సున్నితమైన భాగస్వామిని అర్థం చేసుకుని వ్యవహరించటానికి 10 చిట్కాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఈరోజుల్లో మనం చాలామంది ఆసక్తికర మనుషులకి ఆకర్షితులమవుతాం. వారితో కలిసి కొంత సమయం గడిపాక, ఇద్దరి మధ్యలో సారూప్యతలను అర్థం చేసుకొని ప్రేమలో పడతాం.

బంధాలెప్పుడూ ఇచ్చిపుచ్చుకోవటల మధ్యలో ఉంటాయి. ఇద్దరూ ఒకర్నొకరు అర్థం చేసుకొని, సర్దుకుపోవటంపై బంధం ఆధారపడి ఉంటుంది. బంధాలు కూడా చాలా సున్నితంగా ఉండి, వాటిని నిలబెట్టుకోడానికి రెండు వైపుల నుండి శక్తి, శ్రమ అవసరం.

భావోద్వేగాలు ఎక్కువ ఉండే భాగస్వామిని అర్థం చేసుకోడానికి చిట్కాలు

ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో ఉన్నప్పుడు, ఇద్దరికీ వేర్వేరు మూడ్ లు, కోపతాపాలు ఉండటం సామాన్యమే. మీ భాగస్వామి అంతర్ముఖులు కావచ్చు, అదే సమయంలో మీరు బయటకి వెళ్ళి అందర్నీ కలిసే స్వభావం కలిగి ఉండవచ్చు.

tips to understand an emotional partner

మీకు నచ్చే పనుల్లో మీ భాగస్వామికి ఆసక్తి ఉండకపోవచ్చు. ఇవన్నీ మీ బంధంలో సమస్యలు సృష్టించవచ్చు కానీ ఇద్దరూ కలిసి సమయం గడిపి, మీ భావాలను పంచుకొని సమస్యలు పరిష్కరించుకోవటం మంచిది.

కానీ రెండు వైపుల నుండి అర్థం చేసుకోవటం, నిబద్ధత చాలా అవసరం. అదికూడా ఇద్దరిలో ఒకరు మరొకరి నుంచి ప్రత్యేకంగా ఆధారపడినప్పుడు మరింత అవసరమవుతుంది.

మీ భాగస్వామి రోజువారీ చిన్నచిన్న విషయాలకి చింతిస్తున్నారా? మీతో తన ఆలోచనలు పంచుకోకుండా వారిలో వారే ముడుచుకుపోతున్నారా?

అదే విధంగా కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలకే అధికంగా సంతోషపడిపోతూ, మూడ్ లు చాలా మారిపోవటం గమనిస్తున్నారా? ఇవన్నీ మీ భాగస్వామి అధికంగా భావోద్వేగాలకి లోనవుతారని తెలియచేసే లక్షణాలు.

భావోద్వేగాలు ఎక్కువుండే భాగస్వామితో వ్యవహరించటం కొంచెం కష్టమే. వారు తరచుగా తమ ఎమోషన్లలో కొట్టుకుపోతూ మీ ధ్యాసను అనుక్షణం కోరతారు.

వాటిల్లోంచి బయటకి రాకపోతే కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అన్ని విషయాలపట్ల సున్నిత మనస్కులై ఉండవచ్చు కానీ వారిలో సడెన్ గా వచ్చే మూడ్ మార్పులతో ఎలా వ్యవహరించాలో మీరు సందిగ్థంలో పడిపోతారు.

ఈ రకపు భాగస్వాములు మానసికంగా చాలా ఆధారపడుతూ, త్వరగా బాధపడిపోతారు. మీరు చాలా అర్థం చేసుకునే మనస్సుతో ఉండి, వారి పట్ల సానుభూతి కలిగిఉండాలి.

ఈ వ్యాసంలో, మేము అలాంటి భాగస్వామితో వ్యవహరించటానికి, అర్థం చేసుకోటానికి 10 చిట్కాలను అందింఛాం. చదివి అమలుపర్చండి.

1. సంభాషణ చాలా ముఖ్యం;

1. సంభాషణ చాలా ముఖ్యం;

మీ భాగస్వామికి మీరు వారేం మాట్లాడినా,చెప్పినా వింటామని తెలియచేయండి. ఇది వారికి హాయిని కలిగించి, వారు హఠాత్తుగా ఎందుకు విరుచుకుపడ్డారో అసలు కారణం తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.

2. వారి ఆలోచనలను మరో విషయంపైకి మళ్ళించండి;

2. వారి ఆలోచనలను మరో విషయంపైకి మళ్ళించండి;

మీ భాగస్వామి ఏదో విషయంపై చాలా బాధగా ఉన్నప్పుడు, వారు దానిగురించే ఆలోచిస్తూ,చింతిస్తుంటారు. వారిని మరోపని వైపుకి మళ్ళించి వారి ఆలోచనలను తగ్గించండి.

