మోసం చేయడం అనేది అలవాటుగా ఎలా మారిపోతుందంటే

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సంబంధ బాంధవ్యాల నిపుణులు ఏమని చెబుతున్నారంటే, మోసం చేద్దాం అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు అలా చేయొచ్చా లేదా అని ఆలోచించండి లేదంటే క్రమంగా అది అలవాటుగా మారిపోతుంది. అందుకే కాబోలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నానుడి ఏమిటంటే " ఒక మోసగాడు ఎప్పటికే ఒక మోసగాడుగానే మిగిలిపోతాడు ."

మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నారని తెలిపే లక్షణాలు

ఈ మధ్యనే ఒక అధ్యయనంలో భాగంగా పరిశోధకులు, కొంతమంది ప్రజలను తీసుకొని వచ్చి కుర్చోని బెట్టుకొని, వ్యక్తిగతంగా ఎన్నో ప్రశ్నలు అడిగి వారి యొక్క గత సంబంధ బాంధవ్యాల నమూనాను అధ్యయనం చేద్దాం అనుకున్నారు. ముఖ్యంగా ఏ వ్యక్తులైతే వారి యొక్క గత భాగస్వాములను మోసం చేసారని చెప్పారో అలాంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసారు.

ఈ అధ్యయనంలో చివరికి ఎటువంటి ఫలితం వచ్చిందా అని మీరు ఆశ్చర్యపోతున్నారా ? దానికి సంబంధించిన నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే :

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే :

ఏ వ్యక్తి అయితే ఒక సారి తన సంబంధ బాంధవ్యాల విషయాల్లో తన భాగస్వామిని మోసం చేస్తాడో, అటువంటి స్వభావం ఉన్న వ్యక్తి ఏ ఇతర సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా 300% అధికంగా మోసం చేసే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

మరి బాధితుల సంగతి ఏంటి :

మరి బాధితుల సంగతి ఏంటి :

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఏ వ్యక్తులైతే మోసగించబడ్డారో వాళ్ళు తదుపరి ఏర్పడబోయే సంబంధ బాంధవ్యాల్లో కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాళ్ళ యొక్క గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా గనుక వ్యవహరించకపోతే మోసం చేసే వ్యక్తుల దగ్గర మళ్ళీ మోసపోయి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.

భార్య మోసం చేసిందని ఆమె మర్మాంగాలలో భర్త ఏమి పెట్టాడో తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది!

మరి అనుమానించే వాళ్ళ సంగతి ఎలా ఉంది :

మరి అనుమానించే వాళ్ళ సంగతి ఎలా ఉంది :

ఇక్కడ ఇంకొక నిజం ఏమిటంటే ఎవరైతే తమ యొక్క గత సంబంధ బాంధవ్యాల విషయంలో భాగస్వాములను అనుమానించారో ( మోసం చేశారని ) అటువంటి వారు, తమ భవిష్యత్తులో ఎంచుకోబోయే భాగస్వామి సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు.

ఈ అధ్యయనం ద్వారా వెల్లడైన ఫలితం ఏంటి :

ఈ అధ్యయనం ద్వారా వెల్లడైన ఫలితం ఏంటి :

చివరిగా ఈ అధ్యయనం చెబుతున్న నమ్మలేని నిజం ఏమిటంటే, మోసం చేయడం అనే స్వభావం మానసికంగా ఎంతో కృంగదీస్తుంది. దాని యొక్క ప్రభావం భాగస్వాములిద్దరి పై పడి, ఊహకు అందని విధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని గనుక నియంత్రించకపొతే ఇది ఒక అలవాటుగా మారి జీవన శైలిలో ఒక భాగమైపోతుంది.

మెదడు రసాయన శాస్త్రం పాత్ర ఎంత :

మెదడు రసాయన శాస్త్రం పాత్ర ఎంత :

ఒక సారి ఒక వ్యక్తి మోసం చేయడం ప్రారంభించిన తర్వాత, మళ్ళీ మోసపూరితంగానే పదే పదే వ్యవహరించాలి అనుకోవడానికి కారణం మెదడు రసాయన శాస్త్రం లో జరిగే మార్పులే అని చెబుతున్నారు. మోసం చేసినప్పుడు మెదడు ఒక సాహసోపేతమైన తృప్తికి లోనవుతుంది. దీంతో అదే భావన మెదడుకు కావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపించి మోసం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది.

English summary

Cheating In A Relationship

Cheating in a relationship could become a habit! Relationship experts say think twice before you cheat as it may turn into a habit gradually.
Subscribe Newsletter