Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
మీటింగుల్లో చేయకూడాని 10 ముఖ్యమైన పనులు?
అందరిలోకి భిన్నంగా కనపడాలన్నా, అభిమానాన్ని పొందాలన్నా, పైఅధికారి నుంచి మంచి మార్కులు సంపాదించాలన్నా మీ నడక, దుస్తులు మీరు చేస్తున్న వృత్తి దృక్పథాన్ని వ్యక్త పరిచేలా ఉండాలి. అప్పుడే మంచి ప్రొఫెషనల్‌గా గుర్తింపు పొందుతారు. తగిన గౌరవం లభిస్తుంది.
ఆఫీస్ మీటింగులు ఎంతో ఆవశ్యకమైనవి. అంతే కాకుండా అని మీ కెరీర్లను బాగుచేయనూవచ్చు లేకా పాడుచేయనూవచ్చు. మీరు నిజంగా మీ ఉద్యోగాన్ని ప్రేమించేవారే అయితే, ఆఫీస్ మీటింగులో ఈ పది పనులూ చేయకుండా వుండండి.
1. ఆలస్యంగా వెళ్ళకండి. కొంచెం ముందే వెడితే మంచి సీటు కూడా దొరుకుతుంది కదా!
2. సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధపరచు కోకుండా వెళ్ళకండి. దానివల్ల అభాసుపాలవుతారు.
3. ముందుగా మీ సీనియర్లను మాట్లాడనివ్వండి. వారు మాట్లాడుతుంటే మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి. మిమ్మల్ని ఏదైన అడిగినప్పుడే నోరు మెదపండి.
4. ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడకండి. దానివల్ల అనవసరపు వాగ్వాదాలు చెలరేగుతాయి.
5. వక్రభాష్యాలు వద్దు. అవతలివారి మాటలను శ్రద్ధగా వినండి. అప్పుడు మీరు వారిని అపార్థంచేసుకునే ప్రమాదం వుండదు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా, స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడండి.
6. భయకంపితులు కాకండి. దురదుష్టవశాత్తు కొందరు ఉద్యోగులకు సమావేశాలంటే రణక్షేత్రాలే. మీరు బాధితులైనట్లైతే మిమల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి... అంతేగాని భయపడిపోకండి.
7. సమావేశంలో చూయింగ్ గమ్ నములుతూ కూర్చోకండి. ఇది అవతలవారికి మీపట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. అమర్యాదకరమైనది.
8. సెల్‌ఫోనుని స్విచాఫ్ చేయండి. సమావేశ సమయంలో మీ సెల్ మోగుతున్నట్లైతే అది సమావేశానికి భంగం కలిగిస్తుంది. మాట్లాడటం అసలే కూడదు.
9. సమావేశపు ఎజెండాను హైజాక్ చేయకండి. మీరు, మీ సహోద్యోగులు, ఉన్నతాధికారులు ప్రధానంగా ఏ విషయాలపై దృష్టి పెటాల్సి వుందో అవి పక్కదోవ పట్టకుండా చూస్తూండండి.
10. సమావేశానికి గైరుహాజరు కాకండి. ఇది చాల హేయమైన చర్య. మీ పై అధికారులు దానిని సీరియస్‌గా తీసుకోవచ్చు కూడా.



Click it and Unblock the Notifications

