ప్రేమ! మిమ్మల్ని జీవితాంతం కాపాడుతుందా?

By Super

ఒక ప్రత్యేకమైన వ్యక్తిని లేదా విషయాన్ని మనం చూసినప్పుడు తీవ్రమైన భావోద్వేగానికి గురి కావడం అంటే ఏమిటి? మీరు ప్రేమలో పడ్డారని మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకు అది ఎంతో బాగా అనిపిస్తుంది? ఇది జీవితాంతం ఉంటుందా? మేము ఈ పురాతన ప్రేమ అనే చిన్న వింత రహస్యాన్ని పరిశీలించాము.

ఘాటు ప్రేమ :

ఘాటు ప్రేమ :

వేర్వేరు తీవ్రతలతో కొంతమందికి దగ్గరవ్వాలని అనిపించే ఒక ఘాటైన అభిమానాన్ని ప్రేమ అంటారు. . . అది ఎవరి పైనా అనే దాన్ని బట్టి ప్రేమ బలహీనంగా, బలంగా, స్థిరంగా, నియంత్రించడానికి కష్టంగా ఉంటుంది. అటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూసినప్పుడు లేదా ఆలోచించినప్పుడు తీవ్రమైన ఆనందం, దడ, గొంతు లో అడ్డుపడటం, చెమటపట్టిన అరచేతులు, తీవ్రమైన సంతోషభావాలు ఇటువంటి అమోఘమైన సంకేతాలు ద్వారా చిగురించే ప్రేమ తన కథను తెలియజేస్తుంది. దీని వల్లె మనం ప్రేమకి స్నేహానికి ఉన్న తేడాను చెప్పగలం.

ప్రేమ సహజమైన ప్రక్రియ:

ప్రేమ సహజమైన ప్రక్రియ:

సైకియాట్రిస్టులు, సైకోఅనలిస్టులు ప్రేమ విశ్లేషణలో కొంత ముందుకు వెళ్తారు. వారు ఇది కేవలం యాదృచ్ఛికంగా లేదా నియమరహితంగా సంభవిస్తుందని చెప్పడం లేదు: ఎవరి పట్ల మనసు చిగురించి, అభివృద్ధి చెందుతుందో వారితో ప్రేమలో పడేట్టు మన సుప్తచేతనావస్థ చేస్తుంది. ముఖంలోని భావాలు, మాట లేదా చేష్టలు మనలో భావోద్వేగాలను మేల్కొలుపుతాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు బలమైన భావాలకు, ఆనందానికి లోనవడమే కాక ప్రపంచం రంగులమయంగా కనబడుతుండటం తెల్సిన విషయమే. మీరు ప్రేమను వెతుకుతున్నప్పుడు కళ్ళు, చెవులు మన అంచనాలకు సరిపడే వ్యక్తులను వెతకి, వింటుంటాయి. వారి తప్పులను కప్పిపుచ్చి, మన కోరికలను, ఆకాంక్షలను వారిపై కేంద్రీకరిస్తాం. (అందుకే ప్రేమ గుడ్డిదని అంటారు).

ప్రేమ మన ప్రవర్తనను కూడా మారుస్తుంది:

ప్రేమ మన ప్రవర్తనను కూడా మారుస్తుంది:

మనం ప్రేమించే వారి కోసం ఎంతో సహనంగా ఉంటాం. అయితే తక్కువ ఆత్మ గౌరవంతో ఉండే కొంత మంది స్త్రీలు వారికి ఒక కొత్త భాగస్వామి దొరికినప్పుడు తమ వ్యక్తిత్వాలను, ఆసక్తులు పూర్తిగా మార్చుకుంటారని ఫ్రాయిడ్ తెలిపాడు. ప్రేమ గురించి చెప్పడానికి పరిశోధకుల దగ్గర కూడా ఎంతో ఉంది. భద్రత కోసం ఒక బలమైన కోరిక, శారీరిక ఆనందంతో బాటుగా ప్రేమ హార్మోనుల ఒక నిజమైన కదలికను కూడా శరీరంలో కల్గిస్తుంది. మనం ప్రేమలో పడినప్పుడు ఎండార్ఫిన్లు, లులిబెరిన్, ఆక్సిటోసిన్, ప్రత్యేకంగా సెక్స్ హార్మోను టెస్టోస్టెరాన్ మూకుమ్మడిగా విడుదలౌతాయి. ఇవి మీరు అభ్యంతరాలను కోల్పోయి ప్రేమించే వారి నుండి అభిమానాన్ని కోరుకోనేటట్టు చేస్తాయి. ఇవన్ని కలసి అసలైన ఉత్ప్రేరకం డోపమైన్ ను ఉత్పత్తి చేస్తాయి.

