Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
ఒక వ్యక్తి మిమ్మల్నిఎక్కువగా ఇష్టపడటానికి 10 మార్గాలు
తనను వెర్రిగా అభిమానించే ఒక వ్యక్తితో సంబంధం కల్గి ఉండటం అంటే ఇష్టపడని స్త్రీ లేదా అమ్మాయి ఉండదు. ఒక వ్యక్తిని మీరంటే ఇష్టపడే విధంగా చేయండి! ఒక వ్యక్తి మీరంటే ఇష్టపడడం ఏ మాత్రం కష్టం కాదు. కొద్దిపాటి సమయం, సహనంతో మీరు ఈ పని చేయగలరు. నేను మొట్టమొదటగా నా భర్తను కలసినప్పుడు, నేను చేసిన కొన్ని చేష్టలు అతనిని వెర్రెత్తి౦చాయి. నేను చేసిన ఆ చేష్టలు పూర్తిగా సహజమైనవే. ఈ కింద, ఒక వ్యక్తి మిమ్మల్ని వెర్రిగా అభిమానించడానికి కొన్ని చిట్కాలను మీకు నేను తెల్పుతున్నాను.

మీ స్వంతంత్రతను అతనికి తెలియచేయండి
మీ స్వంతంత్రతను అతనికి తెలియచేయడం అవసరం. ఆ వ్యక్తికి మీరు ఎంత గట్టివారో తెలియచేయడం ముఖ్యం. మగవారు, స్వంతంత్రంగా వ్యవహరించే స్త్రీలకు ఆకర్షితులౌతారు. ఒక వేళ మీరు అన్ని వేళల్లో అతనిని అంటిపెట్టుకొని ఉండి, ఆధారపడటం లాంటివి పనిచేస్తాయని అనుకుంటే, మీరు దీనిని గురించి తిరిగి ఆలోచించాలి.

మీరు పరాన్నజీవి కాదు
ఒక వ్యక్తిని నిరంతరం అంటిపెట్టుకొని ఉండి, అతని చుట్టూ తిరగడం, అతను మిమ్మల్ని మరింతగా కోరుకోనేట్టుగా ఏం చేయదు. అతను అడిగినవన్నీ చేస్తూ, మీరు ఎల్లప్పుడూ అతని ఎదురుగా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల, అతనికి కొంత సమయాన్ని కేటాయించడం ముఖ్యం.

అతని స్థానాన్ని తీసుకోకండి
నేను ఎల్లప్పుడూ సమానత్వాన్ని గురించి మాట్లాడినట్లే, మీరు బలమైన సంబంధంలో ఉన్నప్పుడు కొన్ని పనులను చేయలేరు. మీరు ఒక వ్యక్తిని అతని మగతనం ప్రదర్శించడానికి అనుమతించినప్పుడు అతను ప్రధాన పాత్రను పోషిస్తాడు. అతను వచ్చి ఏదో ఒక మార్గాన మీకు సహాయం చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలపాలి.

జీవితాన్ని ఎలా అనుభవించాలో తెల్సుకోండి
మీరు దిగులును ప్రదర్సిస్తూ, ఎల్లప్పుడూ విచారంగా, క్రుంగిపోయినట్లుగా ఉంటూ, ఒక వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించాలని ఆశించలేరు.

ఔచిత్యమనిపించినప్పుడు మద్దతు ఇవ్వండి
ఒక వ్యక్తి ఎంత బలమైన వారైన అయి ఉండవచ్చు, మగవారైన సరే, వారి జీవితంలో ఎల్లప్పుడు వారు ఏదో ఒక రకమైన మద్దతు కోరుకునే అంశాలు ఉంటాయి. అతనికి అవసరమని గమనించినప్పుడు, మీరు అతనికి తోడుగా ఉండి, సహాయం చేయండి.

ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉండండి
చాలామంది స్త్రీలు పెళ్లి అయ్యాక, వారు తమకంటూ ఒక వ్యక్తి ఉండటం వలన అతి సాధారణంగా ఉండటం మొదలు పెడతారు. మీరు అలా మిమ్మల్ని వదిలేయకండి. మీరు పెళ్ళికి ముందు మీ జుట్టు కోసం సెలూన్ కు వెళ్లి ఉంటే, ఇప్పుడు అదే చేయండి. అతనితో పెళ్లి అయిన కొత్తలో మీరు చురుగ్గా ఉంటే, ఇప్పుడు చురుగ్గానే ఉండండి.

అసూయ
తనకు నచ్చిన వ్యక్తిని అసూయకు గురిచేయడానికి చాల మంది అమ్మాయిలు తమ స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించడం నేను చూసాను. మీ స్నేహితులతో మీరు గడిపిన దీర్ఘకాలాన్ని తలచుకొని అతను వెర్రెత్తి పోవచ్చు. అయితే నేను ఇలా ఎన్నటికి చేయను. కాని కొంత మంది అమ్మాయిలు దీనిని సూచిస్తారు. తిరిగి, ఇదంతా మీరెవరనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీతో గడపడానికి అతను ఎంతగా కోరుకొంటే, అతను అంతగా మీ కోసం వెర్రెత్తిపోతాడు.

గొప్ప శ్రోతగా ఉండండి
ఒక బాయ్ ఫ్రెండ్ ను పొందటానికి ఖచ్చితమైన ఒక మార్గం అతని పట్ల శ్రద్ధ వహించడం. అతను మాట్లాడుతున్నప్పుడు, అతని మాటలు వినడం ద్వారా మీరు అతని పట్ల ఆసక్తి కల్గి ఉన్నారని అతనికి తెలిసేలా చేయండి. ఒక అమ్మాయి తన పట్ల శ్రద్ధ వహించడాన్ని అబ్బాయిలు ఇష్టపడతారు. ఇదే వారి ఇష్టానికి కారణమౌతుంది. మనసులో దాచుకోకండి. ఎల్లప్పుడు మీ కోరికలు, మీ జీవితం గురించి మాట్లాడండి. అతనికి కూడా అవకాశం ఇచ్చి అతని మనసులో మాట చెప్పనివ్వండి. వారిని మెచ్చుకోవడం, ప్రశంసించడం మగవారికి ఎంతో నచ్చుతుంది.

మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా మలుచుకోండి
బయట ఆకర్షణీయంగా కనబడే మహిళలు అనేక మంది ఉంటారు. వారి నుండి మిమ్మలి ప్రత్యేకంగా నిలబెట్టే విధంగా మీరు ఉండాలి. ఏదో ఒక ప్రత్యేకతను కనుగొని అలానే ఉండండి.

మీరు మీరుగానే ఉండండి
చివరిగా, మీరు మీరుగానే ఉండండి. మీరు ఒకసారి టెలివిజన్ లో చూసిన ఒక సూపర్ స్టార్ ల ఉండటానికి ప్రయత్నించకండి. మీకు మీరుగానే ఉండి, అతని గౌరవాన్ని పొందండి.



Click it and Unblock the Notifications











