అబ‌ద్ధాలు మాట్లాడేవారిని సులువుగా ఇలా క‌నిపెట్టేయండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న‌మంద‌ర‌మూ ఏదో ఒక సంద‌ర్భంలో అబద్ధం ఆడే ఉంటాం. కాదా చెప్పండి? కొన్ని క్లిష్ట‌మైన ప‌రిస్థితుల నుంచి త‌ప్పించుకునేందుకు చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటాం. అది స‌హ‌జ‌మే. ఈ ప్ర‌పంచంలో దాదాపు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక్క సంద‌ర్భంలోనైనా అబ‌ద్ధం ఆడి ఉంటారు.

ఎవ‌రైనా మీకు హాని చేయాల‌నే తలంపుతోనే అబద్ధం చెబుతుంటే మాత్రం ఉపేక్షించ‌వ‌ద్దు. భ‌విష్య‌త్‌లో మీ మెడ‌కు చుట్టుకోకుండా చూసుకోవ‌డం నేర్చుకోవాలి. కానీ, అలా క‌నిపెట్ట‌డం ఎలా? దాని గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌కండి. మేము మీకు ఆ విష‌యాలు చెబుతాం.

మీ భార్య అబద్దం చెబుతోందనడానికి ఇవే సంకేతాలు!?

ఇత‌రులు అబ‌ద్ధం చెపుతున్నార‌ని ఎలా క‌నిపెట్టొచ్చు?

అబ‌ద్ధం ఆడేవారిని సులువుగా క‌నిపెట్టేందుకు చాలా సంకేతాలుంటాయి. ఇక్క‌డ పేర్కొన్న వాటిలో ఒక‌టో రెండో సంకేతాలను బ‌ట్టి నిర్ణ‌యానికి రావొద్దు. అయితే మూడు,నాలుగు అంత‌క‌న్నా ఎక్కువ సంకేతాలు ఇస్తూ ఉంటే క‌చ్చితంగా వారు అబ‌ద్ధం చెపుతున్న‌ట్టే.

1. ఆగి ఆగి చెబుతున్నారా?

1. ఆగి ఆగి చెబుతున్నారా?

స‌హ‌జంగా పాత జ్హాప‌కాల‌ను నెమ‌రువేసుకునేట‌ప్పుడు ఆగి ఆగి చెప్ప‌డం స‌హ‌జ‌మే. ఇదే సంకేతం అబ‌ద్దాలు ఆడేవారి ద‌గ్గ‌ర క‌నిపెట్టొచ్చు. వాళ్ల మ‌దిలో ఒక‌దాని త‌ర్వాత ఒక అబ‌ద్ధం క్రియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడ‌ప్పుడే అబ‌ద్ధం చెప్పేవారిని ట‌క్కున క‌నిపెట్టేయ‌వ‌చ్చు, కానీ ఇందులో ఆరితేరిన వారిని క‌నిపెట్ట‌డం క‌ష్ట‌మే.

2. మ‌రీ వివ‌రంగా చెబితే శంకించాల్సిందే!

2. మ‌రీ వివ‌రంగా చెబితే శంకించాల్సిందే!

తీపి జ్నాప‌కాల‌ను నెమ‌రు వేసి చెబుతుండ‌టం కామ‌నే. గ్రాడ్యుయేష‌న్ డే రోజు మీ ప‌రిస్థితి, మీరు ప‌డిన హ‌డావిడి, మీరు అంద‌రినీ న‌వ్వుతూ ప‌ల‌క‌రించిన వ‌న్నీ చెప్ప‌డం స‌హ‌జ‌మే. అయితే మీ స్నేహితుడి త‌ల్లి ఏ క‌ల‌ర్ చీర క‌ట్టుకుందో కూడా నిక్క‌చ్చిగా చెబుతుంటే మాత్రం సందేహించాల్సిందే. ఎందుకంటే ఒక సామాన్య మాన‌వుడికి ప్ర‌తి చిన్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవ‌డం చాలా క‌ష్టం. అదీ ఎన్నో ఏళ్ల క్రితంది అయితే మ‌రీ క‌ష్టం.

ఇలా ఎక్కువ వివ‌రాలు చెబుతుండే వారిని శంకించాల్సిందే. వాళ్లు ఎక్కువ వివ‌రాలు చెప్పి క‌ట్టుక‌థ‌లు అల్లాల‌ని చూస్తుంటారు. అలాంటి వారిని అస్స‌లు న‌మ్మ‌కండి.

