డిప్రెషన్లో ఉన్నబాయ్ ఫ్రెండ్ ను సేవ్ చేయడం ఎలా?

ప్రపంచ దేశాలలో మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. సహజంగా జీవితంలో దేన్నయినా కోల్పోయినపుడు కలిగే దుఃఖం వలన మనలో కలిగే డిప్రెషన్‌ ఈ కోవకే చెందుతుంది.

ఉదా: ఆత్మీయులు మరణించినపుడు, మనకు దూరమైపోయినపుడు, లేదా తల్లిదండ్రులు, పాట్నర్ మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయే సందర్భాలలో ఎవరైనా సహజంగా అతి సాధారణ స్థాయి డిప్రెషన్‌కు గురవుతారు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించలేకపోవచ్చు. కానీ ఇలా జరగడం చాలా సాధారణం. అలాగే కొందరు బాయ్ ఫ్రెండ్ దూరం అయితే కూడా తట్టుకోలేరు. వారు కూడా డిప్రెషన్ చెండానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కొందరు కొన్ని గంటల్లోనే ఈ పరిస్థితి నుండి కోలుకుని రొటీన్‌గా తమ పనుల్లో తాము పడిపోతారు. కొందరికి ఒకరోజు, మరికొందరు కొన్ని రోజులు, కొందరు వారాలు, ఇంకొందరికి కొన్ని నెలలు కూడా ఈ అతిసాధారణ డిప్రెషన్‌ నుండి బయటపడటానికి పట్టవచ్చు.

ఇలా దగ్గరి సంబంధం ఉన్నవారిలో బాయ్ ఫ్రెండ్ దూరం అయితే, ఆ భాదేంటో అనుభవించే వారికి తెలుస్తుంది. అతను మీతో మాట్లాడకపోయినా, అతను బయటకనబడకపోయినా లేదా అతను ముందు ఉన్నంత ఉత్సాహంగా లేకపోయినా..ఈ లక్షణాలన్నీ కూడా అతను మిమ్మిల్ని వదులుకోవడానికి కానీ, లేదా మీరంటే ఇష్టం లేదని కానీ అనుకోకూడదు. ఈ లక్షణాలు డిప్రెషన్ వల్ల కూడా ఏర్పడుతాయని గ్రహించాలి.

మీ అనోన్యమైన జీవితంలో మీ పార్ట్నర్ ను తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడం ఒక గొప్ప విషయం. అతనిలో చీకాకు, అనూహ్యమైన మానసిక కల్లోలాలు మరియు తన ఆకస్మిక వ్యక్తం వంటివి మీలో విసుగు పుట్టేలా చేయవచ్చు. కానీ, అతనితో ఒక వేళ మీరు ఒక దీర్ఘకాల సంబంధాన్ని కోరుకున్నట్లైతే, అప్పుడు మీరు అతన్ని ఆ పరిస్థితి(డిప్రెషన్) నుండి కోలుకోవడానికి ప్రయత్నించాలి. డిప్రెషన్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ డిప్రెషన్ నుండి కోలుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒక సారి పరిశీలించి అతనికి హెల్ప్ చేయండి...

అతను డిప్రెషన్ లో ఉండటానికి కారణం కనుక్కోండి:

అతను డిప్రెషన్ లో ఉండటానికి కారణం కనుక్కోండి:

ముఖ్యంగా ఏ వ్యక్తియైన బలమైన కారణం లేకుండా డిప్రెషన్ లోకి వెళ్ళరు. కాబట్టి, డిప్రెషన్ కు గల ప్రధాన కారణం కనుక్కోవాలి. ఒక వేళ అతను తన కెరీర్ పరంగా లేదా అతని జీవితంలో ఏవిషయంలోనైనా ఎక్కువ బాధపడుతున్నాడో కనుక్కోండి. ఏమైనా సరే, అతని డిప్రెషన్ కు మొదట కారణం కనుక్కోండి. కారణం కనుక్కొన్నప్పుడు తప్పనిసరిగా పరిష్కారాన్ని కూడా కనుక్కోవచ్చు.

