For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామితో లైంగిక చర్యకు ఉపక్రమించాలని భావిస్తున్నారా? ఈ నియమాలను పాటించండి.

|

ఒక కొత్త సంబంధంలోకి అడుగు పెట్టారా? మీ భాగస్వామితో లైంగిక సంబంధం కోసం సమీపించే ఆలోచన చేస్తున్నారా? అయితే, ఈ వ్యాసం మీకు సహాయం చేయడం మాత్రమే కాకుండా అర్ధవంతమైన లైంగిక జీవనంలో శాశ్వతమైన ఆనందాన్ని అందుకునేలా దోహదపడుతుంది.

కొత్త సంబంధాలు ఎప్పుడూ ప్రేమకు హనీమూన్ దశలుగా ఉంటాయి. ఈ సమయంలో,తొందరపాటు చర్యలు సంతోషాన్ని ఇవ్వకపోగా లేని పోని సమస్యలను తెచ్చిపెడుతుంది.

Want To Approach Your Partner For Sex? Follow These Guidelines!,

మీ భాగస్వామి మీద మీకు ఎనలేని ప్రేమ ఉండవచ్చు. కానీ, అన్నిటికన్నా ముందు మీపై ఒక నమ్మకం, మరియు విశ్వాసాన్ని కలిగించడం మీ ప్రధమ భాద్యత అన్న విషయం మరవకండి. ఎప్పుడైతే మీ భాగస్వామి మీ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుందో అప్పుడే ప్రేమలో మాధుర్యాలను పొందగలుగుతారు. అడ్రినలిన్ హార్మోనుల పని తీరు కూడా అప్పుడే తెలుస్తుంది. అలా విశ్వాసం లేని పక్షాన, సంబంధాలు యాంత్రిక సంబంధాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ఇద్దరు భాగస్వాముల మద్య అవినాభావ సంబంధం ఉండాలి అంటే, ఖచ్చితంగా వారిరువురి మద్య లైంగిక సంబంధం అనేది కీ-రోల్ పోషిస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. కొన్ని నివేదికల ప్రకారం సంతోషంగా ఉన్న జంటలు వారంలో కనీసం రెండు, మూడు సార్లు లైంగిక సంబంధంలో పాల్గొంటున్నట్లు తెలిపారు కూడా. లైంగిక సంబంధం అనేది ఒకరికొకరు సంతృప్తి పొందడానికే కాదు, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమను బహిర్గతం చేయడానికి కూడా.

లైంగిక సంబంధం మానసికoగా కూడా ఒకరిపై ఒకరికి ప్రేమను పెంచడానికి దోహదం చేస్తుంది. ఇద్దరు భాగస్వాములను మానసికంగా ఒకటి చేయడానికి ఒక మాద్యమంగా ఈ లైంగిక సంబంధం ఉంటుంది.

మీరు లైంగిక సంబంధం కోసం మీ భాగస్వామిని సంప్రదించే కొన్ని మార్గాలను చూద్దాం:

1. సరైన సమయం కనుగొనండి

1. సరైన సమయం కనుగొనండి

ఏ ప్రత్యేకమైన విషయానికైనా సరైన సమయం అవసరం. వారు పని చేస్తున్నప్పుడు లేదా పని మద్యలో ఉన్నప్పుడు మీరు నేరుగా మీ భావాలను వ్యక్తపరచడం సరైనది కాదు. సునిసితత్వంతో కూడిన మూగ భాషను కూడా జోడించవలసి ఉంటుంది. లేదా వారి పనిలో సహాయం చేస్తూ, రొమాంటిక్ టచ్ ఇవ్వడం ద్వారా కూడా మీ భావాలను తెలుపవచ్చు. భాగస్వామిలో రొమాంటిక్ నేచర్ ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. మీ కోరికలకు ఎంతవిలువని ఇస్తారో, అంతే విలువ మీ భాగస్వామి స్వేచ్చకు కూడా ఇవ్వాలని మరువకండి.