3. గొంతును గ‌మ‌నించండి

3. గొంతును గ‌మ‌నించండి

చాలా మందికి అబ‌ద్ధం చెప్పేట‌ప్పుడు గొంతు త‌డారిపోతుంటుంది. దాన్ని త‌డి చేసుకునేందుకు ద‌వ‌డ‌ల‌ను కిందికి మీద‌కి అంటూ ఉంటారు. మీరు గ‌నుక నిశితంగా ప‌రిశీలిస్తే మాత్రం వారు దొరికిపోవ‌డం ఖాయం. వాళ్ల శ‌రీర‌మంతా కాస్త అచేత‌నంగా మారిపోతుంటుంది. మీరు గ‌నుక జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే అది క‌నిపెట్ట‌డం సుల‌భం.

4. నిటారుగా ఉన్నా...

4. నిటారుగా ఉన్నా...

కొంద‌రు అబ‌ద్ధం చెప్పేట‌ప్పుడ స్ట‌డీగా, నిటారుగా ఉంటారు. అలా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తారంటే బావుంటుందేమో. వాళ్ల బాడీ లాంగ్వేజ్ వ‌ల్ల అబ‌ద్ధాన్ని బ‌య‌ట‌ప‌డ‌నీయ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉంటారు. అయితే నిజం చెప్పేవాడు ఎప్పుడూ ఇలా నిటారుగా ఉండ‌డు. రిలాక్స్ మూడ్‌లో ఉంటాడు. అదే మీరు క‌నిపెట్టాల్సింది.

5. స‌రైన భావ‌న‌లు చూప‌లేక‌పోతే..

5. స‌రైన భావ‌న‌లు చూప‌లేక‌పోతే..

ఎవ‌రైనా ఏదైనా క‌థ చెబుతుంటే అందుకు త‌గ్గ‌ట్టు కాళ్లు, చేతులు ఊప‌డం, మొహంలో మార్పులు చూపించ‌డం గ‌మ‌నిస్తుంటాం. అదే అబ‌ద్ధాలు అల్లే వాళ్లు .. చెప్పే మాట‌లు ఒక‌టుంటాయి, చూపించే చేష్టలు మ‌రోలా ఉంటాయి. ఇలాంటి వాళ్ల బాడీ లాంగ్వేజ్‌తో సుల‌భంగా క‌నిపెట్టేయ‌వ‌చ్చు.

6. త‌ప్పించుకోవాల‌ని చూస్తే...

6. త‌ప్పించుకోవాల‌ని చూస్తే...

సాధార‌ణంగా మిల‌ట‌రీ వాళ్లు ఇలా చేస్తుంటారు. గ‌దిలో ప్ర‌వేశించ‌గానే వారి క‌ళ్ల‌న్నీ బ‌య‌ట‌కే చూస్తుంటాయి. శిక్ష‌ణ నుంచి త‌ప్పించుకుందామ‌నుకునేవా ళ్లు ఇలా క‌ళ్ల‌ను త‌లుపుకేసి చూస్తుంటారు. అంద‌రు సైనికులు అలా కాదు. కొంద‌రు మాత్ర‌మే. అయితే సాధార‌ణ వ్య‌క్తి ఇలా క‌ళ్ల‌ను త‌లుపు కేసి చూస్తుంటే మాత్రం తానేదో త‌ప్పుగా మాట్లాడుతున్నాడ‌ని అర్థం. అక్క‌డి నుంచి ఎంత తొంద‌ర‌గా వీలైతే అంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌దామ‌ని చూస్తున్న‌ట్టు అర్థం.

మీ గర్ల్ ఫ్రెండ్ మీతో అబద్దం చెప్తోందని కనిపెట్టడం ఎలా

7. భాష‌లో తేడా..

7. భాష‌లో తేడా..

