Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అతను మీ మీద ప్రేమకలిగి ఉన్నాడని తెలిపే 6 సున్నిత లక్షణాలు
మీకు ఓ స్నేహితుడు ఉండి, అతను అంతకన్నా ఎక్కువ కాగలడా లేదా అని మీకు నమ్మకం కలగకపోతే, అతనికి మీ మీద మనసుందని తెలిపే ఈ సంకేతాలు మీకు ఉపయోగపడవచ్చు. ఇది చెప్పడం కష్టమేనని నేనూ ఒప్పుకుంటాను, కానీ ఈ సారి మీరు అతనితో ఉన్నప్పుడు మరింత దృష్టి వుంచండి, మీకు సమాధానం దొరకవచ్చు. మీ మీద మనసుందని తెలిపే ఈ సంకేతాలు అన్నివేళలా పని చేయకపోవచ్చు, కానీ ఆ సంకేతాలన్నీ కలిపి చూస్తె మీ బంగారం పండినట్టే!!
1. అతను బయట ఉన్నప్పుడు మీకు సందేశాలు పంపిస్తుండడం
అతను మీకు సందేశాలు పంపే అంత సమయం వెచ్చిస్తున్నాడు అనేది అతనికి మీ మీద మనసుంది అని తెలిపే అన్నిటికన్నా ప్రధానమైన సంకేతం. అతను మీకు అందమైన సందేశాలు పంపుతున్నా, తను అబ్బాయిలతో బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు ఎలా వున్నారో అని అస్తమానూ ఆలోచిస్తుంటే అతను మనసు పారేసుకున్నడనడానికి బాగా అవకాశం వుంది. అబ్బాయిలతో బయటకు వెళ్ళిన అతని మనసులో మీరు లేకపోతె మీకు సందేశాలు పంపడు. మరి అతని మనసులో మీరున్నారంటే, అతనికి మీరంటే ఇష్టం అన్నమాటే కదా!!

2. అతను కంగారు పడుతూ వుండడం
అమ్మాయి మీద ఎటువంటి భావాలు లేకపోతె ఒక అబ్బాయి ఆమెతో ఉన్నప్పుడు కంగారు పడడు. కనుక మీ స్నేహితుడి నుదుటి మీద స్వేద బి౦దువులున్నా, అతని మాటలు తడబడుతున్నా అతనికి మీ మీద మనసుందన్నమాటే!
3. అతను మిమ్మల్ని అభినందిస్తూ వుండడం
మీరిద్దరూ కలిసినప్పుడల్లా అతను మిమ్మల్ని అభినందిస్తూ ఉంటాడా? అలా కొంచెం వింతగా అభినందిస్తూ వుంటే అతని మనసు మారిందన్నమాటే. ఏదో ఒకసారి మీరు బాగున్నారని అనడం కాదు, మీరు కలిసినప్పుడల్లా ఇలా జరుగుతూనే ఉంటుంది. అలాగే మీరు చెప్పిన ప్రతి విషయానికీ అతను నవ్వుతూ వున్నా, మీ గురించి తన స్నేహితులతో మాట్లాడుతూ వున్నా మీ మీద మనసున్నట్టే.
అతను మిమల్ని భార్యగా కోరుకుంటున్నారని చెప్పటానికి సంకేతాలు: క్లిక్ చేయండి
4. మీ ఇష్టాయిష్టాలు తెలిసి వుండడం
మీ ఇష్టాయిష్టాలు మీ స్నేహితులకు కూడా తెలిసి ఉండవచ్చు, కానీ అతను మరో అడుగు ముందుకు వేసి మీకు ఖచ్చితమైన క్రిస్మస్ లేదా పుట్టినరోజు కానుక ఇవ్వగలడు. అతను మీ ఇష్టాలను, అయిష్టాలను, మీరు అతనికి చెప్పిన వాటిని మనసుకు బాగా పట్టించుకుంటాడు.
5. అతని కంటి చూపు
క్లాస్ జరుగుతుండగా అతను మిమ్మల్ని తేరిపార (ప్రేమగా, కొంటెగా కాదు) చూస్తున్నాడా? లేక మీరు చెప్పే ప్రతి దాన్నీ చాలా ఆసక్తిగా వింటున్నాడా? అంటే అతను మీ మీద నిజంగా మనసు పడ్డాడన్నమాట, అతను ఆసక్తి చూపిస్తున్నాడు. ఇది మంచి సంకేతం. అతను మీ మాటలు పట్టించుకుని, మీ అభిప్రాయానికి విలువ ఇస్తున్నానని చెప్తున్నాడు.
మిమ్మల్ని ప్రేమించని వారిని మీరు ప్రేమించకుండా ఉండడానికి 7 చిట్కాలు:క్లిక్ చేయండి
6. మీ మగ స్నేహితుల పట్ల అసూయ చెందడం
సరే, కొంత మంది మగ స్నేహితులు తమ ఆడ స్నేహితుల పట్ల చాలా జాగ్రత్తగా వుంటారనుకోండి. కానీ, ఒక తేడా వుంది, అది మీరూ చెప్పవచ్చు. మీరు కాంటీన్ లో ఒక మగ స్నేహితుడితో ముచ్చటిస్తుండగా మీ స్నేహితుడు వచ్చి అంతా బానే వుందని నిర్ధారించుకుంటే, అతనికి మీరంటే మరులే. అతను కేవలం స్నేహితుడే అయితే, అతను మిమ్మల్ని మీ మానాన వదిలేసి అతను కూడా ఇంకో అమ్మాయితో ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు.



Click it and Unblock the Notifications
