అందం ఒక్క‌టే కాదు.. ఈ 6 గుణాల‌ను అమ్మాయిల్లో కోరుకుంటున్నారట‌!

By: sujeeth kumar
Subscribe to Boldsky

అబ్బాయిలు తమ పర్సనాలిటీ మాత్రమే చూస్తారని అమ్మాయిలు ఫీలవుతారు. కానీ మగవాళ్లు స్త్రీలలో ఇంకా చాలా గమనిస్తారు. అమ్మాయిల్లో ఎట్రాక్టివ్ బాడీ పేష్ లనే కాకుండా.. మరికొన్ని విషయాలను చాలా ఆసక్తిగా గమనిస్తారు. వారు స్త్రీలలో ఉండే కొన్ని గుణాలని కూడా అభిమానిస్తారు. మనుష్యులంటే అనేక గుణాలు, అలవాట్ల కలయికే ముఖ్యమని భావిస్తారు. అందుకే ఏదో ఒక భాగమో, గుణమో చూసి ఇష్టపడటం సరైన పద్ధతి కాదు.

ఏంవుంది చూడ్డానికి .. బాగుండాలి అని అనుకుంటాం. ఆడవారిని ఇష్టపడడానికి వాళ్లు అందంగా ఉండటమే కార‌ణం అనుకుంటాం, కానీ అది నిజం కాదట.

కేవలం అందంగా ఉండటమే కాదు.. అబ్బాయిలు అమ్మాయిల్లో ఇష్టపడే గుణాలు వేరే ఉన్నాయిట‌.

అవేంటో ఓ సారి చూద్దాం..

1. స్వతంత్రంగా ఉండటం

1. స్వతంత్రంగా ఉండటం

నిజమైన వ్యక్తి ఎవరూ మిమ్మల్ని బానిసలుగా చూడరు. కానీ అతనిపై మీరు పూర్తిగా ఆధారపడకూడదు.

మీరు రిలేషన్ షిప్ లో ఉన్నా మీ అవసరాలకు అతనిపై ఆధారపడొద్దు. మిమ్మల్ని మీరే నిలబెట్టుకోండి. మీకంటూ గుర్తింపు తెచ్చుకోండి. మీరు ఒక బంధంలో ఉన్నారు అంటే దాని అర్థం మీ అవసరాలను అతనిపై రుద్దడం కాదు.

2. నిజాయితీ

2. నిజాయితీ

ఏ బంధానికైనా నమ్మకమే పునాది. ఒక చిన్న అబద్ధమే కదా ఏం అవుతుంది లే, అది అంత ప్రమాదం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ.. అది మీ మధ్య ఉన్న నమ్మకాన్ని ఏదో ఒక రోజు దెబ్బ తీస్తుంది. మీ బంధంలో ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే .. అది మీ మధ్య ఒక అడ్డుగోడ అవుతుండొచ్చు. ఇద్దరు అన్ని విషయాలు ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడుకోవడమే మంచిది. ఎందుకంటే ఏ విషయమైనా మీరు.. అతని దగ్గర దాచిపెడితే అది అతనికి తెలిసిన రోజు మీ బంధం సన్నగిల్లే అవకాశం ఉంది.

3. తోడుగా ఉండండి

3. తోడుగా ఉండండి

మగవాళ్లు స్ట్రాంగ్ గా ఉంటారు అని సమాజం ఆశిస్తుంది. కానీ వాళ్లకు కూడా తనకంటూ తన అవసరాలను చూసే ఒక తోడు కావాలి అనే సమయం వస్తోంది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఒక సపోర్టు కావాలని కోరుకుంటాడు. అది ఎంతలా అంటే... అతనికి తన అమ్మని గుర్తుకు చేసేంతగా.

4. తెలివిగా ఉండండి

4. తెలివిగా ఉండండి

అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడేవారిని ఇష్టపడతాడు. ఏదైనా సరే.. ఎవరితోనైనా పంచుకోవాలి అనుకుంటాడు. వారిని అర్థం చేసుకొనే సామర్థ్యం, పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించే తెలివైనవారిని కోరుకుంటారు. అంటే కొన్ని సందర్భాలలో విషయం ఇది అని చెప్పకపోయినా.. పరిస్థితులకు తగ్గట్టు మసులుకోవాలి అనుకుంటారు. అతని కుటుంబ సభ్యులతో కాని స్నేహితులతో కాని బాగా కలిసిపోవాలి అనుకుంటాడు. ఇలాంటి భావాలు ఉన్నా.. ఆడవారిని మగవాళ్లు గ్రహిస్తారు.

5. హాస్య చతురత

5. హాస్య చతురత

ఎప్పుడూ నవ్వుతూ.. నవ్వించే వారిని ఎవరైనా ఇష్టపడతారు. నవ్వించే వారిని అందరితో త్వరగా కలిసిపోయే అమ్మాయిలను ఇష్టపడుతుంటారు. కానీ ...... ఎప్పుడు నవ్వాలో, ఎలాంటి సందర్భాలలో నవ్వ కూడదో తెలుసుకొని ప్రవర్తించాలి అనుకుంటారు. ఇది వారి బంధాన్ని మరింత బలపరుస్తుంది.

6. ఏదైనా చేసేందుకు సై...

6. ఏదైనా చేసేందుకు సై...

మగవాళ్లు ఎప్పుడైనా సాహాసాలు చేయాలి అని అనుకుంటే దానికి మీ నుంచి ఒక ప్రోత్సాహాన్ని ఆశిస్తారు. ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు వద్దు.. చేయొద్దు అనడం కన్నా.. నువ్వు చేయగలవు అని చెప్పాలి. వారు అనుకున్నది చేయడానికి అవకాశం వారికే వదిలేయాలి.

చివరగా

చివరగా

అమ్మాయిలు.. చూడ్డానికి సూపర్ మోడల్ గా ఉండక్కర్లేదు. పైకి కనిపించే మేకప్ ను మగవాళ్లు చూడ‌రు. ఒక మంచి చిరునవ్వు, వారు వేసుకొనే బట్టలు, అందమైన జుట్టు వీట‌న్నింటికంటే ఇంకా ఏదో ఎక్కువ‌గా మ‌గ‌వాళ్లు ఆశిస్తారు.

English summary

6 Things Men Like Women More Than Good Looks!is this correct Men!

Have you ever sat across the table from a man and wondered what draws him to you? You know you look good and you think that is the only reason he likes you. The fact is it goes deeper than just looks. Here are things men are after in women.
Subscribe Newsletter