Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
బాయ్‌ఫ్రెండ్ తో ఇలా ఊహలు... కానీ జరిగేది మాత్రం ఇంతే!
అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని రకారకాలుగా ఊహిస్తారు. సినిమాల్లో చూపించినట్టుగా స్టైల్‌గా, అందరినీ మెప్పించేవాడిలా, మీ తల్లిదండ్రులకు నచ్చేట్టుగా, ఫైట్లతో అదరగొట్టేలా, బోలెడంత జాలి, దయ, ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అలా ఏమీ ఉండదు.
అన్ని విషయాల్లో సహాయంగా నేను రెడీగా ఉంటాననే బాయ్‌ఫ్రెండ్ బహుశా సినిమాల్లోనే కనిపించవచ్చు. ఇక్కడ మాత్రం పరిస్థితి అలా ఉండదని చాలా మంది అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్ల గురించి వాపోయారు. హు! ఏం చేద్దాం.. అడ్జస్ట్ అవుతాం అంటున్నారు అమ్మాయిలు.
మరి అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్ నుంచి ఊహించేదేమిటో.. అందుకు విరుద్ధంగా అతడు చేసే వాస్తవ పనులేమిటో ఒక 8 ఉదాహరణలు చూద్దామా...

1.మీ బాయ్‌ఫ్రెండ్ చాలా రిచ్.
అనుకునేది....
మీ బాయ్‌ఫ్రెండ్ చాలా రిచ్. మిమ్మల్ని బయటకు తీసుకెళ్లి ఆనందడోలికల్లో తేలియాడిస్తాడు. షాపింగ్ అతడే డబ్బుకడతాడు. పైగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అతడి క్రెడిట్ కార్డు ఇచ్చి మరీ సంతోషపెడతాడు.
జరిగేదిదే...
షాపింగ్ మాట అటుంచండి... పాలు కొనడానికి కూడా ఒక్కోసారి మిమ్మల్నే డబ్బు అడుగుతాడు.

2. మీ వాడు చాలా హాట్‌గా ఉంటాడు
అనుకునేది...
మీ వాడు చాలా హాట్‌గా ఉంటాడు. అందరు అమ్మాయిలు మీకు అంత మంచి బాయ్‌ఫ్రెండ్ దొరికినందుకు లోలోపలే కుళ్లుకుంటారు.
జరిగేదిదే...
హూ.... అంత హాట్ మరీ తట్టుకోలేం... నా పిచ్చి గానీ.. వేరే అమ్మాయిలు కుళ్లుకునేంత అందగాడా మా వాడు.. అందుకే అన్నారు ప్రేమ గుడ్డిది అని.

3.ప్రతి రోజు ఉదయాన్నే మీకు ఫోన్ చేసి
అనుకునేది...
ప్రతి రోజు ఉదయాన్నే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పి తీయని ఊసులు చెబుతాడని అనుకుంటారు.
నిజానికి...
మధ్యాహ్నం వరకు పడుకొనే ఉంటాడు. మీరు మాత్రం ఎక్కడ చచ్చాడని కాల్స్ మీద కాల్స్ చేసి విసిగి వేసారిపోతారు.

4. ప్రతి రోజు తెల్లారితేనే మీ ఇంటి ముందు ఒక డజను ఎర్ర గులాబీలు
అనుకునేది...
ప్రతి రోజు తెల్లారితేనే మీ ఇంటి ముందు ఒక డజను ఎర్ర గులాబీలు పంపిస్తాడని అనుకుంటారు. అపరిచితుడు సినిమాలో సదాను విక్రమ్ చేసినట్టుగా మీరు ఊహాలోకంలో విహరిస్తారు.
వాస్తవానికి..
మీరు అతడ్ని మెప్పించడానికి ఏ పువ్వులో, స్వీటో పట్టుకెళతారు.

5. మీ బాయ్‌ఫ్రెండ్ మిమ్మల్ని లేటెస్ట్ మోడల్ రాయిల్స్ రోయ్స్
అనుకునేది...
మీ బాయ్‌ఫ్రెండ్ మిమ్మల్ని లేటెస్ట్ మోడల్ రాయిల్స్ రోయ్స్ లేదా బీఎమ్‌డబ్ల్యూ కారులో తీసుకెళతాడు... మ్‌మ్మ...
జరిగేది మాతం...
ఒక డొక్కు బైక్ లేదా స్కూటర్ వేసుకొని వస్తాడు. కాలుష్యం మొత్తం మీ మొహాన కొడుతుంటుంది. ట్రాఫిక్ జాంలో చిరాకుగా అయిపోతారు.

6. మీ బంధానికి సంబంధించిన ప్రతి వార్షికోత్సవం
అనుకునేది...
మీ బంధానికి సంబంధించిన ప్రతి వార్షికోత్సవం, ఫస్ట్ డేట్, ఫస్ట్ కిస్, ఫస్ట్ నైట్ ఇలా ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు.
జరిగేదిదే...
ఇలాంటివాటికి సంబంధించి మీరు హింట్ ఇస్తున్నా సరే అందుకోలేడు!

7. ఖరీదైన రెస్టారెంట్‌కు తీసుకెళ్లి రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్‌తో
అనుకునేది..
ఖరీదైన రెస్టారెంట్‌కు తీసుకెళ్లి రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్‌తో మిమ్మల్ని ఒక్కోసారి సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.
జరిగేదిదే...
ఎహే క్యాండిల్ లైట్ ఏం బావుంటుంది... పద మన కోటిలో రామ్ కీ బండి దగ్గర ఇడ్లీ టేస్ట్ అదుర్స్ అంటాడు.

8. మీ బర్త్‌డేని పక్కాగా ప్లాన్ చేసి
ఊహించిదే...
మీ బర్త్‌డేని పక్కాగా ప్లాన్ చేసి గ్రాండ్‌గా చేస్తాడని మీ ఊహ.
నిజానికి...
అసలు అతడికి గుర్తు కూడా ఉంటుందో... లేదా కాల్ చేసి విషెస్ చెప్పి పెట్టేయవచ్చు. రింగ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వమంటే ల్యాండ్ లైన్ నుంచా.. సెల్ ఫోన్ నుంచా అని అంటాడేమో!



Click it and Unblock the Notifications