Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రేణూ దేశాయ్, విడాకులు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలతో ఆయన వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి పవన్ కల్యాణ్ పోరాడిన తీరు, ఆయన ధైర్యం, అచంచల విశ్వాసం ప్రజలను ఆకట్టుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ ను పొగిడిన తీరుతో దేశం మొత్తం ఆయన వైపు చూసేలా చేసింది. రాజకీయాలతో పాటు నటనలోనూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ మాత్రం తన పెళ్లిళ్లు, కుటుంబానికి సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు పెళ్లి విషయంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా అనేక మంది రకరకాలలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కొందరు నాయకులు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసి ఆయన మూడు పెళ్లిళ్ల విషయంలో చులకనగా మాట్లాడారు.

అయితే పవన్ కల్యాణ్ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలను ఫాలో అయ్యి ఆయన ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని గెలిపించుకున్నారు. మాజీ భర్త పవన్ కల్యాణ్ క్షేమానికి సంబంధించి ఆయన రెండో భార్య రేణూదేశాయ్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉంటుంది. దక్షిణ భారత నటి రేణూదేశాయ్ 2008లో పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్నారు.
అయితే 2012లో పవన్ కల్యాణ్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్నారు. పవన్ కల్యాణ్, రేణూదేశాయ్ దంపతులకు కుమారుడు అకీరా, కుమార్తె ఆధ్య ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వాళ్లు విడాకులు తీసుకున్నారని, వారి రిలేషన్ షిప్ తెగిపోయిందన్న కారణంతో రేణూదేశాయ్ మీద ఇప్పటికీ కోపంతో కొన్నిసార్లు ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే వీరిద్దరి మధ్య విడాకులకు గల కారణాలను ఇటీవల రేణూదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ తమ విడాకుల గురించి ఓపెన్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను రేణూదేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. పవన్ కల్యాణ్ అభిమాని అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ను అసహనానికి గురైన రేణూదేశాయ్ తాను పవన్ కల్యాణ్ తో ఎందుకు విడిపోయాను అనే విషయం ఆ అభిమానికి ఘాటుగానే రిప్లే ఇచ్చింది. మీరు పవన్ కల్యాణ్ నుంచి ఎందుకు విడాకులు తీసుకున్నారని, మీరు ఇంకా ఓపిక పట్టి ఉండాల్సింది, మీరు పవన్ అన్నను దేవుడిలా చూసుకుని ఉండాల్సింది అని ఆ అభిమాని రేణూదేశాయ్ కు ఉచిత సలహా ఇస్తూ ఓ పోస్టు చేశాడు.

మాజీ భర్త అభిమాని పెట్టిన పోస్టుకు సహనం కోల్పోయిన రేణూదేశాయ్ ఆమె స్టైల్లో రిప్లే ఇచ్చారు. ఈ వివాహాన్ని నేను విచ్ఛిన్నం చేయలేదు, కానీ నా మాజీ భర్త పవన్ కల్యాణ్ నన్ను విడిచిపెట్టాడు, ఇప్పుడు మీరు అలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలు చెయ్యకూడదు. ఆయన నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు, వేరే మార్గం లేక నేను విడాకులు తీసుకున్నానని, దయచేసి అటువంటి వ్యాఖ్యలు మరోసారి చెయ్యకూడదని, నన్ను మాత్రమే మీరు ఇలా ఎందుకు హింసిస్తున్నారు అని రేణూదేశాయ్ పోస్టు పెట్టిన అభిమానిని ప్రశ్నించారు.
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆయన రెండో భార్య రేణూదేశాయ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు. అయితే రేణూదేశాయ్ మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అయితే రేణూదేశాయ్ కి కొన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది, అయితే ఆమె పెళ్లి చేసుకోకుండానే నిశ్చితార్థాన్ని బ్రేక్ చేశారు. నాకు నిశ్చితార్థం అయినప్పుడు నా కుమార్తెకు 7 సంవత్సరాలు. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయాన్ని మార్చుకున్నానని రేణూదేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు
హీరో పవన్ కల్యాణ్ మొదట నందిని అనే యువతిని పెళ్లాడారు. కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత పవన్ కల్యాణ్, నందిని విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బద్రి సినిమాలో నటించిన రేణూదేశాయ్‌ని పవన్ కల్యాణ్ పెళ్లాడారు. కొడుకు, కూతురు పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్, రేణూదేశాయ్ విడాకులు తీసుకున్నారు. తరువాత 2013 సెప్టెంబర్ 30వ తేదీన రష్యన్ నటి అన్నా లెజినోవాలను పవన్ కల్యాణ్ తిరిగి వివాహం చేసుకున్నాడు.



Click it and Unblock the Notifications