డిప్రెషన్ లో ఉన్నప్పుడు అతని వెన్నంటి ఉండండి:

డిప్రెషన్ లో ఉన్నప్పుడు అతని వెన్నంటి ఉండండి:

పురుషుల్లో ఈగో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. కాబట్టి అతను పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరు అతనికి సపోర్ట్ గా ఉండాలి. ఒక వేళ అతను మీతో చెప్పుకొని ఏడవగలిగినప్పుడు ఓదార్చే ధైర్యం మీలో నింపుకోవాలి. అతనికి నీకు తోడు నేనున్నానంటూ ధైర్యం చెప్పాలి . అటువంటి సమయంలో మీరు అతని గర్ల్ ప్రెండ్ అని మర్చిపోండి. అతను స్నేహంగా మీతో చెప్పుకొనేంత చనువుగా మీరు మెలగాలి.

ప్రశాంతంగా ఉండండి:

ప్రశాంతంగా ఉండండి:

ఎప్పుడైతే అతను డిప్రెషన్ లో ఉన్నాడో అప్పుడు అతని ఆలోచనలు కూడా నెగటివ్ గానే ఉంటాయి. అటువంటి సమయంలో అతనిక సపోర్ట్ గా పాజిటివ్ ఆలోచనలు కలిగే విధంగా మాట్లాడాలి. అతను డిప్రెషన్ లో ఉన్నప్పుడు కట్టలు తెచ్చుకొనే కోపంతో మీ మీద అరవవచ్చు. అటువంటప్పుడు మీరు కొంత ప్రశాంతంగా ఉండాలి. అతను అరిచినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది. తిరిగి సమాదానం ఇవ్వొద్దు.

మీరు ఏమి మాట్లాడుకుండుట:

మీరు ఏమి మాట్లాడుకుండుట:

అతను ఏం మాట్లాడుతాడానికి అలోచించకండి. కాబట్టి అటువంటి సమయంలో మీరు అతనికి సలహాలివ్వడం, ప్రశ్నించడం మంచిది కాదు. దాంతో మరింత క్రుంగిపోయే అవకాశం ఉంది. అతను ఏదైనా చెప్పాలనుకొన్నప్పుడు అతని చేతుల పట్టుకొని, నిధానంగా వినడానికి ప్రయత్నించండి. అతన్ని ప్రశాంతంగా శాంత పరచడానికి ఇదొక్కటే మంచి మార్గం.

మీరు పంచే ప్రేమే గొప్ప మెడిసిన్:

మీరు పంచే ప్రేమే గొప్ప మెడిసిన్:

అతనికి చెప్పండి మీరు ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నారో. అతను విసుగు చెందవచ్చు, కానీ, అతని మనస్సులో ఎక్కడో ఒక మూల ఆ విషయం నీ నుండి వినడానికి సిద్ధంగా ఉంటాడు. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులు ఎదుటి వారు పంచే ప్రేమ మరియు వారి పట్ల తీసుకొనే జాగ్రత్తను చూస్తాడు.

మీరు చెప్పినట్లే వినాలని కోరుకోకండి:

మీరు చెప్పినట్లే వినాలని కోరుకోకండి:

ఈ విషయంలో అతన్ని అతనే విస్మరించుకుంటాడు. కాబట్టి, అతన్ని అలాగే ఉండనివ్వండి.అతన్ని మీరు చెప్పేవి వినాలని వత్తిడి చేయకూడదు. అతని మనస్సు మరియు మైండ్ భారంగా ఉండవచ్చు.

పరిశీలిస్తుండాలి:

పరిశీలిస్తుండాలి:

అతన్ని ఎక్కువ సమయం ఒంటరిగా వదలకండి. ఎందుకంటే అతను మీరు కూడా అతన్ని కేర్ చేయడం లేదని ఆలోచించవచ్చు. మీరు అతనికి దూరంగా ఉన్నా, అతని బాగోగుల గురించి ఫోన్ ద్వారా కనుక్కోండి. అతనికి ఇష్టమైన విషయాల గురించి ఎక్కువ సేపు మాట్లేడాల జాగ్రత్త తీసుకోండి. డిప్రెషన్ నుండి అతని మూడ్ మరో వైపుకు మార్చండి..

Desktop Bottom Promotion