For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక మహిళ వేధింపులకు గురవుతుందని తెలియచేసే 5 సంకేతాలు

వేధింపులకు గురయ్యే మహిళ తన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రకంపనలకు స్పందించే విధానం బట్టి వారిలోని ఆందోళనా శాతాన్ని అంచనా వేయవచ్చు.వివిధ సందర్భాలలో వారి రియాక్షన్స్ ద్వారా వారు వేధింపులకు గురవుతున్నారని

|

వేధింపులకు గురయ్యే మహిళ తన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రకంపనలకు స్పందించే విధానం బట్టి వారిలోని ఆందోళనా శాతాన్ని అంచనా వేయవచ్చు.

వివిధ సందర్భాలలో వారి రియాక్షన్స్ ద్వారా వారు వేధింపులకు గురవుతున్నారని తెలుసుకోవచ్చు. ఏవైనా కారణాల చేత వేధింపులకు గురయ్యే మహిళలు ఎవరి సహాయం కోరని పరిస్థితి ఎదురుకావచ్చు. అయినా, వారు ఏ విధంగా వేధింపులకు గురవుతున్నారో వారు చెప్పకపోయినా తెలుసుకోవచ్చు.

5 Signs that a Woman is Being Abused

ఈ క్రింది సంకేతాల ద్వారా ఒక మహిళ వేధింపబడుతుందో లేదో తెలుసుకోవచ్చు.

మహిళ వేధింపులకు గురవుతుందని తెలియచేసే 5 సంకేతాలు...

1. వారి చర్మాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచుతారు:

1. వారి చర్మాన్ని ఎల్లప్పుడూ కప్పి ఉంచుతారు:

వేధింపులు అనేవి అనేక రకాలు. కొందరు మానసిక వేధింపులకు గురవుతారు. మరికొందరు శారీరక వేధింపులకు గురవుతారు. అలా శారీరక వేధింపులకు గురయ్యే మహిళలు తమ చర్మంపై వేధింపులను తెలియచేసే బొబ్బలు అలాగే గాయాలను ఎల్లప్పుడూ కప్పి ఉంచేందుకు ప్రయత్నిస్తారు.

సాధారణంగా ఎక్కువగా మేకప్ వేసుకొని వారు ఎప్పుడూ వేయనంత దట్టమైన మేకప్ ని వేసుకున్నా, అలాగే తమ చేతులను కనిపించకుండా దాచుకుంటూ ఉన్నా, ఇతర శరీర భాగాలపైనున్న గాయాలను కప్పి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నా వారు వేధింపులకు గురవుతున్నారని అనుకోవాలి.

ఎలా గుర్తించాలి? వారి చర్మంపై గాయాలు కనపడకుండా కప్పి ఉంచడానికి వారు ప్రయత్నించేటప్పుడు వారిలో కనిపించే ఆందోళనని, దిగులుని గమనించాలి. అలాగే వారిచ్చే పొంతన లేని సమాధాలను గమనించాలి.

2. వారిని వేధించే వారికి కోపం కలగకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు:

2. వారిని వేధించే వారికి కోపం కలగకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు:

వేధింపులకు గురయ్యే మహిళలు సదా ఒక రకమైన ఆలోచనా ధోరణితో ఉంటారు. తమను వేధించే వారికి ఆగ్రహం కలగకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు.

ఉదాహరణకు, వారికి అత్యవసరమైన వాటి గురించి కూడా అడగడానికి భయపడతారు. ఎవరినైనా కలవడానికి సంశయిస్తారు. తమ స్నేహితులను కూడా కలవడానికి ఇష్టపడరు. బయటకు వస్తే తన భాగస్వామికి నచ్చదని, తన భాగస్వామికి తనతో ఎక్కువ సమయం గడపడం ఇష్టమని అందువలన కలవలేకపోతున్నానని చెప్తూ స్నేహితులతో చెప్పుకుంటారు.

అలా, వేధింపులకు గురైన మహిళలు తమ స్వంత అవసరాలపై కూడా దృష్టి పెట్టలేకపోతారు. ఎల్లప్పుడూ తమకే హానీ జరుగుతుందోనని భయపడుతూ బ్రతుకుతారు. తనను వేధించే తన భాగస్వామికి ఆగ్రహం రాకుండా చూసుకోవడానికి తమ అవసరాలను కూడా లెక్కచేయకుండా తీవ్రంగా మథనపడతారు.

