Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రెంట్‌కి ఉన్న కుర్రోడితో ఆంటీ ఎఫైర్.. సడన్‌గా చూసిన భర్త ఏం చేశాడో తెలుసా?
ఈ మధ్య కాలంలో మన దేశంలో వివాహేతర సంబంధాలు చాలా పెరిగిపోయాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో పాటు ప్రజల ఆలోచన విధానం కూడా మారిపోవడంతో పెళ్లి తరువాత వివాహేతర సంబంధాలు పెంచుకుంటున్న వారి సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. ఈ సంబంధాల కారణంగా మృతి చెందుతున్న లేదా హత్యకు గురవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి హత్యకు చాలా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా హర్యానాలోని రోహ్‌తక్‌లో అలాంటి ఘటనే జరిగింది. తన ఇంట్లోనే అద్దెకు ఉన్న ఓ వ్యక్తి.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలాగే ఆ ప్రేమాయణం అలానే కొనసాగించాడు. వ్యవహారం ముదరడంతో ఆ ఇంటి ఓనర్ ఆ వ్యక్తిని హతమార్చాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆ విషయాలు ఏంటి? ఆ హత్యకు కారణాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలేం జరిగిదంటే?
పోలీసుల ప్రకారం ఈ కేసులో హత్యకు గురైన వ్యక్తి జగ్‌దీప్, రోహ్‌తక్‌లోని బాబా మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధించేవాడు. అతడికి హరిదీప్ అనే వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుసుకున్న హరిదీప్, దానిని తట్టుకోలేక తన స్నేహితులతో కలిసి జగ్‌దీప్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని గ్రహించిన హరిదీప్.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలేం చేయాలో తనకు తోచేది కాదు. ఈ వ్యవహారం రోజు రోజుకూ ముదురుతున్నట్లు అతను గ్రహించాడు. దీంతో ఎలాగైనా జగ్‌దీప్‌కు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని, అతడిని హతమార్చాలని అనుకున్నాడు. దానికనుగుణంగా అతని హత్య కోసం ప్లానింగ్ చేయడం ప్రారంభించాడు. ఒక రోజు, హరిదీప్ తన స్నేహితులతో కలిసి జగ్‌దీప్‌ను కిడ్నాప్ చేసి, చార్ఖీ దాద్రి పంటవాస్ గ్రామంలోని పొలంలో 7 అడుగుల గొయ్యి తవ్వించి, అందులో సజీవంగా పాతిపెట్టాడు.
హత్య జరిగిన మూడు నెలల తరువాత హత్యకు గురైన వ్యక్తి యొక్క మృతదేహం బయటికి వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అలాగే మరింత సమాచారం కోసం విచారణను కొనసాగిస్తున్నట్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు.
దీనిద్వారా ఏం తెలుసుకోవాలంటే?
ఇటీవల కాలంలో ఈ హత్యలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం, భర్త తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని హత్యలు చేయడం ఎక్కువైపోతున్నాయి. కొంతమంది పిల్లలను సైతం హతమార్చి ప్రియుడితో లేచి పోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనల ద్వారా చాలా తెలుసుకోవాలి.
బంధం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవాలి. ఆ వ్యక్తితో మీరు జీవితాన్ని పంచుకునేందుకు ఆసక్తిగా లేకపోతే చట్టాల పరంగా ఆ వ్యక్తి నుంచి దూరమైపోవాలి. అంతేకాని.. ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడకూడదు. మనం రోజూ చూస్తున్నట్లే.. బెట్టింగ్, అక్రమ సంబంధాలు ఒక కుటుంబాన్నే నాశనం చేసే అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న తప్పులకు మీ పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వివాహేతర అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా, ఇష్టంలేకపోతే విడిపోవడం మంచిది.



Click it and Unblock the Notifications