Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
వీగిపోయిన నిశ్చితార్థం నుండి బయటపడటం ఎలా?
ఒక వీగిపోయిన నిశ్చితార్థం మర్చిపోవటం అంత సులభం కాదు - మీ కలలు, ఆశలు, మరియు భవిష్యత్తులోని కోరికలు అన్ని పూర్తిగా ఒక క్షణంలో కొట్టుకుపోతాయి. పెళ్లి పత్రికలు చుట్టూ ఉండిపోతాయి, సూటు లేదా డ్రెస్, వార్డ్రోబ్లో వ్రేలాడుతూ ఉంటుంది మరియు ఆహ్వానాలు పంపించకుండా ఉండిపోతాయి. ఈ వ్యాసం, మీరు విరిగిన నిశ్చితార్థం షాక్ నుండి కోలుకుని, మీ కోసం ఒక కొత్త మరియు గొప్ప భవిష్యత్తు కోసం మొదలుపెట్టే మార్గాలను సూచిస్తూ వ్రాసినది.
ఇక మీ జీవిత భాగస్వామి గురించి ఎప్పుడు ఆలోచించను అనే ఆలోచనను రానివ్వవొద్దు. ఆలోచించాలి, ఇప్పుడే కాదు. ఎటువంటి పరిస్థితులలో కూడా మిమ్మలిని మీరు తక్కువ చేసుకోవొద్దు. అది మీ ఒక్కరే ఎదుర్కోవటం కాదు, ఇద్దరు ఎదుర్కోవలసిన పరిస్థితి.

జ్ఞప్తిచేసేవాటిని తొలగించండి
మీ గతప్రియుడి గుర్తుకు తెచ్చేవాటిని మీ పరిసరాలనుండి తొలగించండి. మీరు జ్ఞాపకాల నుండి మరలటానికి ఇది చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏమిటంటే వాటిని బయటకు విసరివేయాలి లేదా ఒక పెట్టెలోనన్నా పెట్టాలి.

మీ భావోద్వేగాలు బయట పెట్టండి
కొన్ని రోజుల వరకు బాధలో పడి, ఏడవండి. ఏదిఏమైన, మీరు క్రొత్త జీవితం ప్రారంభించటానికి, మీ జ్ఞాపకాలనుండి బయటకు రావటానికి ఒక గడువు పెట్టుకోండి. ప్రపంచంలో గాని, లేదా విశ్వంలో గాని ప్రతి ముగింపు ఒక క్రొత్త ప్రారంభానికి నాంది అవుతుంది.

ఇతరులకు తెలపండి
మీ మీద మీకు నమ్మకం ఏర్పడిన తరువాత, అందరికి మీ వీగిపోయిన నిశ్చితార్థం గురించి, పెళ్లి జరగబోదని తెలపండి. యెంత త్వరగా తెలియజేస్తే అంత మంచిది, ఎందుకంటే వారికి విమానఖర్చులు తగ్గుతాయి, సదుపాయ వసతులను రద్దు చేయవొచ్చు మరియు కానుకలను తిరిగి ఇచ్చేయ వొచ్చు. మీకు కానుకలు వొచ్చి ఉంటే, వాటిని ధన్యవాదాలు చెపుతూ తిరిగి పంపించేయండి.

మీ పట్ల శ్రద్ధ చూపించేవారితో గడపండి
మీ వీగిపోయిన నిశ్చితార్థంతో పాడయిన మనసుతో ఉన్నప్పుడు మీరు మీ స్నేహితులతో మరియు కుటుంబంతో సమయాన్ని గడపండి. మీకు మిమ్మలిని ప్రోత్సహించే, మీరంటే ప్రేమ చూపించేవారి అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి సమయంలో మిమ్మలిని సరిఅయిన మార్గంలో నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటారు. వారిని మిమ్మలిని చేరుకోనివ్వండి. వారిని మంచి సలహా పంచుకోనివ్వండి.

ఆ హానీమూన్ వెళ్ళండి
మీరు హనీమూన్ కు బుక్ చేసుకోకపోతే, బుక్ చేసుకోండి. మీ ప్రదేశానికి కొన్నిరోజులు దూరంగా మీ స్నేహితులను తీసుకొని గాని లేదా ఒంటరిగా గాని వెళ్ళిరండి. వెళ్లి ఏదైనా గొప్పగా, ఏదైనా కొత్తగా చేయండి. మీరు చేసేది చాలా మంచి చేస్తుంది. మరియు మీరు దూరంగా ఉన్నప్పుడు, మీ విశ్రాంతి మరియు పూర్తిగా విలాసమైనవాటిని గుర్తుతెచ్చుకోండి.

నేర్చుకోండి, క్షమించు మరియు అభివృద్ధి
ఇద్దరు వ్యక్తుల కలయిక గుర్తింపు కోసం ఏర్పాటు చేసేది నిశ్చితార్థం. ఎవరి వైపు తప్పు జరిగినా ఫలితం ఇద్దరు అనుభవించవలసినదే. కొద్దిగా విశ్లేషించండి కానీ ఎక్కువ విశ్లేషించవలసిన అవసరం లేదు. ఇద్దరు చేసిన పనులు భిన్నంగా ఉన్నాయని అంగీకరించండి కాని ఇది మీ ఇద్దరికీ భవిష్యత్తులో సరిపడదని చెప్పటానికి ఒక సంకేతమేమో మరియు ఈ విషయం ముందుగానే తెలుసుకున్నాము అని అనుకోవాలి. మీరు ఈ అనుభవానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండండి, ఎదుటి వైపువారికి మంచి జరగాలని కొరుకొంది మరియు మిమ్మలిని మీరు గాని లేదా ఎదుటివారిని గాని నిందించకుండా వారిని క్షమించండి.

వారికి నిశ్చితార్థ ఉంగరం తిరిగి ఇచ్చివేయండి
మీరు ఇంకా ఉంగరాన్ని ఉంచుకోవటం ఉత్తమం కాదు, న్యాయము కాదు. మీరు దానిని ధరించటానికి ఇష్టపడకపోయినా మరియు అమ్మాలనుకున్నా మీరు చాలా సంకుచితంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