2. కమ్యూనికేషన్ అనేది ఎల్లప్పుడూ ముఖాముఖిగా ఉండాలి

2. కమ్యూనికేషన్ అనేది ఎల్లప్పుడూ ముఖాముఖిగా ఉండాలి

ఫోన్ కాల్స్, చాట్స్, మెసేజుల రూపంలో అడగడానికి మీ భాగస్వామి, పరాయి వ్యక్తి కాదు., నేరుగా ముఖాముఖిగా మీ భావాలను వ్యక్తపరచినప్పుడే ఎదుటివారి ఆలోచనలను అర్ధం చేసుకునే తత్వం భాగస్వామికి అలవడుతుంది. ఫోన్, మెసేజులలో మాటలు వినిపిస్తాయి, లేదా టెక్స్ట్ కనిపిస్తుంది. కానీ మనసు, ఎమోషన్ కూడా అర్ధమవ్వాలి అంటే ముఖాముఖి మాట్లాడడమే మంచిది. ఇక్కడ కళ్ళు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ తమ అభిప్రాయాలను తెలిపినప్పుడు, మనసుపొరల్లో వారి పట్ల ఉన్న ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది. అప్పుడు కొన్ని నిబంధనలు కూడా పక్కకు వెళ్తాయి. అలా కాకుండా ఫోన్ మీదనే ఎక్కువ ఆధార పడితే, అది మీ సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది.

3. మీ ఉద్దేశాలలో నిజాయితీగా ఉండండి

3. మీ ఉద్దేశాలలో నిజాయితీగా ఉండండి

మీరు నిజాయితీతో మాట్లాడటం అన్నిటికన్నా ముఖ్యం. క్రమంగా మీ భాగస్వామితో ఏ విషయాన్నైనా చర్చించే స్వేచ్చ మీకుంటుంది. నేరుగా మీ భాగస్వామికే మీ ఆలోచనను తెలియజేయండి. నిజాయితీ మీలో దాగివున్న సత్యాన్ని వెలికి తీస్తుంది తద్వారా మీ ఆలోచనల తీవ్రతరం వాళ్లకు అర్ధం అవుతుంది.

ఆ తర్వాత మీరు లైంగిక సంబంధాన్ని ఎంతగా ఆస్వాదిస్తారో వేరే చెప్పనవసరం లేదు. లైంగిక సంబంధం గురించి మీరు మీ భాగస్వామిని అడగడానికి ఇక్కడ నిజాయితీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నెమ్మదిగా లైంగిక సంబంధాల గురించి మీకున్న ఆలోచనలు, భావాలు, కల్పనలు అన్నిటినీ పంచుకోవడానికి మీకు స్వేచ్చ లభిస్తుంది.

అదే విధంగా మీ భాగస్వామి కూడా తమ భావాలను సంతోషంగా మీతో పంచుకునేలా స్వేచ్చను కల్పించండి. తద్వారా ఇద్దరి మూకుమ్మడి నిర్ణయాలతో సంబంధాన్ని కొనసాగించండి. ఎప్పుడూ మీదే పై చేయిగా ఉండాలన్న భావన మంచిది కాదు. ముందుగా మీ భాగస్వామి నిర్ణయాలకు విలువివ్వాలి. అప్పుడే మీ కోరికలను నెమ్మదిగా తన ముందు ఉంచగలిగే వీలు కూడా ఉంటుంది.

ఇప్పుడు లైంగిక సంబంధం కోసం మీ భాగస్వామిని చేరుకోవటానికి ఒక వాతావరణాన్ని నిర్మించగల ఆసక్తికర మార్గాలను అన్వేషించండి.

మీ లైంగిక జీవనం మరింత ఆసక్తికరంగా ఉండడానికి సలహాలు :

