For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భార్య అబద్దం చెబుతోందనడానికి ఇవే సంకేతాలు!?

|

అబద్దాలు..నిజం కానిది అబద్దం. అబద్దం చెప్పినా, అతికినట్లుగా, గోడ కట్టినట్లుగా ఉండాలి అని అంటారు. వినేవారిని ఇట్టే నమ్మించేటట్లు కొందరి అబద్దాలుంటాయి. కానీ ఈ అబద్దాల వల్ల ఎన్ని అనార్థాలు ఎదురవుతాయో ఎవ్వరూ గమనించరు. తీరా జరగాల్సిన అనార్థాలు జరిగిపోయాక అయ్యే అబద్దం చెప్పకుండా ఉండాల్సింది అని చింతిస్తుంటారు. అబద్దాల వల్ల కొన్ని మానవ సంబంధాలు కూడా తెగతెంపుల వరకూ వస్తుంటాయి. అందుకు అబద్దాలను రిలేషన్ షిప్ కిల్లర్ అంటుంటారు. మీరు మీ భార్య ఒక వింత పద్దతిలో ప్రవర్ధించడం మొదలు పెట్టినా లేదా మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తోందని మీకు అనిపిస్తే, వెంటనే మీ వివాహ బంధాన్ని సేవ్ చేసుకొనే సమయం వచ్చిందని గ్రహించాలి.

మీ భార్య మీతో అబద్దం చెబుతోందా?ఆమె మీకు అబద్దం చెప్పడానకి అనేక కారణాలుండవచ్చు. ఆమె ఎక్స్ ట్రా మారిటల్ అఫైర్(అక్రమ సంబంధం)లో ఉండవచ్చు లేదా ఆమె కొన్ని ఆర్థిక హెచ్చుతగ్గుల ద్వారా వెళ్తుండవచ్చు. లేదా ఆమె మీతో సౌకర్యవంతంగా చెప్పుకోలేని కొన్ని సమస్యలు ఉండవచ్చు . అయితే ఈ సమస్యకు వెంటనే మీరు పరిష్కార మార్గం కనుక్కోలేరు. దానికంటే ముందు మీ భార్య మీతో అబద్ద చెబుతోందా లేదా అన్న విషయాన్ని గ్రహించండి. లేదా అది మీ మనస్సులో నుండి మొదలైన అనుమానమో తెలుసుకోండి.

మీ భార్య మీతో అబద్దాలు చెబుతోందని గుర్తించడానికి చాలా చిహ్నాలున్నాయి. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మీ భార్య మీతో అబద్దాలు చెబుతుందనడానికి ఈ క్రింది చిహ్నాలు పరిశీలించండి...

Is Your Wife Lying?

1. బాడీ లాంగ్వేజ్ లో మార్పు: ప్రారంభ అసత్యాలు‘వైట్ లైస్'ఉన్నాయి. మీ భార్య మీరు మాట్టాడేటప్పు లేదా మీ ప్రశ్నకు సమాధానం చేసేటప్పుడు, నత్తిగా మాట్లాడుటం, మాట్లాడేటప్పుడు తత్తరపడటం, లేదా మాట్లాడేప్పుడు చిన్న విషయాన్నికి కూడా, సమాధానం చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, సమాధానం చేప్పేటప్పుడు ఆమె పాదాల వైపు క్రిందికిచూస్తూ మాట్లాడిందంటే, అప్పుడు మీరు ఆమె అబద్దం చెబుతోందని అని అనుకోవచ్చు.

2. బయట ఎక్కువ సమయాన్ని గడపడం: ఉన్నట్లుండి ఎప్పుడూ లేనిది, అకస్మాత్ గా ఆమె ఇంట్లో కంటే ఫ్రెండ్స్ తో బయట ఎక్కువ సమయం గడపడం, రీసెంట్ గా పరిచయమైన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభింఛి ఉంటే, అప్పుడు ఆమె మిమ్మల్ని విస్మరిస్తుందని తెలుసుకోవాలి మరియు దాని గురించి అబద్దం చెబుతోందని గ్రహించాలి.

3. దూరంగా ఉండటం: మీ భార్య మీకు రాను రాను దూరం అవుతున్నా లేదా మీ రిలేషన్ షిప్ గురించి మాట్లాడేటప్పుడు అవాయిడ్ చేస్తున్నా, అప్పుడు ఆమె మీ మీద శ్రద్ద కలిగి లేదని, బయట వారితో ఏదో వ్యవహారంలో ఉందని మీ గ్రహించాలి. దాని గురించే అబద్దం చెప్పే అవకాశాలున్నాయని తెలుసుకోవాలి.

4. రహస్యం: మీకు తెలియకుండా రహస్యంగా ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేదా లాప్ టాప్, ఫోన్లలో ఏవైనా విషయాలను రహస్యంగా ఉంచినా..అప్పుడు మీరు ఖచ్చితంగా మీ భార్య మీతో అబద్దం చెబుతోందని చెప్పవచ్చు. ఏవిషయాన్నైనా సరే భర్త వద్ద రహస్యం గా ఉంచడం అనేది, అబద్దం చెప్పడానికి కారణం అవుతుంది.

5. చాటింగ్ తో ఎక్కువ సమయం గడపడం: సడెన్ గా మీ భార్య చాటింగ్ కు వ్యసనపరురాలైయుంటే, ఆమె నిరంతరం ఫోల్లో లేదా సోషియల్ నెట్ వర్క్ లో గంటల తరబడి చాట్ చేస్తుంటే, దాన్ని మీరు గురించి ప్రశ్నించినప్పుడు, ఆమె తిరస్కరించారంటే ఆమె మీతో అబద్దం చెబుతోందని నిర్ధారించుకోండి...

English summary

Is Your Wife Lying?

Last thing a man wants is to have his wife lying to him. Lies are relationship killers. If you suspect that your wife has been behaving in a strange manner or has started distancing yourself from you, then it is high time that you start concentrating on saving your marriage.
Story first published: Tuesday, July 16, 2013, 16:26 [IST]
Desktop Bottom Promotion