Latest Updates
-
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే!
కొత్తగా పెళ్ళైందా?ఐతే మీభార్య కోసం ఓ రొమాంటిక్ గిఫ్ట్
కొత్తగా పెళ్ళైన జంటలు వారి పాట్నర్ కోసం ఏదైన బహుమతి ఇవ్వాలనుకుంటారు. ముఖ్యంగా మొదిటి రాత్రి బహుమతులతో మరింత సర్ ఫ్రైజ్ చేయాలనుకుంటారు. అయితే కొత్తగా పెళ్ళైన జంటల్లో స్త్రీలకు ఎటువంటి బహుమతులిస్తే వారు హ్యాపీగా ఫీలవుతారో తెలియక కన్ఫ్యూజన్ చెందుతుంటారు. అటువంటప్పుడు మీ పార్ట్నర్ కోసం కొన్ని సాధారణ వస్తువులు ముఖ్యం మహిళలు ఎక్కువగా ఇష్టపడే చాలా ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోసుకొని, బహుమతిగా ఇవ్వొచ్చు . మీ భాగస్వామికి వ్యక్తిగతంగా ఇచ్చేటటువంటివి కొన్ని బహుమతులున్నాయి. ఈ బహుమతులు మీ భాగస్వామి ఇష్టమపడవచ్చు.
కొత్తగా పెళ్ళైన జంటల్లో వారి భార్య కూడా తన పాట్నర్ ఏం గిప్ట్ ఇస్తారో అని చాలా ఆత్రుతగా ఉంటారు. అటువంటప్పుడు అమెకు నచ్చే, మెచ్చే బహుమతులను ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలి. అంతే కానీ ఆమెకు ఇష్టం లేని బహుమతులు ఇచ్చి మనస్సు నొప్పించి మిమ్మల్ని దూరం పెట్టేలా చేసుకోకూడదు. మొదట్లో ఒకరి ఇష్టాఇష్టాలు తెలియని వారైతే మహిళలు ఎక్కువగా ఏవి ఇష్టపడుతారో, ఏవి రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటారో అటువంటి వాటి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదే మొదటి యానివర్సరీకి ఇద్దరి ఇష్టాఇష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి, అప్పుడు బహుమతులు ఎంపిక చేసుకోవడం చాలా సులభం.
అయితే, ఆమె ఇష్టాలు తెలియకుండా మొదటి సారి బహుమతులు ఇచ్చేటప్పుడు, అవి చాలా అట్రాక్టివ్ గా కనిపించేలా కలర్ ఫుల్ పేపర్స్ తో చుట్టి ఇవ్వాలి. అలాగే ఆమెకు బహుమతి ఇచ్చే సమయంలో ముఖంలో చిరునవ్వు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి భార్యకు ఇచ్చే అటువంటి వ్యక్తిగత బహుమతులు, సాధారణ బహుమతులు మహిళలు నచ్చేవి ఇక్కడ లిస్ట్ లో కొన్నింటిని ఇవ్వబడ్డాయి..అవేంటో ఒక సారి చూద్దాం...

పెర్ఫ్యూమ్:
మహిళలకు పెర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం. మంచి సువాసనతో ఉండటానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతారు. ఇది ఒక ఫర్ ఫెక్ట్ ఇంటిమేటింగ్ గిఫ్ట్ ఐడియా.

మసాజ్ ఆయిల్:
మసాజ్ వల్ల చాలా విశ్రాంతిని పొందవచ్చు. మరి రిలాక్స్ పొందాలంటే ఒక ఆరోమాటిక్ మసాజ్ ఆయిల్ ను బహుమతిగి బహుకరించండి.

లోషన్:
ఇది బాడీలోషన్ మాత్రమే కాదు, చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది రొమాన్స్ కు మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. కాబట్టి నేచురల్ లోషన్ ను బహుకరించండి.

పొయట్రి:
మీ భార్యకు మొదటి సారి, ఒక వ్యక్తిగతంగా ఒక అందమైన బహుమతి ఇవ్వదల్చుకొన్నప్పుడు, ఆమె మీద ఒక రొమాంటిక్ పోయం రాసి ఆమె చేతిలో పెట్టండి. ఆమె ఖచ్చితంగా మీ ఐడియాకు సంతోషపడుతుంది.

సాంగ్స్:
చాలా వరకూ చాలా మంది కపుల్స్ కు పాటలంటే చాలా ఇష్టంగా ఉంటారు. వారికి ఇష్టమైన పాటలను సిడిలను ప్రెజెంట్ చేయండి.

జ్యువెలరీ:
మహిళలకు అందం అన్నా, ఆభరనాలన్నా చాలా మక్కువ. కాబట్టి మహిళలకు ఇచ్చే బహుమతుల్లో ఆభరణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. గోల్డ్ నెక్ లెస్, బ్రాస్ లెట్, డైమండ్ ఇయర్ రింగ్ వంటి బహుమతులు తప్పకుండా వారికి నచ్చుతుంది.

పువ్వులు:
వారికి ఇష్టమైనవి మంచి సువాసన వచ్చే బొకెట్ ఫ్లెవర్స్ ను బహుమతిగా ఇవ్వడి. అంతే కాదు, ఆమె ఇష్టమైన పువ్వులతో ఇంటిని అలంకరించండి.

గిఫ్ట్ హ్యాంపర్:
ఏ వస్తువులైన్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ గా పొందడం చాలా మంది మహిళలకు ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆమెకు ఇష్టమైన వస్తువులతో ఒక గిప్ట్ బ్యాస్కెట్ ను బహుమతిగా ఇవ్వండి.

చాక్లెట్:
ఈ అద్భుతమైన గిప్ట్ ఐడియాను ఎలా మర్చిపోతారు?డార్క్ చాక్లెట్ ఒక మంచి ఎంపిక. చాక్లెట్స్ కూడా మహిళలకు చాలా ఇష్టం అంతే కాదు. ఈ డార్క్ చాక్లెట్స్ కామవాంఛను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications
