Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఆ సమయాల్లో శృంగారం చేయకూడదు..రాక్షసులు పుట్టడానికి కారణం ఇదే!
భారతీయ సనాతన ధర్మంలో వివాహ బంధానికి, దాంపత్య జీవితానికి అత్యున్నత స్థానం ఉంది. భార్యాభర్తల కలయిక కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదని అది వంశాభివృద్దికి, ధర్మబద్ధమైన సంతానోత్పత్తికి మూలమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ దాంపత్య సుఖానికి సంబంధించి కూడా కొన్ని నియమాలు, నిషిద్ధ సమయాలు ఉన్నాయి.
ధర్మార్థ కామ మోక్షాణాం అని మన పెద్దలు చెప్పారు. అంటే ధర్మానికి లోబడి కామాన్ని తీర్చుకోవాలి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో భార్యాభర్తలు ముఖ్యంగా నాలుగు సమయాల్లో శృంగారానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ సమయాల్లో కలయిక వల్ల కలిగే అనర్థాలు ఏమిటో, శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇక్కడ చూడండి.

బ్రహ్మ ముహూర్తం
శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే బ్రహ్మ ముహూర్తానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది దేవతలు సంచరించే సమయం. ఈ సమయంలో మనసును దైవారాధన వైపు, ధ్యానం వైపు మళ్లించాలి. సాత్వికమైన ఆలోచనలతో రోజును ప్రారంభించాలి.
అటువంటి పవిత్రమైన సమయంలో కామ వాంఛలకు లోనవ్వడం, శృంగారంలో పాల్గొనడం మహా పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఉదయం సూర్యోదయానికి ముందు, బ్రహ్మ ముహూర్తంలో భార్యాభర్తలు దూరంగా ఉండటమే మంచిదని నండూరి శ్రీనివాస్ సూచించారు.
సంధ్యా సమయం(సాయంత్రం)
సూర్యుడు అస్తమించే సమయాన్ని సంధ్యా సమయం లేదా ప్రదోష కాలం అంటారు. ఇది అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన సమయం. ఈ సమయంలో సాక్షాత్తు పరమేశ్వరుడు తన ప్రమద గణాలతో కలిసి భూమిపై సంచరిస్తుంటాడని... ఆ సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా గడపడం, శృంగారంలో పాల్గొనడం ఆ గణాల దృష్టికి వెళ్తుందని.. ఇది దైవాగ్రహానికి కారణమవుతుందని నండూరి శ్రీనివాస్ తెలిపారు.
పురాణాల ప్రకారం, దితి-కశ్యపులు సంధ్యా సమయంలోనే కలవడం వల్ల హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు వంటి రాక్షసులు జన్మించారు. కాబట్టి సాయంత్రం వేళ దీపారాధన చేసి దైవనామ స్మరణ చేయాలే తప్ప, శృంగారం చేయకూడదని సూచించారు.
పవిత్ర దినాలు, పితృ కార్యాలు
ఇంట్లో ఏవైనా పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటున్నప్పుడు, అలాగే పితృ దేవతలకు సంబంధించిన శ్రాద్ద కర్మలు అంటే తద్దినం వంటివి నిర్వహించేటప్పుడు చాలా నియమంగా ఉండాలి. ఏదైనా పూజ లేదా వ్రతం ఉన్నప్పుడు దానికి ముందు రోజు రాత్రి, పూజ జరిగిన రోజు రాత్రి శృంగారం నిషిద్ధం.
అలాగే పితృ కార్యాలు (శ్రాద్దం) పెట్టేటప్పుడు దానికి ముందు రోజు రాత్రి, ఆ కార్యం జరిగిన రోజు రాత్రి భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. లేదంటే దోషం చుట్టుకుంటుందని నండూరి తెలిపారు.
రజస్వల సమయం
శాస్త్రం చాలా ఖచ్చితంగా చెప్పిన మరో నియమం..స్త్రీలు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కలయికకు దూరంగా ఉండటం. స్త్రీ రజస్వలగా ఉన్నప్పుడు ఆమె శరీరం ఒక ప్రత్యేకమైన శుద్దీకరణ ప్రక్రియలో ఉంటుంది.
ఆ సమయంలో శారీరక సంబంధం పెట్టుకోవడం శాస్త్ర రీత్యా పెద్ద తప్పు, ఆరోగ్య రీత్యా కూడా మంచిది కాదని నండూరి తెలిపారు.



Click it and Unblock the Notifications