Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
భార్యలు మిమ్మల్ని పువ్వులో పెట్టుకొని చూసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి! 100% వర్క్ అవుతుంది
కాలం మారుతున్న కొద్దీ వ్యక్తుల అభిప్రాయం, వారి ప్రవర్తన విధానం కూడా మారుతూ వస్తుంది. గతంలో చాలా మంది తమ కుటుంబ అభివృద్ధి కోసం కష్టపడితే.. ఈ మధ్య కాలంలో చాలా మంది తమ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలో కుటుంబాన్ని సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కుటుంబం మరియు కెరీర్ మధ్య సరైన బ్యాలెన్స్ చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
డబ్బు పరంగా ఎంత సంపాదించినా సరైన పద్దతిలో కుటుంబానికి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారు. దీంతో వారి కుటుంబంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. అవి పెను ప్రమాదంగా మారి, విడాకులు.. ఆత్మహత్యల వరకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ స్టోరీలో కుటుంబాన్ని, కెరీర్‌ని సమతుల్యంగా బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.

ప్రతి వ్యక్తి అవసరాలు తెలుసుకోండి
కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెద్దల నుండి చిన్న పిల్లల వరకు ప్రతీ ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వడం, వారి అవసరాలను ముందుగానే తీర్చేందుకు ప్రయత్నించడం వారి మనసులను గెలుచుకుంటుంది.
మీ తప్పులను అంగీకరించండి
ప్రతి ఒక్కరు కొన్ని తప్పులు చేస్తారు. వాటిని అంగీకరించడం, పొరపాట్లు జరిగితే క్షమాపణ చెప్పడం వంటివి చేస్తే ఎలాంటి గొడవైన సద్దుమణిగిపోతుంది. అలాగే ఎదుటి వ్యక్తిలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల నమ్మకం,ప్రేమ పెరుగుతుంది.
మాటలతో సంబంధాన్ని మెరుగుపరచండి
ప్రతి రోజు కనీసం కొద్దిసేపు కుటుంబంతో సమయం గడపడం చాలా అవసరం. వారితో మాట్లాడుతూనే వారి మనసులోని భావాలను అర్థం చేసుకోవాలి. అలాగే, ఎదుటి వారి ఆలోచనలు, భావాలను మీరు సున్నితంగా అంగీకరించి వినడం చేస్తే కచ్చితంగా బంధం అనేది మెరుగుటపడుతుంది.
మీ స్వీయ సంతృప్తి
ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నంలో మనం స్వీయ సంతృప్తిని మరచిపోతాం. మీ ఆరోగ్యం, మానసిక స్థితి స్థిరంగా ఉండడం అవసరం. స్వీయ సంతృప్తి అనేది స్వార్థం కాదు, మీరు సంతృప్తిగా ఉంటేనే మీ కుటుంబం కూడా సంతృప్తిగా ఉంటుంది. అప్పుడే మీ కుటుంబం ముందుగు ప్రయాణం సాగించగలుగుతుంది. అందుకే ఇది చాలా అవసరం.
నెగిటివ్ ఆలోచనలు వదిలించుకోండి
కొంతమంది సానుకూలంగా ఆలోచించడంలో విఫలమై నెగెటీవ్ ఆలోచనలను ఆరాధిస్తారు. ఈ క్రమంలో ఎదుటి వారిని నిందించడం, వారితో మనస్పర్థలు పెట్టుకోవడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య సంబంధం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే సంబంధానికి ముప్పులు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. అందుకే నెగెటివ్ ఆలోచనలను మానేయడం చాలా మంచిది.
మీ కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని నిర్ణయించుకోండి!
ఎప్పటికప్పుడు మీ కుటుంబంతో గడిపే సమయాన్ని నిర్ణయించుకోండి. మీరు అనుకున్న సమయానికి ప్రతిరోజూ వారితో గడపడం కష్టం కావొచ్చు, కానీ ఆ సమయం మిస్ అయినా.. వేరే సమయంలో వారితో గడపడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య బంధం అనేది పెరుగుతుంది.



Click it and Unblock the Notifications