Latest Updates
-
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
మనదేశంలో ఉన్న బెస్ట్ హనీమూన్ స్పాట్స్ ఇవే..
పెళ్లైన ప్రతీ జంట హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలని చాలా ప్రదేశాల గురించి వెతుకుతారు. భారత దేశంలో హనీమూన్ కోసం ఎన్నో హాట్‌స్పాట్ టూర్స్ ఉన్నాయ్. మన దేశం కేవలం చారిత్రక కట్టడాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు మాత్రమే కాదు ప్రేమికులకు, పెళ్లైన జంటలకు రొమాంటిక్ కిక్ ఇచ్చే ఎన్నో ప్రాంతాలు కూడా ఉన్నాయ్. వాటిలో సముద్రంవద్ద నున్న గోవా, చెన్నై మెరీనా బీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏ కాలంలోనైనా సరే ఆ కాలానికి తగ్గట్టు మన దేశంలో హనీమూన్ ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశాలున్నాయ్. మంచు ప్రదేశాల నుంచి పచ్చదనం, ఎడారి ప్రాంతాల వరకు చుట్టేయవచ్చు.
మనాలి:
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మనాలీ చిన్న స్వర్గంగా గుర్తింపబడుతోంది. అక్కడున్న లోయలు, మంచు కొండలు, పచ్చదనం మాటల్లో వర్ణించలేనిది. కుటుంబంతో పాటు ఎంతో మంది ప్రేమజంటలకు ఇది తియ్యని అనుభూతినిచ్చే ప్రాంతం. కొత్తగా పెళ్లైన వారు మనాలీ వెళ్తే అక్కడే సంసారం మొదలుపెట్టి సెటిల్ అవుదాం అనిపిస్తోందంటే మనాలీ గురించి ఇంతకంటే మంచిగా వ
ఉదయ్‌పూర్:
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కపుల్స్‌కు మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్‌గా చెప్పుకోవచ్చు. అక్కడ పదుల సంఖ్యలో ఉండే ప్యాలస్‌లో కనువిందు చేస్తాయ్. 16వ శతాబ్దంలో రాజ్‌పుత్‌లు నిర్మించిన ఎన్నో కోటలను చూస్తూ తిరుగుతూ హనీమూన్ కపుల్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఉదయ్‌పూర్‌లో ఉండే హవీలీలు, బజార్లు, పర్వతశ్రేణులను చూస్తే ఆ ఆనందానికి హద్దు ఉండదంటే నమ్ముతారా.
ఖజురాహో దేవాలయం:
మధ్యప్రదేశ్‌లో ఉండే ఖజురాహో దేవాలయాన్ని హనీమూన్ స్పాట్‌గా ఎంపిక చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లోకి ఈ దేవాలయ కట్టడానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అక్కడ దేవాలయాలపై చెక్కిన శిల్పాలు, కళలు చూస్తే మంత్రముగ్ధులు కావలసిందే.
అండమాన్ దీవులు:
సముద్రం, బీచ్, పచ్చదనం, కొత్తదనం, కొత్త సంస్కృతి అందమైనవన్నీ కలిస్తే అండమాన్. సముద్రం, బీచ్ కంటే మించిన అందాన్ని ఆస్వాదించాలంటే దీవులకు వెళ్లాల్సిందే. హనీమూన్‌కు అండమాన్ దీవులను ప్లాన్ చేసుకుంటే కపుల్స్‌గా అక్కడ చేసినంత ఎంజాయ్‌మెంట్ ఇంకెక్కడా చేయలేరు.
ఖండాలా:
అమిర్‌ఖాన్ పాత సినిమా 'గులామ్'లో 'ఆతీ క్యా ఖండాలా' అనే పాట ఉంటుంది. ఆ పాటలో హీరోయిన్‌ను ఖండాలా వస్తావా వెళ్దామంటాడు. దాదాపు 25 ఏళ్ల క్రితమే వచ్చిన ఈ సినిమాలో ఉన్న ఖండాలా ఇప్పుడు కూడా హనీమూన్‌కు హాట్ స్పాట్. మహారాష్ట్రలో ఉండే ఖండాలా, లోనావాలాను సందర్శించకుంటే అందమైన ప్రాంతాన్ని మిస్ అవుతున్నట్టే. అక్కడ లోయల మధ్యలోంచి వెళ్లే నదిని చూస్తే మంత్రముగ్ధులమవుతామ్. వర్షాకాలంలో వెళ్తే వాటర్ ఫాల్స్, పర్వతాలు, పచ్చదనం చూస్తే కపుల్స్‌కు మంచి రొమాంటిక్ ఫీల్ కలిగి వారి ఆనందం మరింత రెట్టింపవుతుంది.



Click it and Unblock the Notifications