3. వారికి మానసికంగా అండగా నిలవండి;

3. వారికి మానసికంగా అండగా నిలవండి;

మీరొక పంచ్ బ్యాగులా మారి వారికి ఏది అన్పిస్తే అది అననివ్వండి, చేయనివ్వండి. ఇది వారు మనసువిప్పి మాట్లాడేలా చేస్తుంది. మీ బంధం కూడా బలపడుతుంది. మీ భాగస్వామికి మీరున్నారని అర్థమైతే, వారు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు.

4. వారి భావోద్వేగాల మార్పులకి కఠినంగా ఉండకండి;

4. వారి భావోద్వేగాల మార్పులకి కఠినంగా ఉండకండి;

మీ భాగస్వామికి ఎవరితోనైనా సమస్య ఉంటే, వారు చెప్పేది అంతా సహనంగా వినండి. వారే తప్పు అని నిర్ణయించేసుకుని, వారి భావాలు అర్థం చేసుకోకపోతే అది మీ బంధాన్ని మరింత సంక్లిష్టపరుస్తుంది. వారికి మీ మీద నమ్మకం కూడా తగ్గిపోతుంది.

5. వారిని ఏ విషయాలు బాధపెడుతున్నాయో అర్థం చేసుకోండి.

5. వారిని ఏ విషయాలు బాధపెడుతున్నాయో అర్థం చేసుకోండి.

మీ భాగస్వామితో చాలా సమయం కలిసి గడిపాక, మీకు వారి మారే భావాలు, మూడ్ ల గురించి తెలిసే ఉంటుంది. ఏ విషయాలు వారిని బాధపెడుతున్నాయో తెలుస్తుంది. వారిని అలాంటి భావోద్వేగ సంఘటనలనుంచి, చర్చలకి దూరంగా ఉంచండి. లేకపోతే మళ్ళీ అదే ఆలోచనలలోకి వెళ్ళిపోతారు.

6. వారికి స్వేచ్చనివ్వటానికి ప్రయత్నించండి;

6. వారికి స్వేచ్చనివ్వటానికి ప్రయత్నించండి;

కొంతమందికి తమ ఆలోచనలను పంచుకోవటం నచ్చదు. అలాంటి కేసుల్లో, వారిని ఒంటరిగా వదిలేయటమే మంచిది. వారికి తమంతట తాము మనసువిప్పి మాట్లాడాలనుకుని సౌకర్యంగా ఉన్నప్పుడే వారితో ఉండి, దగ్గరవ్వండి.

7. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలు తప్పక తీసుకోండి;

7. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలు తప్పక తీసుకోండి;

మీ బంధంలో ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా వారిని కూడా అందులో భాగం చేయండి. ఇది వారికి అధికారం ఇచ్చినట్టయి, వారి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. సున్నితమైన వారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది అందువలన నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చినపుడు వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

8.మీరేం ఫీలవుతున్నారో వారికి తెలియచేయండి;

8.మీరేం ఫీలవుతున్నారో వారికి తెలియచేయండి;

మీ భావాలను వారితో పంచుకోవటం వలన వారికి మీ జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నదని తెలియచేస్తున్నట్టు. ఇది మీ ప్రేమను పెంచి, వారిలో కూడా మీ పట్ల ప్రేమను మరింత ఎక్కువచేస్తుంది.

9. మీ భాగస్వామి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను తెలుసుకోటానికి ప్రయత్నించండి

9. మీ భాగస్వామి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను తెలుసుకోటానికి ప్రయత్నించండి

సున్నితమైన భాగస్వామి ఎప్పుడూ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల నుంచి అంగీకారం ఆశిస్తారు. మీకు ఇలాంటి వారు దొరికినప్పుడు, వారు మిమ్మల్ని ఒక స్థిరమైన బంధం కోరుకుంటున్నవారిగానే చూస్తారు. అందుకే మిమ్మల్ని నమ్మి వారి గురించి మరింత తెలియచేస్తారు.

10. కౌన్సెలింగ్ తీసుకోండి.

10. కౌన్సెలింగ్ తీసుకోండి.

మీ భాగస్వామి మూడ్ ను మీరు నియంత్రించలేకపోతున్నట్లయితే, మీ బంధం పాడవకముందే నిపుణుడి సలహా తీసుకోవటం మంచిది. ఈ కౌన్సెలింగ్ సెషన్లు మీకు, మీ భాగస్వామికి ఉపయోగపడి మీ బంధాన్ని ధృఢపరుస్తుంది.

ఇంకా చదవండి ; బంధాలు

English summary

tips to understand an emotional partner | tips to handle an emotional partner | how to handle an emotional partner

Relationships are all about a give and take policy. It is about understanding each other and making adjustments. Relationships are also very fragile and require efforts to make them work.
Subscribe Newsletter