Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పబ్ కు పోదాం అని చెప్పింది. డేటింగ్ యాప్ కిలాడీ ఏం చేసిందంటే ? బట్టలు మిగిలాయి
అమ్మాయిల మోజులో పడుతున్న అబ్బాయిలు వెనుకా ముందు ఆలోచించకుండా డేటింగ్ యాప్స్ ఇన్ట్సాల్ చేస్తున్నారు. డేటింగ యాప్ ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటున్న అబ్బాయిలు వారితో ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు డేటింగ్ యాప్ లో కొత్తరకం స్కామ్ బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్ లో వెలుగు చూసిన డేటింగ్ స్కామ్ గురించి పోలీసులకు సమాచారం అందిందని తెలిసింది. అమ్మాయిలతో కలిసి హైదరాబాద్ లోని కొంత మంది పబ్ ఓనర్స్ ఈ కొత్త దందాకు తెరలేపారని తెలిసింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ అబ్బాయికి ఇటీవల రితికా అనే పేరుతో ఓ అమ్మాయి డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యింది.

మామూలుగా పరిచయం అయిన కొన్ని రోజుల తరువాత అమ్మాయి కాని, అబ్బాయి కాని నేరుగా కలుద్దాం అని చెబుతుంటారు. అయితే డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అబ్బాయికి మరుసటి రోజే మనం కలుద్దామని రితికా చెప్పింది హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ దగ్గర మనం కలుద్దామని రితిక డేటింగ్ యాప్ లో పరిచయం అయిన అబ్బాయికి చెప్పింది. జాక్ పాట్ తగిలింది అనున్న ఆ అబ్బాయి వెనుకా ముందు ఆలోచించకుండా రేపు మనం కలుద్దాం అని రితికకు చెప్పాడు.
మరుసటి రోజు హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. కొంత సేపు అక్కడే మాట్లాడుకున్న రితిక, ఆ అబ్బాయి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకున్నారని తెలిసింది. తరువాత సమీపంలో ఉన్న గ్యాలేరియా మాల్ లోని పబ్ కు తనను తీసుకు వెళ్లాలని, అక్కడే ఇద్దరూ హ్యాపీగా గడుపుదామని రితిక ఆ అబ్బాయికి తియ్యటి మాటలు చెప్పిందని తెలిసింది.
అమ్మాయి క్లోజ్ గా ఒంటిమీద శరీరం మీద చేతులు వేసి పబ్ కు వెలుదామని చెప్పండంతో మెలికలు తిరిగిపోయిన ఆ యువకుడు రితిక చెప్పినట్లు గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కు వెళ్లారు. తరువాత ఖరీదైన లిక్కర్ ఆర్డర్ చేసిన రితిక ఏకంగా రూ. 40,505 బిల్లు చేసింది. మద్యం మత్తులో ఆ యువకుడు రితిక చెప్పినట్లు విన్నాడు. కిక్కు దిగిపోవడంతో చివరికి తాను మోసపోయానని ఆ యువకుడు తెలుసుకున్నాడు.
చివరికి ఆ పబ్ గురించి గూగుల్ రివ్వూలో వెతికిన యువకుడు తనలాగే చాలా మంది మోసపోయారని తెలుసుకుని లబోదిబో అంటున్నాడు. తనలాగే చాలా మంది అబ్బాయిలు ఇప్పటికే రూ. 20 వేల నుండి రూ. 40 వేల వరకు బిల్లలు చెల్లించారని, పబ్ యాజమాన్యం, అమ్మాయిలు కలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆ యువకుడు వాపోతున్నాడు. మొత్తం మీద రితిక పేరుతో ఆ యువకుడిని బురిడి కొట్టించిన ఆ యువతి ఇంకా ఎంత మందిని మోసం చేసిందో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.



Click it and Unblock the Notifications