మగవారికి ఆడవారికి మధ్య తేడాలు

మగవారికి ఆడవారికి మధ్య తేడాలు

మగవారిలో ఆడవారిలో భావోద్వేగాలు, విడుదలయ్యే హార్మోనులు ఒకే రకంగా ఉన్నప్పటికీ కలిగే మార్పులు మాత్రం వేరుగా ఉంటాయి: లైంగికపర౦గా మగవారు ఎక్కువ అనుభూతి చెందుతారు. ఇంకో మాటలో చెప్పాలంటే వారి లక్ష్యాలు, ఆలోచనా సామర్ధ్య౦, విలువల వ్యవస్థల పై టెస్టోస్టెరాన్ అధికారం చెలాయిస్తుంది. ఆడవారిలో వేరుగా ఉంటుంది. వారు కూడా అదేరకమైన భావాలకు లోనైనప్పటికీ (ప్రత్యేకంగా సెక్స్ కోరికల విషయంలో), ప్రేమ ముందు కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. స్త్రీ తన భాగస్వామితో ఉన్నప్పుడు, ఆమె ప్రభావ వ్యవస్థ మేల్కుంటుంది లేనప్పుడు ఆ లోటు తెలుస్తుంది.

ఎంతకాలం ఈ ప్రేమ ఉంటుంది?

ఎంతకాలం ఈ ప్రేమ ఉంటుంది?

ప్రేమ ప్రాధమికంగా వాంఛ వలన కల్గినప్పటికి (పరస్పరం లేదా ఒకరిలో), కాని నిజానికి ఇది ఒక కాలక్షేప విషయం కాదు. శాస్త్రవేత్తలు, సైకియాట్రిస్టులు అంగీకరించిన విషయం ప్రేమ సరాసరిన కేవలం మూడేళ్ళు ఉంటుంది. అంటే ఇది మూడేళ్ళ తర్వాత ఆగిపోతుందని కాదు, అయితే: ఇది వేరొక రూపం పొందుతుంది (మనం ప్రేమించిన వ్యక్తితో పరస్పర గౌరవంతో, ఇల్లు, పిల్లలు కావాలనే ఒక మృదువైన ప్రేమతో కూడిన కోరిక). వాంఛ తర్వాత వచ్చేది స్థిరత్వం కావాలనే కోరిక కాని లైంగికపరమైన కోరికలు తీరుతుండాలి!

కాని ఎప్పుడు తొలిచే ఒక ప్రశ్న:

కాని ఎప్పుడు తొలిచే ఒక ప్రశ్న:

మీరు ఒకరిని ప్రేమించడం ఆపేస్తే, మళ్ళా మీరు వారిని ప్రేమించగలరా? మిమ్మల్ని మోస౦ చేసిన లేదా బాధ పెట్టిన వారితో మీరు ప్రేమలో తిరిగి ఎలా సంతోషంగా ఉండగలరు? ఇది ఆయా వ్యక్తుల మీద, సంబంధంలోని సమస్యల కారణాలపైన లేదా విడిపోవడం పైన ఆధారపడి ఉంటుంది.

మన శారీరిక, మానసిక సంతోషం కోసం ప్రేమ అవసరం:

మన శారీరిక, మానసిక సంతోషం కోసం ప్రేమ అవసరం:

ఒకరిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు మీ జీవితకాలంలో కలవగలమని అనుకున్నప్పటికీ, ప్రతి రోజు ప్రేమ జ్వాలను రగిలించే ఉంచడం అనేది క్లిష్టమైన విషయం. మీరు ప్రేమించే వ్యక్తి పట్ల బాధ్యతగా ఉండటం, ఒకరి కోరికలను ఒకరు తీర్చడం, మీ ఆసక్తులను పంచుకోవడం వంటి కొన్ని రహస్యాలు ప్రేమను చిరకాలం కాపాడతాయి.

Desktop Bottom Promotion