మీ ఇద్దరి బంధం కేవలం ఆమెకి మాత్రమే చెందినదనటానికి లక్షణాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనందరికి తెలుసు ప్రేమించడం అంటే అవతలి వ్యక్తి లోపాలను మరియు వాళ్ళు ఎలా ఉంటే అలా ఒప్పుకోవడం అని. కానీ చాలాసార్లు మనందరం ఎంత గుడ్డిగా ఉంటామంటే ఏ బంధాన్ని అయినా పాడుచేసే లక్షణాలను గమనించం లేదా చూసీచూడనట్లు వదిలేస్తాం.

వీటిల్లో ముఖ్య సమస్య ఆధిపత్య స్వభావం. మీరు ప్రేమించేవారి గురించి శ్రద్ధ తీసుకోవడం సహజమే కానీ, వారిని నియంత్రించడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు. అమ్మాయిలు సులభంగా ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని, ఎవరితో వారిని పంచుకోవాలనుకోరు. అందుకే కొన్నిసార్లు వారిని నియంత్రించాలని ప్రయత్నించి ఆధిపత్య స్వభావం ఉన్నవారిగా మారిపోతారు.

బంధంలో ఆధిపత్యం చూపిస్తున్నారనటానికి సంకేతాలు ఏమిటి

అయితే మీ ప్రేయసి లేదా భాగస్వామి కేవలం తన గురించే ఆలోచిస్తునారని అన్పిస్తే ఈ అలవాట్లను గమనించండి.

సమయపాలన

సమయపాలన

మీకు ఆధిపత్యం చలాయించే గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఆమె మీ సమయం మొత్తాన్ని ఎలా గడపాలో నిర్ణయిస్తుంది. పైగా మీకు నచ్చినట్లు ఏమన్నా మార్చే ఛాయిస్ కూడా ఉండదు. మీ అభిప్రాయం అడగకుండా తను బయటకి సమయం గడపటానికి ఎక్కడకన్నా వెళ్లడానికి ప్లాన్ చేసేస్తే, ఆమె మీ ప్రాధాన్యతలను లెక్కలోకి తీసుకోవడం లేదని అర్థం.

ఆమె ఎప్పుడూ సరైనదే

ఆమె ఎప్పుడూ సరైనదే

మీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ తను కూడా తప్పు చేయవచ్చు, అనుకోవచ్చు వంటి పదాలంటే అలర్జీగా భావిస్తుంటే ఆమె ఎప్పుడూ మిస్ రైట్ కేటగిరీకి చెందుతుంది. మరియు మీరు ప్రేమకొద్దో, గొడవలు ఇష్టం లేకనో ఈ విషయం తనకి చెప్పటానికి భయపడుతుంటే, ఆమె మిమ్మల్ని నియంత్రిస్తున్నట్లే. ఆమె కేవలం తన గర్వం గురించే తప్ప మీకేం కావాలో ఆలోచించట్లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు కావచ్చు కానీ మీరెప్పుడూ తప్పులే చేస్తారనటం, ఆమె ఎప్పుడూ సరైనదే అనటం సరికాదు.

డబ్బును ఖర్చుపెట్టడం

డబ్బును ఖర్చుపెట్టడం

ఇద్దరూ కలిసి డబ్బును పొదుపుచేయటం ఏ బంధానికైనా పెద్ద మార్పు. మీ గర్ల్ ఫ్రెండ్ డబ్బునంతా వృథా చేయకుండా మీతోపాటు కలిసి పొదుపుచేయటంలో సాయపడటం చూడటానికి చాలా బావుంటుంది. కానీ మీరు ఖర్చుపెట్టినప్పుడల్లా మీ ప్రాణం తోడెయ్యడం, కూర్చొని లెక్చర్లివ్వటం చిరాకు తెప్పిస్తుంది. అందుకని డబ్బు విషయాలు, కార్డులు అన్నీ ఆమెకి అప్పగించేముందు ఏదన్నా ముందుజాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోండి.