మ‌నం త‌ర‌చూ సంభాషించేవాళ్లు అబ‌ద్ధం ఆడితే భాష‌లో తేడా చూపిస్తే సులువుగా క‌నిపెట్టేయ‌గ‌లం. జ‌నాలు అబ‌ద్ధం ఆడేట‌ప్పుడు వారి భాష‌లో లేదా వాడే ప‌దాల్లో స్వ‌ల్పంగా తేడా వ‌స్తుంది. ఒక ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే శేఖ‌ర్ బ్యాగ్‌ను పోగాట్టాను అని చెప్పే బ‌దులు శేఖ‌ర్ బ్యాగును ఎక్క‌డో వ‌దిలేసిన‌ట్టున్నాను. గుర్తురావ‌డం లేదు. రాగానే చెబుతాను అంటారు. అలాంటివారు చెప్పే మాట‌ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి.

8. త‌ల వెన‌క్కి అనుకుంటుంటే...

8. త‌ల వెన‌క్కి అనుకుంటుంటే...

అబ‌ద్ధం చెప్పేవారిని ఈ సంకేతంతో క‌నిపెట్టొచ్చు. త‌ల కాస్త వెన‌క్కి చేసి మ‌రీ మాట్లాడుతారు. అలాంటి వారు వీలైనంత ఎక్కువ దూరం ఉండ‌డాన‌కి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఎందుకంటే లోలోప‌ల వారికి భ‌యం ఉంటుంది. అది మీరు ఎక్క‌డ క‌నిపెడ‌తారోన‌ని ఒక‌టే టెన్ష‌న్‌. ఆ టెన్ష‌న్‌లో అచేత‌నంగానే త‌ల కాస్త వెన‌క్కి వెళుతుంది. కొన్న‌సార్లు మొత్తం శ‌రీర‌మే వెన‌క్కి వెళుతుంది.

9. మెడ స‌వ‌రించుకుంటుంటే...

9. మెడ స‌వ‌రించుకుంటుంటే...

మెడ‌లో స‌రిగ్గా మ‌ధ్య భాగంలో ఒక ఎముక లాంటిది ఉంటుంది. అది చాలా సున్నిత‌మైన భాగం. పీక అంటారు సాధార‌ణంగా. అబ‌ద్ధం చెప్పే వ్య‌క్తి దాన్ని మాటిమాటికీ స‌వ‌రించుకుంటూ ఉంటాడు. దానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని చూస్తుంటాడు. మ‌గ‌వాళ్ల‌యితే కాల‌ర్ స‌వ‌రించుకోవ‌డ‌మో, టై స‌రిచేసుకోవ‌డ‌మో చేస్తుంటారు. అదే ఆడ‌వాళ్ల‌యితే త‌మ ఆభ‌ర‌ణాలు స‌వ‌రించుకోవ‌డం చేస్తుంటారు.

10. స్వ‌రంలో తేడా...

10. స్వ‌రంలో తేడా...

అబ‌ద్ధం చెప్పేట‌ప్పుడు ఆ వ్య‌క్తి స్వ‌రంలో తారా స్థాయికి చేరుకుంటుంది కొన్ని సార్లు. అయితే ఇలాంటిది క‌నిపెట్ట‌డం ఎలా.. మీ సంభాష‌ణ తెలివిగా సాగాలి. మొద‌ట సాధార‌ణ విష‌యాల‌ను చ‌ర్చ‌కు తీసుకురావాలి. ఆ త‌ర్వాత మీరు దేన్ని కోరుకుంటున్నారో ఆ విష‌యాన్ని తీసుకురావాలి. వారి స్వ‌రం ఎలా ఉండాలో గ‌మ‌నిస్తుండాలి. తారాస్థాయికి చేరుకుని కాస్త గ‌ట్టిగా మాట్లాడితే మాత్రం వారు అబ‌ద్ధం చెబుతున్న‌ట్టే. మీరు లేవ‌నెత్తిన అంశంపై వాళ్ల స్పంద‌న‌ను గ‌మ‌నిస్తుండాలి. అప్పుడు మీరు క‌నిపెట్టేయ‌వ‌చ్చు అబ‌ద్ధ‌మాడే దొంగ‌ని.

English summary

How to Tell If Someone Is Lying

There are many signs that can help you spot a liar. Some are obvious while some are very subtle. And of course, it goes without saying that 1-2 signs from the list below should not be used to single someone out – maybe they do it out of habit or because of their personality/nature. However, if they display 3-4 or more signs listed below, you can be assured they are lying to you.
Story first published: Friday, November 10, 2017, 15:00 [IST]
Subscribe Newsletter