Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉండడానికి10 ముఖ్య కారణాలు
రిలేషన్ షిప్ లో సింగల్ గా ఉండటం అనేది ముఖ్య విషయం కాకపోయినా ఎప్పుడో అప్పుడు రిలేషన్ షిప్ లో ఉండాల్సిన సమయం వస్తుంది. మీ జీవితంలోకి ఒకరిని ఆహ్వానించవలసిన సమయం వస్తుంది. ఒకవేళ మీకు అమ్మాయిని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి కనుక ఏవైనా భయాలు ఉన్నట్టయితే కొన్ని విషయాలు మీ గురించి మీరు తెలుసుకోవలసిన సమయం అసన్నమయినట్టే. ఈ క్రింద తెలుపబడిన మొట్ట మొదటి పది కారణాలు మీరు ఇంకా సింగల్ గా ఉండటానికి సంబంధించినవి అయి ఉండవచ్చు.

స్వేచ్చ ని కోల్పోవడం ఇష్టం లేక :
బ్యాచలర్ గా ఉండటం లో కొన్ని లాభాలు ఉన్నాయి. మీకు ఇష్టం అయినప్పుడు లేస్తారు, ఇష్టం అయినప్పుడు తింటారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. మీ గురించి కంప్లైన్ చేసే వాళ్ళు ఉండరు. మీకు ఇష్టమైన సాకర్ గేమ్ ను మిస్ చేసుకుని గంటల తరబడి అద్దం ముందు ముస్తాబయ్యే గర్ల్ ఫ్రెండ్ గురించి మీరు ఎదురు చూడనవసరం లేదు. ఒక అమ్మాయిని మీ జీవితం లో కి ఆహ్వానించినట్టయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలలో రాజీ పడాలి. మీరు ఇప్పటికీ సింగల్ గా ఉన్నారంటే మీరు రాజీ పడటానికి ఇష్టపడట్లేదనే అర్ధం.

మీరు బోర్ కొట్టే వ్యక్తి :
మీరు బావి లో కప్పలగా ఉండే వ్యక్తిత్వం కలిగిన మనిషి అయి ఉండాలి. అందులోంచి బయటపడటం మీకు నచ్చకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీతో మాట్లాడడానికి బోర్ ఫీల్ అయి ఉంటారు. మీరు బోరింగ్ అన్న విషయం మీకు తెలుసు కానీ ఆ విషయం సీక్రెట్ గా ఉంచరు. మీరు ఒక అమ్మాయిని నవ్వించగలిగితే ఆ అమ్మాయితో మీరు ఏ పనైనా చేయించగలరు అన్న విషయం గుర్తుంచుకోండి.

మీరు మిమ్మల్ని ప్రేమిస్తారు :
మీరు మిమ్మల్ని అతిగా ఇష్టపడతారు. వేరే ఏవీ మిమ్మల్ని ప్రభావితం చెయ్యలేవు. ఒకవేళ అందమైన అప్సరస లాంటి అమ్మాయి ఎదురైనా మీరు చలించరు. ఆమె కంటే మీరే అందగాడని మీరు భావిస్తారు. ఎదుటి వాళ్ళ తప్పులని వెతకడం చాలా సులభం. కానీ తమ తప్పును ఒప్పుకోవడం కష్టం. ఒకవేళ మీరు అటువంటి వారు అయితే మీరు ఎందుకు సింగల్ గా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారో మీకే తెలిసి ఉంటుంది.

అమ్మాయిలకంటే గేమింగ్ ముఖ్యం :
ఇప్పటి వాళ్ళు ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్స్ నే ప్రేమిస్తున్నారు . వర్క్ లోంచి కొంత సమయం బ్రేక్ లభించగానే వెంటనే కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రేస్ గేమ్స్, ఆక్షన్ గేమ్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ స్కోర్ నిలిచి వరల్డ్ రికార్డ్స్ సాధిద్దామని అనుకుంటున్నారు. ఒక వేల మీరు ఈ కేటగిరీ కి చెందిన వారు అయితే ఖచ్చితంగా మీకు గర్ల్ఫ్రెండ్ ఉండకపోవడానికి కారణం మీరే.