1. ఫాంటసీ

1. ఫాంటసీ

మీ భాగస్వామితో లైంగిక సంబంధానికి ఉపక్రమించాక, వారితో సంబంధాన్ని ఒక నూతన స్థాయికి తీసుకుని వెళ్ళే సమయం ఆసన్నమైందని గమనించండి. ఎప్పుడూ ఒకే రకమైన ఆలోచనలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే ఏరోజుకైనా, కనీసం ఒక్కరిలో అయినా ఆసక్తి కోల్పోవడం అనేది సర్వసాధారణం. కావున ఇలాంటి సందర్భాలలో ఫాంటసీ ఆలోచనలు చేయడం మంచిది. మీరు కొన్ని రకాల ఫాంటసీలను కలిగి ఉంటారు మరియు మీ భాగస్వామి కూడా ఇలాంటివి కలిగి ఉంటే, ఒకరితో ఒకరు పంచుకోవడం ద్వారా లైంగిక జీవనాన్ని సంతోషంగా గడుపవచ్చు. ఇది మీ లైంగిక జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. కోరికలు మరియు కల్పనలు నెరవేరడంలో కూడా సహాయపడుతుంది. మీ భాగస్వామితో మీ ఫాంటసీల గురించి మాట్లాడండి. ప్రయత్నించి చూడండి. మీ ఫాంటసీలను పూర్తి చేయండి.

2. టీజ్

2. టీజ్

టీజింగ్ అనేది సాన్నిహిత్యాన్ని చెక్కుచెదరకుండా చేయడమే కాకుండా, మీ లైంగిక జీవనాన్ని ఒక అసాధారణ స్థాయికి తీసుకెళ్ళడానికి దారిని సుగమం చేస్తుంది. పొగడ్త, స్పర్శ, గిలిగింత వంటి అనేక విషయాలు టీజింగ్లో భాగంగా ఉన్నాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మీ భాగస్వామి బాధ పడకుండా టీజింగ్ నకు ఉపక్రమించవలసి ఉంటుంది.

3.ముద్దు మరియు సాన్నిహిత్యం

3.ముద్దు మరియు సాన్నిహిత్యం

యాదృచ్ఛికంగా మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోండి క్రమంగా సాన్నిహిత్యం పెంచుకునేలా ప్రయత్నించండి. సంబంధంలో తొందరపాటుతనం యాంత్రిక జీవనంలా ఉంటుంది. టీజింగ్, ముద్దు, సాన్నిహిత్యం, కొంటెతనం వంటి చర్యలు మీ లైంగిక జీవనాన్ని అద్భుతంగా మలచడమే కాకుండా. మీ మద్య బంధం మరింత గట్టిపడేలా సహాయం చేస్తుంది.

నొప్పింపక, తానొవ్వొక సూత్రాన్ని పాటిస్తూ మీ భాగస్వామితో మీరు వ్యవహరించే తీరే, మీ కుటుంబ జీవనాన్ని కూడా సంతోషమయం చేస్తుంది. కొందరి విపరీత చర్యలకు, విపరీత ఆలోచనల బారిన పడి ఎవరికీ తమ భాదను చెప్పుకోలేక లోలోపల నరకం అనుభవిస్తున్న వారు ఈ ప్రపంచంలో అనేకులు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం, లైంగిక జీవనంలో భాగస్వాములిద్దరికీ ఏకాభిప్రాయం లేకపోవడమే. మరియు ఎప్పుడూ తమ మాటే నెగ్గాలన్న తీవ్ర భావజాలాన్ని మరియు అహంకారాన్ని ప్రదర్శించడం కూడా. ఇటువంటి చర్యలు, కుటుంబ జీవనాన్ని అసౌకర్యంగా మార్చడమే కాకుండా, దంపతుల మద్య యాంత్రిక జీవనానికి నాంది పలుకుతుంది. కావున మీ భాగస్వామి అభిప్రాయాలను కూడా గౌరవించండి. అభిప్రాయాలతో మీరు ఏకీభవించని పక్షాన, సున్నితంగా చర్చల ద్వారా సమస్యను దారికి తీసుకుని వచ్చేలా ప్రయత్నించండి. అంతేకానీ, అహంకార పూరిత ధోరణి ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది.

మీ భాగస్వామితో లైంగిక జీవితాన్ని సొంతోషమయం చేయగల ఈ మూడు మార్గాలు పాటించి చూడండి మీకే తెలుస్తుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలను, మీ ఆలోచనలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలకోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

Want To Approach Your Partner For Sex? Follow These Guidelines!

Want To Approach Your Partner For Sex? Follow These Guidelines!,Got into a new relationship and now thinking of approaching your partner for sex? Well, this article has been articulated in such a manner that it not only will help you but also will grab you that eternal happiness in your meaningful sex life.
Story first published: Monday, June 25, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more