మీ గతం మీ భాగస్వామిలో అసూయని పెంచుతోందా?

By: Deepti
Subscribe to Boldsky

ఒకవేళ మీ భాగస్వామి మీ గతం పట్ల అసూయతో రగిలిపోతుంటే, దాన్ని రెట్రోయాక్టివ్ జెలసీ అంటారు. అర్థం కాలేదా? ఇది ఊహించండి.

మీ భాగస్వామి మీ జీవితంలోకి వచ్చేముందు, మీరు ఒక అందమైన అమ్మాయితో డేట్ చేసారనుకోండి. ఆమె మీ మాజీ ప్రియురాళ్ళ ఫోటోలు చూసినప్పుడు, అసూయ పడవచ్చు. దాన్నే రెట్రోయాక్టివ్ జెలసీ అంటారు.

ఇలా అబ్బాయిలకు కూడా జరుగుతుంది. మరైతే జంటలు ఏం చేయాలి? ముందు ఈ వాస్తవాలను చదవండి.

నిజమైన కారణం

నిజమైన కారణం

మొదటగా, ఇలాంటి ఈర్ష్య కేవలం అభద్రతాభావం వల్లనే బయటకి వస్తుంది.

మీ భాగస్వామి మీ కంటే అందమైన వ్యక్తితో డేటింగ్ చేసి ఉంటే, ఆ మాజీ వ్యక్తి తిరిగి మీ భాగస్వామి జీవితంలోకి వస్తారేమో అని భయపడటం సహజం.

అతనికి ఇంత అందగత్తా..?సోషియల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న ఒక సింపుల్ లవ్ స్టోరి..!!

ఈ భయాన్ని నియంత్రించండి

ఈ భయాన్ని నియంత్రించండి

ఎందుకు నియంత్రించాలి? మీరు లోలోపల రగిలిపోతుంటే, మీ ప్రస్తుత బంధానికి తగినంత ప్రేమను అందించలేరు. అందుకే ముందు భయాన్ని పట్టించుకోవడం మంచిది. మీ భాగస్వామిలో ఈ అసూయ తొంగిచూస్తే, అతను లేదా ఆమె భయాలను తగ్గించాల్సిన బాధ్యత మీదే.

ఏం చేయాలి?

ఏం చేయాలి?

మీ భాగస్వామి భయాలను ఎలా తొలగించాలి? ఏదీ దాచిపెట్టకండి. మీ జీవితం గురించి తెరచిన పుస్తకంలా ఉండండి. మీరు ఏవైనా రహస్యాలు దాచిపెట్టినపుడు, ఈ అసూయ మరింత పెరుగుతుంది. ఒకవేళ మీరే ఈ అసూయతో బాధపడుతుంటే, మీ భాగస్వామిని నేరుగా ఈ అభద్రతాభావం తొలగించటంలో సాయపడమని అడగండి.

ఆన్ లైన్ ప్రవర్తన

ఆన్ లైన్ ప్రవర్తన

మీరు సోషల్ మీడియాలో ప్రవర్తించే తీరు సాదాగా ఉంచుకుని, మీ భాగస్వామి భయాలు పోగొట్టండి. మీ మాజీ ప్రియులను సోషల్ మీడియాలో అదేపనిగా చూడటం, లైక్, కామెంట్ చేయటం మీ భాగస్వామి భయాలను పెంచుతాయి. ఒకవేళ మీరు అసూయపడుతుంటే, వెంటనే మీ భాగస్వామితో వారి ఆన్ లైన్ ప్రవర్తన గురించి మాట్లాడండి.

బాయ్ ఫ్రెండ్ అసూయ నివారించడమెలా?

గతాన్ని సమాధి చేయండి

గతాన్ని సమాధి చేయండి

మీ మాజీ ప్రియులతో సంబంధాలు తెంచుకోండి. ఇది మీ ప్రస్తుత బంధాలకు మంచిది. మీరే అభద్రతాభావానికి గురవుతుంటే, మీ భాగస్వామిని తన గతం సమాధి చేయగలరేమో అడగండి.

ఏవైనా చర్యలు చేపట్టండి

ఏవైనా చర్యలు చేపట్టండి

మీ భాగస్వామిని ఆనందంగా ఉంచి, అతను లేదా ఆమెకి ఈ బంధం ఎంత ప్రత్యేకమో తెలియచేయండి. మీ భాగస్వామి మీరు అసూయపడేలా చేస్తుంటే, మీ భావాలను నేరుగా చెప్పి మీ అభద్రతాభావాలను తొలగించటం ఎలా అని చర్చించండి.

ఈ తిరోగమన అసూయతో పోరాడండి

ఈ తిరోగమన అసూయతో పోరాడండి

ఇన్నిచేసినా మీ భాగస్వామి భయం, అభద్రతాభావంలోంచి బయటపడలేకపోతున్నారా? అలాంటప్పుడు ఇక మీ భాగస్వామి భయాలు నిర్హేతుకం. వారికి కౌన్సెలింగ్ అవసరం.

మీ భాగస్వామి మీ భయాలను పట్టించుకోపోతే అప్పటి పరిస్థితి ఏంటి? అంటే మీ భాగస్వామికి కూడా కౌన్సెలింగ్ అవసరం. అతను లేదా ఆమెకి మీతో ప్రస్తుత బంధం విలువైనది ఐతే మీ అభద్రతాభావం తొలగించటం కూడా అత్యవసరం.

English summary

Is Your Past Making Your Partner Jealous?

Is your past making your partner jealous? If your partner feels jealous of your past then it is known as retroactive jealousy. Well, here are some steps to
Subscribe Newsletter