మీకు కమిట్మెంట్ అంటే నచ్చదు :
కేవలం సింగల్ గా ఉండటమే మీ కమిట్మెంట్ అయితే మీ జీవితం లో గర్ల్ ఫ్రెండ్ ఉండకపోవడానికి కారణం ఉంది. అమ్మాయిలకి కమిట్మెంట్ ఉన్నవాళ్లు అంటేనే ఇష్టం. వారు కమిట్మెంట్ ని గౌరవిస్తారు. కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ ని వారు అభద్రత గా భావిస్తారు. ఎవరైనా బెటర్ వాళ్ళు కలిస్తే మీరు వారి నుంచి దూరం అవుతారేమో అన్న సందేహం తో బాధ పడతారు. నమ్మదగిన వారినే స్త్రీలు ప్రేమిస్తారు. తుమ్మితే ఉడిపోయే ముక్కు లాంటి బాపతు వారిని వారు ఇష్టపడరు.

ఉద్యోగం లేకపోతె :
అందరి ఆడవాళ్లు కానుకలని ఇష్టపడకపోయినా ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశిస్తారు. బయటికి వెళ్ళడం అంటేనే తినడానికి, అలాగే రవాణాకి ఖర్చు. వినోదానికి కూడా ఖర్చే. ఒక వేల మీకు ఉద్యోగం లేకపోతే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంట్లోంచి బయటకి వెళితే ఖర్చుమయం.

మీరు మంచివారు :
వినయంగా, దయగా ఉండటం మీలో ఉన్న మంచి లక్షణాలు. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన అబ్బాయిలు, అమ్మాయిలతో సౌకర్యంగా ఉండటానికి ఎంతో సమయం పడుతుంది. ఈలోపు ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేస్తుంది. అంతే కాదు, మంచితనాన్ని వారు చేతకానితనంగా భావించవచ్చు. మిగతా మగవాళ్ళతో వ్యవహరించేటప్పుడు మీలో ఉన్న మరొక కోణాన్ని కూడా తెలియచేయాలి. అలా చూడడం అమ్మాయిలకు ఇష్టం. అమ్మాయిని రక్షించడానికి మీరు ఏం చెయ్యడానికి అయిన వెనకాడరాని తెలుసుకోవడానికి వారు సంతోషిస్తారు.

మీరు తెలివైన వారని మీ నమ్మకం :
ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే లక్షణం నమ్రత. మీరు ఎప్పుడూ రఫ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళకు నచ్చదు. అతి తెలివైన వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఏదో ఒక కామెంట్ చేస్తారు. కుళ్ళు జొకూ వేస్తారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉంటే తక్షణం తగ్గించుకోండి.

మీ స్నేహితుల వల్లే మీరు ఎలాంటి వారో తెలుస్తుంది
మగవాడి కి ఉన్న స్నేహితుల ని అంచనా వేసి అతని గురించి తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్నీ ఆడవాళ్లు గమనిస్తారు. ఎప్పుడూ మీ స్నేహితులు మీ తోతే ఉంటూ ఏవో ఒక చెడు అలవాట్లతో కనిపిస్తే మీరు అలాంటి వారు కాకపోయినా వాళ్ళ వల్ల మిమ్మల్ని కూడా చెడుగా అనుకునే అవకాశం కలదు.

మీరు అందంగా కనపడకపోతే :
షేవింగ్ చేసుకోరు. స్నానం చెయ్యరు. హెయిర్ కట్ చేసుకోరు. మీ దుస్తులు సరిగ్గా వేసుకోరు. ఇల్లంతా మిగిలిన ఆహారంతో ఉంటుంది. మీ ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉన్నాయో మీకే తెలియదు. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకుంటూ చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా చేసుకోవాలి.



Click it and Unblock the Notifications