Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
మీ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా మరియు సౌకర్యవంతంగా ఉందనడానికి సంకేతాలివే...
ఒక బంధం లో సౌకర్యవంతం గా ఉండటం చాలా ముఖ్యం. మొదట చూసుకోవాల్సినది కూడా అదే.మనం ఒకవ్యక్తిని భాగస్వామిగా ఎన్నుకోవడానికి అనేక కారణాలుంటాయి. ఆ వ్యక్తి అందం వల్లో, లేదా అతడు/ఆమె బాగా సంపన్నురాలు/సంపన్నుడు అనో లేదా అతడు/ఆమె వల్ల సమాజం లో మీ పరపతి పెరుగుతుందనో భావించి వారిని భాగస్వామిగా ఎన్నుకోవడం తప్పు.మీ అమ్మ మీకు మగవారి గురించి చెప్పని కొన్ని విషయాలివిగో.
మీరు అతనితో ఎంత సౌకర్యవంతంగా ఉన్నారనేదే ముఖ్యం అన్నింటికన్నా.కొన్ని కొన్ని సంకేతాలని గమనిస్తే మీరు అతనితో సౌకర్యవంతంగా ఉన్నారని తెలుస్తుంది.కింద ఇచ్చిన సంకేతాలేమైనా మీలో ఉంటే మీరు సరైన దారిలో వెళ్తున్నట్లే.

ఒక బంధం లో రెండు హృదయాల మధ్య దూరాన్ని తగ్గించి సాన్నిహిత్యాన్ని పెంచడానికి సౌకర్యం చాలా ముఖ్యం.ఇప్పుడు మీరు మీ బంధం లో ఎంత సౌకర్యం గా ఉన్నారో చూద్దాము.
1)మీ ఆందోళనలు మటుమాయం
అతడు లేదా ఆమే దగ్గరున్నప్పుడు మీరు దేని గురించీ ఆందోళనచెందరు.గతం లేదా భవిష్యత్తు కూడా ఆలోచించరు ఆ వ్యక్తి దగ్గరుండగా. వర్తమానమే ముఖ్యం అనిపిస్తుంది మీకు.

2)నిశ్శబ్దం ఎంత మాత్రం ఇక ఇబ్బంది అనిపించదు
మీ భాగస్వామి సమక్షం లో నిశ్శబ్దమైనా సరే మీకు సంతోషాన్నిస్తుంది.ఆ వ్యక్తి తో సంభాషించేటప్పుడు మధ్యలో మాటలు రాకపోయినా మీరు ఇబ్బంది పడరు.ఇలా జరుగుతోందంటే మీరిద్దరూ ఒకరితో ఒకరు సౌకర్యవంతం గా ఉన్నట్లే.
3)మీరు దేని గురించీ ఆలోచించరు
అతను లేదా ఆమె గురించి తప్ప మీకు ఇంక ఏమీ పట్టదు మీకు వారి సమక్షం లో

4)మీ భాగస్వామి గురించే తరచూ ఆలొచిస్తుంటే
మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడుపుతున్నా కానీ మీ భాగస్వామి గురించే ఆలోచిస్తున్నారంటే మీ బంధం లో మీరు దాదాపు మీ చివరి మజిలీ చేరుకున్నట్లే.



Click it and Unblock the Notifications