ప్రాముఖ్యత కోరుకునే వ్యక్తి

ప్రాముఖ్యత కోరుకునే వ్యక్తి

కలసి సమయం గడపటం లేదా ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిదే కానీ అలానే ప్రతిసారీ ఉండాలంటే కష్టం. ప్రతి ప్రేమికురాలు తనకి మీరు ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకోటం సహజమే అయినా, మీరు మీ స్నేహితులతో లేదా కుటుంబంతో సమయం గడిపితే గొడవలు సృష్టిస్తుంటే ఆమె మిమ్మల్ని నియంత్రిస్తున్నట్లు. ఇంకొకరితో సమయం గడిపినప్పుడు తనకి వారమో లేదా నెల మొత్తమో క్షమించమని కోరుతూ తిరగటం అర్థం లేని పని.

కెరీర్ ఎంపిక

కెరీర్ ఎంపిక

ఇద్దరూ కలిసి భవిష్యత్తును గూర్చి ఆలోచించటంలో ఏ నష్టం లేదు. మనందరం అది చేస్తాం, కదా? కానీ మనం ఎవర్నీ వారితో భవిష్యత్తును ఊహించుకుంటాం కాబట్టి వారేం కెరీర్ లేదా వృత్తి ఎంపిక చేసుకోవాలో బలవంతం చేయకూడదు.ఆమె మీతో మీ అభిప్రాయం అడగకుండా లేదా మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోకుండా జీవితాంతం గడపాలని భావిస్తే,మీరు భయపడాలి.

ఫోన్ కాల్స్

ఫోన్ కాల్స్

మీరేదో రహస్య ఏజెంట్ లాగా మీరెక్కడున్నారో అనుక్షణం మీ గర్ల్ ఫ్రెండ్ కి తెలియచేయటం చికాకుగా అన్పిస్తుంది. బాత్ రూంకి వెళ్ళటం దగ్గరనుంచి, ఇంకేదన్నా చోటకి వెళ్ళినప్పుడల్లా మీ ప్రేమికురాలికి తెలిసితీరాలంటే ఆమె మిమ్మల్ని నియంత్రిస్తోంది. మీరు ఎటు కదిలినా ఆమెకి తెలియాలి మరియు ఒకవేళ ఆమె కాల్స్ ను ఎత్తకపోతే మీరు ఇబ్బందిలో పడిపోతారు.

గొప్పలు చెప్పుకోటం

గొప్పలు చెప్పుకోటం

మీరేదైనా పార్టీకి కలిసి వెళ్ళినపుడు లేదా ఇతర ప్రదేశాలకి ఎక్కడన్నా వెళ్ళినపుడు, కలిసి ఉండటం, కొంచెం పబ్లిక్ గా మీ ప్రేమను వ్యక్తపర్చుకోటం కొంతవరకూ ఓకే కానీ,మీ చుట్టూ వారిని అసౌకర్యపర్చకూడదు. కొన్ని అసభ్యకర పనులు బయట చేయటమో, వారిని పట్టుకు వేళ్ళాడటమో ఇవన్నీ బాగోవు. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఇవన్నీ ముందే మాట్లాడి పరిష్కరించుకోండి మరియు మీ నిర్ణయాలు కూడా స్పష్టంగా చెప్పండి.

ఆమెకి అండగా ఉండటం

ఆమెకి అండగా ఉండటం

చాలా సమయం గడిపాక కూడా లేదా ఆమెకి కావాల్సినంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఆమెకి మీరు ఇంకా కావాలి. మీరు ఆమె లేకుండా ఎక్కడికన్నా వెళ్తే తనకు నచ్చదు. పార్టీకి వెళ్ళినపుడు కూడా ఆమె మీరు తన పక్కనే ఉండాలని పట్టుబడితే మీ మిత్రుల మధ్య పరిస్థితి కొంచెం ఎబ్బెట్టుగా మారుతుంది.

ఒక ఆరోగ్యకర బంధంలో ఈ లక్షణాలేవీ ఉండవు, అందుకని మీ గర్ల్ ఫ్రెండ్ లో ఇలాంటి లక్షణాలుంటే మీ బంధం గురించి మళ్ళీ ఆలోచించుకోండి.

English summary

what are the signs of being dominating in a relationship | signs when the relationship is only about her

We all know falling in love means to accept the person's flaws or the way they are. But many times we are so much blind in love that we fail to notice the traits which are harmful to any relationships. And one of the major issues among them is the dominating nature.
Story first published: Wednesday, November 22, 2017, 16:20 [IST]
Subscribe Newsletter