బ్రేకప్ తర్వాత చెప్పే మాటలివే !

By Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో బ్రేకప్ సాధారణం అయిపోయింది. అయితే ఆ పరిస్థితిని అధిగమించడం మాత్రం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. అలాగే మీకు ఆ సమయంలో కొందరు కొన్ని సలహాలు ఇస్తుంటారు. కానీ అందులో ఎంతమాత్రం వాస్తవం ఉందో కూడా మీరు తెలుసుకోవాలి. అయితే స్నేహితులు, కుటుంబసభ్యులు మాత్రం మీ కష్ట సమయంలో మీ వెన్నంటే ఉంటారు. వారి సహకారం ఆ సమయంలో మీకు ఉంటుంది. బ్రేకప్ సమయంలో మీ చుట్టు ఉండేవారు మీకు చెప్పే మాటలేమిటో ఒకసారి చూద్దామా.

జరిగిందంతా నీ మంచికే

జరిగిందంతా నీ మంచికే

బ్రేకప్ అయిన వెంటనే మీ సన్నిహితులు చెప్పే మొదటి మాట.. జరిగిందేదో జరిగిపోయింది... అదంతా నీ మంచికే జరిగింది.. అంటూ సానుభూతి తెలుపుతారు. అయితే ప్రేమలో విఫలమైన వ్యక్తి మాత్రం చాలా బాధపడిపోతుంటారు.

ఎంతో కాలంగా ఒక వ్యక్తిని నమ్మి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే చివరికి ఇలా హ్యాండ్ ఇచ్చిపోవడాన్ని ఎవరూ కూడా సహించరు కదా. బ్రేకప్ తో వారి గుండె బద్ధలయ్యిటుంది. మనసు అచెంచలంగా మారిపోయి ఉంటుంది.

ఏం బాధపడకు

ఏం బాధపడకు

ఈ సంఘటన వల్ల నీకు వాస్తవం ఏమిటో తెలిసొచ్చింది. నీవు ఏం బాధపడకు అని మీ చుట్టుపక్కల ఉండేవారు చెబుతారు. అసలు నీవు ఏం పొందగలిగావు.. ఏం పొగొట్టుకున్నావనే విషయాలు వారికి తెలిసి ఉంటే మీకు కాస్త భరోసానిచ్చే మాటలే వారు చెబుతారు. మీ మాజీ ప్రియురాలు లేదా ప్రియుడి కంటే మంచి వారే మీకు మళ్లీ జీవితంలో తారసపడతారని సూచిస్తారు.

లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

కాలమే నిర్ణయించింది

కాలమే నిర్ణయించింది

ఏది జరిగినా ప్రజలు ఈ మాట అంటూ ఉంటారు. కానీ కాలం ఏమి నిర్ణయించదు. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. జరిగిన తప్పు గురించి తెలుసుకుని మళ్లీ అలాంటిది జరగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకానీ కాలం మీద తోసివేయడం మంచిది కాదు.

ఒంటిరిగా ఉంటే చాలా బాగుంటుంది

ఒంటిరిగా ఉంటే చాలా బాగుంటుంది

అయ్యిందేదో అయ్యింది ఇక నుంచి ఒంటరిగా ఉంటావు కదా హ్యాపీగా ఉండొచ్చని కొందరు సలహాలిస్తుంటారు. అవును బ్రేక్ ప్ తర్వాత ఇక ఒంటిరిగా హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి బాధ్యతలుండవు, ఎంతో సరదాగా గడపొచ్చేమో. కానీ కోల్పొయిన బంధాన్ని మాత్రం తిరిగి పొందలేము కదా.

చాలా మంది దొరుకుతారు.. బాధపడకు

చాలా మంది దొరుకుతారు.. బాధపడకు

ఈ మాట కూడా చాలామంది చెబుతుంటారు. అయితే సముద్రంలో చాలా చేపలుంటాయి. మనకు మొదట ఒక చేప దొరికి ఉంటుంది. తర్వాత సేమ్ టు సేమ్ అలాంటి చేపే దొరకాలంటే కుదరదు కదా. ఏ ఎండ్రకాయనో.. లేదా ఏ రొయ్యనో దొరుకుతుంది. ఇదీ అంతే. బ్రేకప్ తర్వాత చాలామంది పై మాట చెబుతుంటారు. కానీ వాస్తవం మీరే ఆలోచించుకోండి.

అందరూ ఒకేలా ఉంటారు

అందరూ ఒకేలా ఉంటారు

బ్రేకప్ తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే లక్షణాలతో బాధపడుతుంటారు. మొదట వారిలో వారు బాధపడతారు. తర్వాత వారి ఫ్యెయిలూర్ స్టోరీ గురించి సన్నిహితులకు వివరిస్తారు.

వివాహజీవితం బ్రేక్ అప్ అయితే?ఈ తప్పులు చేయొచ్చా?

కొన్నాళ్ల తర్వాత గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది

కొన్నాళ్ల తర్వాత గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది

జీవితం ఎవ్వరి కోసం ఆగదు. కాలం వెంట అది పరిగెడుతూనే ఉంటుంది. ప్రేమలో విఫలమైన వారు మళ్లీ ప్రేమలో పడొచ్చు. అయితే బ్రేకప్ అయినప్పుడు మీ సన్నిహితులు చెప్పిన మాటలన్నీ మీకు గుర్తొస్తే మాత్రం మీకు నవ్వొస్తుంది.

ఎప్పుడోసారి చింతించొచ్చు

ఎప్పుడోసారి చింతించొచ్చు

బ్రేక్ అప్ గురించి విడిపోయిన వారు జీవితంలో ఎప్పుడో ఒకసారి బాధపడే అవకాశం ఉంటుంది. కాకపోతే దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. బ్రేకప్ సమయంలో కొందరు ఇచ్చే చెత్త చెత్త సలహాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే జీవితం ఆనందమయంగా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  Things People Tell You After A Break Up | Breakup Cliché Advice | Worst Breakup Clichés

  Breakup's are hard and it takes time to get back on track. We bring you some of the common things people tell you after a breakup.
  Story first published: Tuesday, November 7, 2017, 12:15 [IST]
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more