For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కారణాలు గనుక మీకు నచ్చిన వ్యక్తుల్లో కనపడినట్లైతే వారిని వదిలివేయాల్సిన సమయం ఆసన్నమైనది

By R Vishnu Vardhan Reddy
|

సంబంధ బాంధవ్యాలను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అది ఒక కల లాంటిది. మీ సంబంధ బాంధవ్యాల్లో కొన్నిసార్లు చాలా క్లిష్టమైన సమస్యలు ఎదురుకావొచ్చు. వాటిని త్వరగా మనం మర్చిపోగలమా. అవి ఎలా గుంటాయంటే, రాత్రిపూట ఏదైనా చెడ్డ కల వస్తే పొద్దున్న లేవగానే ఎలా అది మాయమైపోతుందో, అలానే కష్టసమయాలు కూడా త్వరగా సమసిపోతాయి.

<strong>లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి షాకింగ్ రీజన్స్..!</strong>లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

అయితే అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్ని సంబంధ బాంధవ్యాలు చెడ్డ కలలుగానే ఉండవు. చెడ్డ కలలను మరచిపోయి మళ్ళీ తమ జీవితాన్ని సాఫీగా గడిపేయవచ్చు. కొన్ని సంబంధ బాంధవ్యాలు మాత్రం మనిషిని పరీక్షిస్తాయి. అవి మనల్ని అలసిపోయేలా చేస్తాయి మరియు వ్యక్తులను విపరీతంగా హరిస్తాయి. దీని వల్ల ఆయా వ్యక్తులు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు మరియు ప్రేమను ఇక ఎప్పటికీ నమ్మకూడదు అని భావిస్తారు.

ఆరోగ్యవంతమైన సంబంధ బాంధవ్యానికి అర్ధం ఏమిటంటే, ఒకరి పై ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరినొకరు అర్ధం చేసుకొని, అభినందించుకొని మరియు ఎటువంటి సందర్భాల్లో అయినా సంరక్షించుకొనే విధంగా ఉండాలి. అయితే ఈ లక్షణాలు ఏవీ దీర్ఘకాలం లో మీ భాగస్వామిలో గనుక కనపడకపోతే ఇక వారిని వదిలివేయవల్సిన సమయం వచ్చేసింది అని అర్ధం చేసుకోవాలి.

<strong>వివాహజీవితం బ్రేక్ అప్ అయితే?ఈ తప్పులు చేయొచ్చా?</strong>వివాహజీవితం బ్రేక్ అప్ అయితే?ఈ తప్పులు చేయొచ్చా?

ఇంత చెండాలమైన స్థితిలో మీ సంబంధబాంధవ్యాలను అంతం చేయకూడదని మీరు గనుక భావిస్తే, ఆ ఆలోచన గురించి మరొకసారి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకు మీ భాగస్వామిని ఈ సమయంలోనే దూరం పెట్టాలి అనే విషయానికి సంబంధించిన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపకపోవడం :

ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపకపోవడం :

ఇంతక ముందు మీ భాగస్వామితో కలిసి వారాంతాలు గడిపి ఉంటారు. ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్లి ఉంటారు. పబ్బులకు వెళ్లి ఉంటారు లేదా ఎక్కడికైనా తినడానికి వెళ్లి ఉంటారు. అయితే మీతో కంటే కూడా ఇప్పుడు వారు వారి యొక్క స్నేహితులు లేదా సహచరులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. మీతో బయటకు వెళ్లకపోవడానికి ఎప్పుడు కుంటి సాకులను చెబుతూ, ఎదో ఒక కారణాలను ఎత్తి చూపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు గనుక ఉన్నట్లయితే అటువంటి భాగస్వామి తో బంధాన్ని తెంచుకొని దూరం పెట్టడం ఉత్తమం.

ఎడతెగని గొడవలు :

ఎడతెగని గొడవలు :

ప్రతి సంబంధబాంధవ్యాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. భాగస్వాములు ఇద్దరూ కొన్ని సందర్భాల్లో కొట్లాడుకుంటారు మరియు కొన్ని విషయాల్లో వాదులాడుకుంటారు. ఒక మంచి ప్రేమపూరితమైన సంబంధబాంధవ్యంలో అసూయ దగ్గర నుండి సంరక్షణ వరకు, సంరక్షణ నుండి చిన్న చిన్న గొడవల వరకు ఇలా అన్ని దానిలో ఉంటాయి. కానీ, మీరు ఇద్దరూ ప్రతి చిన్న విషయానికి ఎక్కడబడితే అక్కడ కొట్లాడుకుంటుంటే గనుక ఈ పరిస్థితి చాలా అత్యవసర స్థితి అని గుర్తించండి. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఒక అందమైన సెలవుని మీ కొట్లాటలు గనుక నాశనం చేస్తే ఇక మీరు ఆ బంధాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి.

