పడక గదిలో బాయ్ ఫ్రెండ్ ఫెయిల్ అయితే..?

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

ఎన్నాళ్లో ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. ఇక తనువులు కలవడమే తరువాయి. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని చిలకా గోరింకల్లా ఎదురుచూస్తున్న జంటకు, జతకలిసే సమయం రానే వచ్చింది. కొంటె కోరికలు తీర్చుకుంటూ, విరహజ్వాలలను చల్లార్చుకునేందుకు తహతహలాడుతున్నారు. చల్లటి రాత్రిలో వెచ్చటి కౌగిట్లో కరిగిపోవాలనుకుని ఊహల్లో విహరించే జంటకు ఒక్కసారిగా కలలు కల్లలై పోయాయి. జత కలిసిన జంటలో అనుకోని అపశ్రుతి ఎదురైతే ఆ అసంతృప్తి అంతా ఇంతా కాదు.

పెదాలతో పాటు ఈ 7చోట్ల ముద్దాడితే స్త్రీ పరవశించిపోతుంది

జీవితం ఒక్కసారిగా అంధకారం అయిపోతుంది. వారి శృంగార జీవితం శృతిలేని పాట‌లా మారిపోతుంది. తన జతగాడు సంతానం అందించలేడు అనే కఠోరసత్యం తెలిస్తే అది చాలా బాధాకరం. అతను మీ నుంచి భావప్రాప్తి పొందినప్పటికీ, మీలో ఎలాంటి సంతృప్తిని కలిగించలేకపోవడం నిజంగానే ఒక వింత పరిస్థితి. అప్పుడు వారి బంధం నిలిచి ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారడం కూడా సహజమే. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఎదుర్కొవాలి అనేది కూడా సందేహమే. మీ మధ్య ఉన్న బంధంలో ఎలాంటి

పొరపొచ్చాలు లేనప్పటికీ శృంగార జీవితం అసంతృప్తిగా ముగిస్తే ఆ బాధ వర్ణనాతీతం.

ఏ పరిస్థితుల్లో మీ ప్రియుడు ఫెయిల్ అవుతాడు...

ఏ పరిస్థితుల్లో మీ ప్రియుడు ఫెయిల్ అవుతాడు...

శృంగార జీవితంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. చాలా ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాలి. అన్ని విషయాలు పంచుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాలో వెంటనే పంచుకోవాలి. అప్పుడే అతడిలోని లోపాలు తెలుసుకునే వీలుంటుంది.

జీవితం శృంగారం ప్రభావం

జీవితం శృంగారం ప్రభావం

మీ మనస్సుని మీరు ప్రశ్నించుకోండి. శృంగారం లేక పోయినా అతడితో సుఖంగా ఉండగలం అనుకుంటే, అతడిపై నమ్మకం ఉంటే అదే స్వర్గం. అయితే శృంగారమే జీవితం కాదు. మీ అనుబంధంలో సంతోషం ఉండటం ముఖ్యం.

అతడు ప్రయత్నిస్తున్నడా...?

అతడు ప్రయత్నిస్తున్నడా...?

మీరు అతడి అసమర్థత తెలిపినప్పటికీ, అతనిలో ఏదైనా మార్పు సంభవించి, సమస్యను పరిష్కరించుకునే దిశగా ఏదైనా అడుగులు వేశాడా, అనేది గమనించాల్సి ఉంటుంది. అయితే అది శుభపరిణామం, అతడి ప్రయత్నం మీ మీద ప్రేమకు చిహ్నం.

ఏ పురుషుడు అయితే తనలోని లోపాన్ని అర్థం చేసుకోని దాన్ని పరిష్కరించుకునే దిశగా, ప్రయత్నాలు చేసాడో అతడిలో మార్పు వచ్చినట్లే, ఖచ్చితంగా అతడికి మీపై గల అనుబంధానికి అది గుర్తు.

ఫోర్ ప్లేకు ఎక్కువ సమయం ...

ఫోర్ ప్లేకు ఎక్కువ సమయం ...

శృంగారం పండాలంటే ఫోర్ ప్లేనే ముఖ్యం, తొందర పడకు సుందర వదనా అనే సామెత గుర్తు తెచ్చుకొని, వెంటనే ఏదో డ్యూటీలా పని చుట్టేయకుండా శృంగారాన్ని అనుభవించాలి. ముఖ్యంగా ఫోర్ ప్లే మీ పార్ట్‌నర్‌లో కొత్త ఉత్తేజాన్ని తెస్తుంది. అప్పుడు ఇద్దరిలో భావాలు పతాక స్థాయికి చేరి అసలైన భావప్రాప్తి కలుగుతుంది.

అబద్ధంతో మేనేజ్ చేసెయొచ్చా...

అబద్ధంతో మేనేజ్ చేసెయొచ్చా...

మీ పార్ట్‌నర్ మీకు సంతృప్తి ఇవ్వక పోతే వెంటనే చెప్పేయండి. లేకపోతే జీవితాంతం ఒక అబద్ధాన్ని మీరు మోయడం కష్టం.

శృంగారానికి ముందు మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం మంచిది కాద‌ట‌..ఎందుకో తెలుసా!

అతడికి సమయం ఇస్తారా ?

అతడికి సమయం ఇస్తారా ?

అతడిలో స్పందనలు రేకెత్తించేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత సరైన సమయం ఇచ్చి వేచి చూడండి.

ఇద్దరు స్నేహితుల్లా ఉంటారా ?

ఇద్దరు స్నేహితుల్లా ఉంటారా ?

మీ శృంగార జీవితం సుఖంగా సాగాలంటే అతడిని అర్థం చేసుకొని స్నేహంతో మెలగాల్సి ఉంటుంది. అతడి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. శృంగారం లేని జీవితం నిజంగానే బాధాకరం, కానీ ఆ పరిస్థితిని అధిగమించి ప్రేమగా ఉండవచ్చు. అతడితో జీవితం పూర్తిగా మీ ఇష్టాయిష్టాలపైనే ఆధారపడిఉంటుంది.

English summary

What To Do When Your Boyfriend Fails In Bed?

What to do when your boyfriend fails in bed? Imagine this: You have dated him since long and have finally decided to get physically intimate with him.
Story first published: Saturday, August 26, 2017, 17:00 [IST]
Subscribe Newsletter