3. వారి జీవితానికి సంబంధించిన విషయాలను దాస్తారు:

3. వారి జీవితానికి సంబంధించిన విషయాలను దాస్తారు:

అంతే కాదు, వేధింపులకు గురయ్యే మహిళలు తమ బంధువుల వద్ద అలాగే స్నేహితుల వద్ద తమ జీవితం గురించి చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడరు.

ఒకవేళ బంధుమిత్రులను కలవాల్సి వస్తే వారికి తమకు సంబంధించిన విషయాలేమీ చెప్పకుండా సమాధానాలు దాటవేస్తారు. అసలేం జరుగుతుందో ఎవరికీ తెలియనివారు. ఏవేవో సాకులు చూపించి అసలు విషయాన్ని దాటవేస్తారు.

ఏదైనా సంభాషణలో తమ గురించి చెప్పవలసి వస్తే అసహజంగా స్పందించి తడబడుతూ ఆ టాపిక్ ను మార్చివేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఆచితూచి మాట్లాడతారు. పొరపాటుగా మాట్లాడే ఏ మాటైనా తమ భాగస్వామితో తమకి మళ్ళీ ఇబ్బందులకు కలిగిస్తుందేమోనన్న సంశయంలో ఉంటారు.

ఈ లక్షణాలన్నీ, వారు తీవ్రమైన మనోవేధనతో సతమతమవుతున్నారని తెలియచేసే అనేక సంకేతాలు.

4. ఎల్లప్పుడూ తమని డిఫెన్స్ చేసుకుంటూ ఉంటారు:

4. ఎల్లప్పుడూ తమని డిఫెన్స్ చేసుకుంటూ ఉంటారు:

వేధింపులకు గురయ్యే మహిళలు తమ శరీరంపై దాగున్న గాయాలను కనిపించకుండా ఉండేందుకు అనేక విధాలుగా తాపత్రయపడుతూ ఉంటారు. తమ శరీరంపైనున్న గాయాలపై ఎవరి దృష్టి పడకూడదని ప్రయత్నిస్తారు.

ఈ విధమైన ఆలోచనా ధోరణితో ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉంటారు. ఎవరి చేయైన పొరపాటున తగిలినా అతిగా స్పందిస్తారు. అందరూ తమపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే భావన ఇందులో కనిపిస్తుంది.

ఎవరైనా ఏదైనా పని కోసం చేయెత్తినా తమపై చేయి చేసుకోవడానికే చేయెత్తారని భయపడుతూ తమ ముఖాన్ని తమ చేతితో కప్పి ఉంచుతారు. ఈ విధమైన భయాందోళనచేత వారెప్పుడు తమను డిఫెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

5. బాధ్యతలను మోయలేని భారాలుగా భావిస్తారు:

5. బాధ్యతలను మోయలేని భారాలుగా భావిస్తారు:

వేధింపులకు గురయ్యే మహిళలు తమనెప్పుడూ ఒక బాధితులుగా పరిగణించుకుంటూ ఉంటారు. తమ భాగస్వామి చేత దెబ్బలు తినడానికే తమ జీవితం అంకితమైనట్టు భావిస్తారు.

వీటన్నిటి ప్రభావం వారి జీవితంలో మిగతా అంశాలపై పడుతుంది. అందుకే, వారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఎల్లపుడూ సబ్మిస్సివ్ యాటిట్యూడ్ నే వ్యక్తపరుస్తారు. దాంతో, సాధారణ పనులు కూడా వారికి అసాధారణంగా కనిపిస్తుంటాయి. జీవితాన్ని భారంగా భావిస్తారు.

English summary

5 Signs that a Woman is Being Abused

Abused women react a certain way to stimuli in everyday life. It can be a way to identify when a person is mistreated when they, for unknown reasons, feel unable to ask for help or see what is happening to them. Have you ever suspected a woman was being abused when you noticed one of these signs?.
Desktop Bottom Promotion