For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడటం ఎందుకు చాలా అవసరం ?

By R Vishnu Vardhan Reddy
|

కళ్ళు అనేవి ఆత్మకు కిటికీలు లాంటివి. ఈ కారణం చేతనే మీకు నచ్చినవారు లేదా మీ భాగస్వామి మీ కళ్ళలోకి కొద్ది క్షణాలు సూటిగా చూస్తే చాలు మీ గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరుగుతుంది.

ప్రేమలో కళ్ళు అనేవి చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. కళ్ళలోకి కళ్ళుపెట్టి ఎక్కువ సేపు అలానే చూసుకుంటున్న జంటలను గమనిస్తే, కళ్ళు అనేవి ప్రేమలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అనే విషయం మీకు అర్ధం అవుతుంది.

ఎందుకు కళ్ళతో చూడటం అంత ముఖ్యమైన విషయం :

ఇప్పుడు మనం చదవబోయే వ్యాసంలో కళ్ళతో సూటిగా చూడటం వల్ల అది ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, కళ్ళు ప్రేమలో ఎంత ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె చప్పుడు :

గుండె చప్పుడు :

మీరు నమ్మండి నమ్మకపోండి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ప్రేమలో ఉంటారో వాళ్ళు గనుక ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకున్నట్లైతే వారి యొక్క గుండె చప్పుడు ఒకే రకంగా ఉంటుందట.

కళ్ళు పెద్దవిగా అయిపోతాయి :

కళ్ళు పెద్దవిగా అయిపోతాయి :

మీకు నచ్చిన వ్యక్తిని లేదా భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తిని అలాగే సూటిగా తీక్షణముగా గనుక చూసినట్లయితే మీ కళ్ళు పెద్దవిగా కనపడతాయి. మీకు నచ్చిన వ్యక్తిని గనుక అలానే మీ కళ్ళతో చూస్తున్నట్లైతే మీ కళ్ళు పెద్దవిగా మరియు వెడల్పుగా అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

 స్త్రీలు తమ ఇష్టాన్ని ఎలా వ్యక్తపరుస్తారు :

స్త్రీలు తమ ఇష్టాన్ని ఎలా వ్యక్తపరుస్తారు :

ఒక అధ్యయనంలో భాగంగా చాలా మంది స్త్రీలు వారి యొక్క కంటి చూపులో ఉండే వివిధరకాల నమూనాల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు. స్త్రీలు సాధారణంగా తమ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక క్షణ కాలం పాటు ఎదుట వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూసి, తమ చూపుని పక్కకు తిప్పి మళ్ళీ అరనిమిషంలోపు మళ్ళీ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తారు. ఈ విధంగా స్త్రీలు ఎదుటి వ్యక్తులపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తారు.

 మొదటి చూపులోనే ప్రేమలో పడటం :

మొదటి చూపులోనే ప్రేమలో పడటం :

ఒక అధ్యయనం ప్రకారం మొదటి చూపులోనే ప్రేమలో పడిన జంటల్లో 90% జంటలు, ఖచ్చితత్వమైన చూపుల కలయిక వల్లే ప్రేమలో పడ్డారట. ఈ విషయాన్ని తెలుసుకొని పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు. కంటితో సరిగ్గా సూటిగా చూడని వారు మొదటి చూపులోనే ప్రేమలో పడరా అనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. మొదటిచూపులోనే ప్రేమలో పడే విషయంలో మాత్రం కళ్ళు చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి అనే విషయాన్ని గుర్తించారు.

ఒత్తిడిని దూరం చేయడం :

ఒత్తిడిని దూరం చేయడం :

మీరు ఎప్పుడైతే తీవ్ర ఒత్తిడికి లోనవుతారో లేదా విపరీతమైన బాధను అనుభవిస్తుంటారో అలాంటి సమయం లో మీకు నచ్చిన లేదా ఇష్టపడే వ్యక్తి యొక్క చిత్రాన్ని తీక్షణంగా చూస్తే, మీకు ఆ బాధ మరియు ఒత్తిడి నుండి స్వాంతన చేకూరుతుందని చెబుతున్నారు.

మొదటిసారి ఇష్టపడిన వారిని కలవడం :

మొదటిసారి ఇష్టపడిన వారిని కలవడం :

మొదటిసారి మీకు ఇష్టమైన వాళ్ళను కలవాలనుకున్నప్పుడు, ఆ కలయికలోనే మీరు వారిపై ప్రభావం చూపాలి అని భావించినప్పుడు, వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడటం మాత్రం మరిచిపోకండి. ఈ ప్రక్రియను చేయడం ద్వారా మెదడులో కొన్ని రసాయనాలు వెలువడుతాయని, అవి కొన్ని ఆకర్షణీయ భావాలను కలిగించేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, అమర్యాదగా లేదా ఏదో హేయభావంతో మీ కళ్ళతో గనుక ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూసినట్లయితే వారిలో భయం లేదా ఒత్తిడికలుగుతుంది. దీంతో వాళ్ళు మిమ్మల్ని దూరంపెట్టే అవకాశం ఉంది. అందుకే కళ్ళు అనేవి సంబంధబాంధవ్యాల్లో అతిముఖ్యమైన పాత్రని పోషిస్తాయి అని చెబుతున్నారు.

కళ్ళను మిటకరించు:

కళ్ళను మిటకరించు:

ఒక వ్యక్తి గనుక కళ్ళను తరచూ మిటకరిస్తున్నట్లైతే, వాళ్ళు మెల్లగా మీ పట్ల ఆకర్షణకు లోనవుతున్నారని అర్ధం. ఒకవేళ ఎవరైనా మీతో సూటిగా కళ్ళలోకి కళ్ళుపెట్టి మీతో మాట్లాడలేకపోతున్నట్లైతే వాళ్ళు అభద్రతా భావానికి లోనవుతున్నారని అర్ధం.

ఆకర్షణీయమైన కళ్ళు :

ఆకర్షణీయమైన కళ్ళు :

రెండు కళ్ళు ఒకటే రకంగా ఒకే ఆకారంలో గనుక ఉన్నట్లయితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కళ్ళ క్రింద నల్లటి వృత్తాలు గనుక ఉన్నట్లయితే, కొద్దిగా అంద విహీనంగా కనపడతారు. చాలా మంది స్త్రీ, పురుషులు నీలి రంగు కళ్ళు కలిగిన వ్యక్తులకు ఆకర్షితులవుతారు.

శారీరిక ఆకర్షణ :

శారీరిక ఆకర్షణ :

మీ శక్తివంతమైన భాగస్వామి గనుక మీ శరీరం వైపు తరచుగా లేదా ఎక్కువగా చూస్తున్నట్లైతే వాళ్ళు మీ శరీరం పై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామి గనుక మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్నట్లైతే వాళ్ళు మీతో ప్రేమని చిగురింపజేసి సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని అర్ధం.

English summary

Why Eye Contact Matters A Lot!

Why Eye Contact Matters A Lot!,In this post, let us look at some deeper facts about the role of eye contact in romantic relationships.
Desktop Bottom Promotion