరి నించి ఒకరు తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించడం వారిని పట్టుకోవాలని పరిగెట్టడం, ఈ నేపథ్యంలో కిందా మీదా పడడం, పక్కమీద దొర్లడం, ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకోవడం లాంటి చేష్టలు వారిని తెలియకుండానే కలుపుతాయి. రతికి అసలైన రంగాన్ని సిద్ధం చేస్తాయి. రతి భాగస్వామ్యంలో ఇలా వ్యవహరించడాన్ని పాశ్చాత్య సెక్సాలజిస్టులు రోయింగ్ అని అంటారు. రోయింగ్‌లో భార్యభర్తలు తమ తమ లైంగిక అభిరుచులను చెప్పకనే చెబుతారని ఆ భావ వ్యక్తీకరణలో వారిద్దరి నడుమ మనసుకు హత్తుకునే అనుబంధం ఏర్పడుతుందని అంటారు.



Click it and Unblock the Notifications
