రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్ట‌యితే.. ఈ 7 ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తితో జాగ్ర‌త్త‌!

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

యూ గ‌వ్ అనే ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చ్‌, డేటా అన‌లిటిక్స్ చేసిన ప‌రిశోధ‌నల ఆధారంగా ప్ర‌తి అయిదు మందిలో ఒక‌రు త‌మ భాగ‌స్వామిని మోసం చేస్తారు లేదా మోస‌పోతార‌ని తేలింది.

ఒక్క‌సారి మోసం చేసేవాళ్లు కొంద‌రైతే మ‌రికొంత మందిని అస్స‌లు న‌మ్మ‌లేం. వాళ్లు చేసే మోసం ఎలాంటిదైనా, ఎంత పెద్ద‌దైనా అనుబంధంలో అది ఒక మాయ‌ని మ‌చ్చ‌లా నిలిచిపోతుంది.

మోసం చేయడం అనేది అలవాటుగా ఎలా మారిపోతుందంటే

ఇంకా ప‌రిశోధ‌న‌లో ఏం తేలిందంటే... కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తులు మోసం చేసేందుకు ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ట‌. ఈ విష‌యాల గురించి మ‌రింత వివ‌రంగా తెలుసుకుందాం.

1.ఒక సారి మోసం చేసిన‌ట్టు ముద్ర‌ప‌డితే..

1.ఒక సారి మోసం చేసిన‌ట్టు ముద్ర‌ప‌డితే..

ఒక‌సారి మోసం చేసిన‌వాడు మ‌రోసారి చేయ‌డు అన్న హామీ ఏంటి? మొద‌టి సారి మోసం చేసిన‌ప్పుడు దాన్ని ఏదో విధంగా స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. మ‌ళ్లీ మోసం చేయ‌డం సుల‌భం అయిపోతుంది.

2. 30ల‌లో ఉన్న‌వారు

2. 30ల‌లో ఉన్న‌వారు

వ్య‌క్తి వ‌య‌సు కూడా మోసం చేయ‌డానికి గ‌ల కార‌ణాల్లో ఒక‌టి. ఓ ఆన్‌లైన్ డైటింగ్ సైట్ ప్ర‌కారం మోసాలు ఎక్కువ‌గా చేసే మ‌హిళ‌ల స‌రాస‌రి వ‌య‌సు 36.6 ఏళ్లుగా తేలింది. ఇంకా ఈ డేటింగ్ సైట్‌లో తేలిందేమిటంటే 30ల‌లో ఉన్న‌వారు ఎక్కువ‌గా మోసం చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌.

3. అశ్లీల చిత్రాలు చూసేవాళ్లు..

3. అశ్లీల చిత్రాలు చూసేవాళ్లు..

ఒక సామాజిక సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఎవ‌రైతే ఎక్కువ‌గా అశ్లీల చిత్రాలు చూస్తారో వాళ్లు ఎక్కువ‌గా మోసం చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌.

4. అనుమానం వ‌స్తే..

4. అనుమానం వ‌స్తే..

మోసం చేస్తార‌నే అనుమానం వ‌స్తే చాలు.. త‌మ భాగ‌స్వామిని మోసం చేసేవాళ్లూ ఉంటార‌ట‌. ఇది వారిలో స‌హ‌జంగా ఉండే భ‌యం వ‌ల్ల అలా చేస్తార‌ని ఒక స‌ర్వేలో తేలింది.

5. జ‌న్యుప‌రంగా..

5. జ‌న్యుప‌రంగా..

మోసం చేయ‌డానికి గ‌ల కార‌ణాల్లో జ‌న్యుప‌రమైన‌వి ఉంటాయ‌ట‌. అనేక ప‌రిశోధ‌న‌లు ఈ సంగ‌తిని వెల్ల‌డించాయి. మోసం చేసేవాళ్ల‌ల్లో ఆక్సిటోసిన్‌, వాసోప్రెసిన్ లాంటి హార్మోన్ల స్పంద‌న త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎక్కువ‌గా శృంగారం త‌ర్వాత జ్వ‌లిస్తాయి. ఇలా మోసం చేసే ఉద్దేశంతో ఉన్న‌వాళ్లు మ‌న‌స్ఫూర్తిగా శృంగారం చేయ‌ర‌ట‌.

6. అధికారంలో ఉన్న‌వారు

6. అధికారంలో ఉన్న‌వారు

ఓ ప‌రిశోధ‌న‌లో భాగంగా అధికారంలో ఉన్న‌వారు ఎక్కువ‌గా ఇత‌రుల‌ను మోసం చేసేందుకు అవ‌కాశ‌ముంద‌ట‌. సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులు అలాచేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అధికార బ‌లంతో విశ్వాసం బాగా వ‌స్తుంది. దీంతో ఎవ‌రినైనా మోసం చేయ‌వ‌చ్చ‌నే త‌లంపు ఏర్ప‌డుతుంది.

7. పొడ‌వైన ఉంగర‌పు వేలు

7. పొడ‌వైన ఉంగర‌పు వేలు

ఇది విన‌డానికి విచిత్రంగా అనిపిస్తుంది. పొడ‌వైన ఉంగ‌ర‌పు వేలు ఉన్న వ్య‌క్తులు ఎక్కువ‌గా మోసం చేస్తార‌ట‌. ఒక సైన్స్ ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌య‌మేమిటంటే.. త‌ల్లి క‌డుపులో ఉండ‌గా టెస్టోస్టిరాన్ కు ఎక్కువ‌గా ఎక్స్‌పోజ్ అయిన వారికి పొడ‌వాటి ఉంగ‌ర‌పు వేలు ఉంటుంద‌ట‌. అలా టెస్టోస్టిరాన్ స్థాయులు ఎక్కువున్న‌వారు మోసం చేస్తార‌ని ప‌రిశోధ‌న‌లో తేలిన విష‌యం.

English summary

People with these 7 traits are most likely to cheat in a relationship

According to a research conducted by YouGov, an online market research and data analytics firm, one in five people cheat or get cheated by their partners. There are one-time cheaters and there are chronically unfaithful people, but irrespective of what kind of a cheater a person’s partner may be, infidelity leaves a deep scar in one’s relationship.