పిర్యాదు చేయడం :

పిర్యాదు చేయడం :

మీ భాగస్వామి రాత్రి పార్టీ లలో గాని లేదా పనిచేసే ప్రదేశాల్లో గాని ఇలా ఎక్కడపడితే అక్కడ ఎక్కడికి వెళ్లినా వేరే వారి దగ్గర మీ గురించి పిర్యాదులు చేస్తున్నట్లైతే గనుక మీరు ఈ విషయంలో ఖచ్చితంగా ఎదో ఒకటి చేయవల్సిన అవసరం ఉంది. స్నేహితులు లేదా సహచరులు గనుక మీ భాగస్వామి పిర్యాదు స్వభావం గురించి మీకు గనుక చెప్పినట్లైతే, అటువంటి భాగస్వామి మీకు తగినవారు కాదు అని గుర్తుంచుకోండి. ఇటువంటి విషయాలను ఒకటి లేదా రెండు సార్లు నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ, ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటే గనుక ఆ వ్యక్తులతో సంబంధం తెంచుకోవడం ఉత్తమం.

మొత్తం కృషి అంతా మీరే పెట్టినట్లయితే :

మొత్తం కృషి అంతా మీరే పెట్టినట్లయితే :

ఏ సంబంధ బాంధవ్యాల్లో అయినా గట్టి పునాది ఏర్పడాలంటే, భాగస్వాముల ఇద్దరి కృషి చాలా అవసరం. కేవలం మీ యొక్క కృషి వల్లనే గనుక మీ సంబంధ బాంధవ్యాలు ముందుకు సాగుతున్నట్లైతే, ఎదో ఒక సమయంలో, జీవితంలో ఎదో ఒక క్షణంలో త్వరలో లేదా తర్వాత ఈ యొక్క సంబంధ బాంధవ్యం గురించి మండిపడతారు. కృషి గనుక ఒకవైపు నుండే గనుక ఉన్నట్లయితే, ఆ సంబంధ బాంధవ్యాల్లో సమతుల్యత లేదు అని అర్థం చేసుకోండి.

నమ్మకం లేకపోవడం :

నమ్మకం లేకపోవడం :

మీ భాగస్వామి గనుక తరచూ మీ ఈ మెయిల్ , ఫోన్ కాల్స్, మెసేజ్ లు మరియు సామజిక మాధ్యమాల్లో మీరు పెట్టే పోస్ట్ ల గురించి తరచూ ఆరాతీస్తూ లేదా వాటి పై నిఘా ఉంచినట్లయితే మీ సంబంధ బాంధవ్యంలో నమ్మకం లేదనే అర్ధం. ప్రేమంటేనే ఒకరికొకరు అర్ధం చేసుకోవడం, నమ్మకం ఉంచడం. మీ భాగస్వామి మీ పై నమ్మకం ఉంచలేకపోతే, వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్క ఆరోగ్యవంతమైన సంబంధబాంధవ్యానికి నమ్మకమే పునాది. అటువంటిది నమ్మకమే లేనప్పుడు అన్ని గాలిలో కలిసిపోయినట్లు లెక్క.

అభినందించకపోవడం :

అభినందించకపోవడం :

మీ భాగస్వామి ఇంతక ముందు మిమ్మల్ని అభినందించేవారు. మీరు మంచి దుస్తులు ధరించినా, మీరు వంట బాగా చేసినా, మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా లేదా వృత్తిపరంగా ఉన్నత స్థానానికి ఎదిగినా ఇలా అనేక సందర్భాల్లో ఇంతక ముందు మిమ్మల్ని అభినందించి ఉండవచ్చు. వాళ్ళు చెప్పిన మాటలు మీకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు. మీ భాగస్వామి అభినందిస్తున్నారంటే, వారు మీ పై ప్రేమను వ్యక్తపరుస్తున్నారని అర్ధం. మీ భాగస్వామి గనుక మిమ్మల్ని అభినందించకపోతే, వారు ఇక మీకు సహకరించరని అర్ధం. ఇది మిమ్మల్ని ఎంతగానో హరించివేస్తుంది. ఈ యొక్క పెద్ద లక్షణం మీ భాగస్వామిలో ఉన్నట్లయితే వారిని వదిలివేసి మీ జీవితంలో ముందుకు సాగటం మంచిది.

English summary

reasons why he/she is not meant for you | reasons why it's time to say goodbye

If you don’t want to end your relationship at its ugliest part, you must consider the following reasons why it is time to say goodbye to your partner at th
Desktop Bottom Promotion