Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అబ్బాయి నుంచి అమ్మాయి ఎక్స్ పెక్ట్ చేసేదేంటి ?
ఏ రిలేషన్ లోనైనా అమ్మాయి, అబ్బాయి ఒకరి నుంచి మరొకరు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అమ్మాయిలు అబ్బాయిల నుంచి చాలా విషయాలు ఎక్స్ పెక్ట్ చేస్తారు. తన పార్టనర్ నుంచి చాలా ప్రేమను ఆశిస్తారు. అమ్మాయిలను ఎలా సంతోషపెట్టాలో మీకు ఐడియా లేదా ? మీ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోలేక పోతున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చదివితే మీ పార్టనర్ ని సంతోషపెట్టేయడానికి మార్గాలు దొరుకుతాయి.
అమ్మాయిల మనసు సంతోషపెట్టడానికి చాలా మార్గాలున్నాయి. అయితే ఆమె ఎలాంటి పనుల వల్ల సంతోషంగా ఫీలవుతుందో తెలుసుకోవాలి. అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల నుంచి గౌరవించడం, బుజ్జగించడం, మహారాణిలా చూసుకోవడాన్ని ఇష్టపడతారు, ఎక్స్ పెక్ట్ చేస్తారు. మీ రిలేషన్ లో ఉన్న అమ్మాయి ఫేస్ లో నవ్వు చూడాలంటే ఏం చేయాలో వెంటనే తెలుసుకోండి.

జాకెట్ ఇవ్వడం
మీ పార్టనర్ చలిగా ఫీలవుతున్నప్పుడు మీ జాకెట్ ఇచ్చి చూడండి. ఎంత సంబరపడిపోతుందో. మీకు ఆమె ఎంత ప్రత్యేకమో వివరిస్తూనే.. ప్రేమను చూపించారని హ్యాపీగా ఫీలవుతుంది.

రెస్టారెంట్ మ్యానర్స్
మీ పార్టనర్ ని ప్రేమపంచడానికి రెస్టారెంట్ కూడా ఒక వేదికే అని మర్చిపోకండి. ఆమె రెస్టారెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు తన కోసం ఛెయిర్ లాగడం, కంఫర్టబుల్ గా ఉందో లేదో తెలుసుకోవడం మీ పార్టనర్ కి అంతులేని సంతోషాన్నిస్తుంది.

బ్యాగ్స్ పట్టుకోవడం
జెంటిల్ మ్యాన్ గా ఉంటూనే ఆమె బిల్స్ మీరు కట్టాలి. అయితే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తమ బిల్లులు తామే పే చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఆ విషయంలో తన అంగీకారం తీసుకోవాలి. అలాగే తన బ్యాగ్స్ మీరు పట్టుకోవడం వల్ల మీ హెల్పింగ్ నేచర్ తో మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయవచ్చు.

డోర్స్ ఓపెన్ చేయడం
ఎక్కడైనా సరే ఇద్దరూ వెళ్లాల్సి వచ్చినప్పుడు తలుపులు తీసి, ముందు తను వెళ్లడానికి అవకాశం ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా పీలవుతుంది. ఇది చాలా చిన్న విషయమే అయినా.. ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది.

గిఫ్ట్స్
మీ డ్రీమ్ గర్ల్స్ ని మొదటిసారి కలుస్తున్నప్పుడు ఏదైనా కానుక తీసుకెళ్లడం మర్చిపోకండి. ఒట్టి చేతులతో కాకుండా.. చిన్న గిఫ్ట్ అయినా తీసుకెళ్తే చాలా హ్యాపీగా, స్పెషల్ గా ఫీలవుతుంది.

వర్షంలో రొమాన్స్
వర్షంలో రొమాన్స్.. మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ పార్టనర్ ని వర్షంలో డ్యాన్స్ చేయమని అడగండి. ఒకవేళ డ్యాన్స్ చేయడానికి తను ఇష్టపడకపోతే.. వేరే పద్ధతిలో చిలిపి చేష్టలు చేసి.. మీ గర్ల్ ఫ్రెండ్ ని ఆనందంలో నింపండి.



Click it and Unblock the Notifications