మీ సంబంధాన్ని ఇత‌రుల‌తో పోల్చుకుంటున్నారా? ఇది చ‌దివితే అలా చేయ‌రేమో!

By: sujeeth kumar
Subscribe to Boldsky

వ్య‌క్తిగా మీరు ప్ర‌త్యేకం కావొచ్చు. మీ సంబంధం ప్ర‌త్యేక‌మైన‌దే. ఏ రెండు రిలేష‌న్‌షిప్‌ల‌ను పోల్చిచూడ‌వ‌ద్దు. ఇత‌రుల అనుబంధం మీ కంటికి బాగా అనిపించొచ్చు అయితే లోప‌ల ఎలా ఉంటుందో అన్న‌ది ఎవ‌రికీ తెలియదు. కొంద‌రు జంట‌లు పైకి కృత్రిమ న‌వ్వును పులుముకున్నా నాలుగు గోడ‌ల మ‌ధ్య ఎప్పుడూ పోట్లాడుతూ ఉండొచ్చు. కాబ‌ట్టి మీ బంధాన్ని ఎప్పుడూ ఎవ‌రితోనూ పోల్చవ‌ద్దు.

మాన‌వ మాత్రులుగా ఇత‌రుల్లో మంచి గుణాల‌ను చూసి వారి నుంచి కొత్త విష‌యాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కొన్నిసార్లు మాత్రం ఇతరుల అల‌వాట్ల‌ను మ‌న జీవితాల‌తో పోల్చుకొని బాధ‌ప‌డ‌తాం. ఇది సంబంధ బాంధ‌వ్యాల్లో త‌గ‌దు ఎందుకంటే ప్ర‌తీ బంధం ప్ర‌త్యేక‌మైన‌దే, దేనిక‌ది విభిన్నంగా ఉంటుంది.

మీ గ‌ర్ల్ ఫ్రెండ్‌తో ఏదైనా స‌మ‌స్య ఉంటే, దాన్ని క‌లిసి చ‌ర్చించుకోవ‌డం ద్వారా ప‌రిష్క‌రించుకోవాలి. అలా చేయ‌కుండా మీ మాజీ ప్రియురాలితో ఆమోను పోల్చ‌డం, లేదా ప‌క్కింటివాడి భార్య‌తో పోల్చ‌డం చేస్తే మాత్రం ఆమె కుమిలిపోయి మీ ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌కు దారితీయ‌వ‌చ్చు. మీ జీవితంలో కావాల‌నుకొని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకోవాలంటే త‌ప్ప మీ సంబంధాన్ని ఎవ‌రితో పోల్చ‌వ‌ద్దు. ఇందుకు సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను మీతో పంచుకుంటున్నాం. చ‌ద‌వండి...

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship

మీరు సంతృప్తి చెందితే చాలు..

మీ సంబంధంలో ఎంత సంతృప్తిగా ఉన్నారో మీకే బాగా తెలుసు అందుకే ఇత‌రుల‌తో అస్స‌లు పోల్చుకోవ‌ద్దు. మీ సంబంధంతో మీరు సంతృప్తిగా ఉన్న‌ట్ట‌యితే ఇత‌ర జంట‌ల‌ను చూసి ఈర్ష్య ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మీ సంబంధంతో మీరు సంతృప్తిగా లేన‌ట్ట‌యితే దాని గురించి ఆలోచించాల్సిందే. ఇత‌రుల‌ను పోల్చిచూడ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు.

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship

ఇత‌రుల‌ను అనుక‌రించాల్సిన ప‌నిలేదు

ఇత‌రుల‌ను అనుక‌రించ‌డం వ‌ల్ల అది మీకు ఎలాంటి ప్ర‌యోజ‌నాన్ని క‌లిగించ‌దు. ముఖ్యంగా రిలేష‌న్ షిప్స్‌లో ఇది అస్స‌లు ప‌నికిరాదు. మీ భాగ‌స్వామి అంద‌రికంటే విభిన్నం. ప‌క్కింటి వ్య‌క్తి త‌న భార్య‌ను ఎలా చూసుకుంటాడు అన్న దానికి మీరు మీ భార్యను ఎలా చూసుకుంటారో అనేదానికి పోలిక పెట్టి చూడ‌లేం. ఎందుకంటే ఇద్ద‌రు భిన్న వ్య‌క్తులు. మీకు ప్రియ‌మైన వారిని ఎలా స‌ముదాయించాల‌నే దానిపై ఆలోచించండి త‌ప్ప అస్త‌మానం పోల్చి చూడ‌డం వ‌ల్ల లాభం లేదు.

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship

మీ ప‌రిస్థితులు విభిన్నం

మ‌నంద‌రి జీవిత ప‌రిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకు త‌గిన‌ట్టుగా మ‌న స్పంద‌న ఉంటుంది. చివ‌రికి మీ పరిస్థితులు ఎలా డిమాండ్ చేస్తే వాటికి త‌గ్గ‌ట్టుగా న‌డుచుకోవాల్సి ఉంటుంది. అందుకే మ‌న సంబంధాన్ని ఎప్పుడూ ఇత‌రుల దాంతో పోల్చి చూడ‌వ‌ద్దు. మీరు చేసే ప‌ని చేసుకుంటూ వెళ్ల‌డ‌మే. మీదైన శైలి ఉండాలి.

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship

మీ భాగ‌స్వామే మీ సోల్ మేట్‌

మీ భాగ‌స్వామి కాకుండా ఇత‌రుల‌కు త‌ర‌చూ ఆక‌ర్షితుల‌వుతున్నారా? ఇప్పుడున్న వారిని వ‌దిలేసి వారితో సంబంధం పెట్టుకోవాల‌నుకుంటున్నారా? అయితే అలాంటి ఆలోచ‌న నుంచి వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవ‌డం మంచిది. మీ అనుబంధాన్ని ఇత‌రుల‌తో పోల్చిచూసుకోవ‌డం వ‌ల్లే ఇలాంటి ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. మీ భాగ‌స్వామే మీ సోల్‌మేట్ గా అనుకోవాలి. ఇత‌రుల ఆక‌ర్ష‌ణ‌లో ప‌డి వారితో స‌హ‌చ‌ర్యం చేయాల‌నుకోవ‌డం రొమాంటిక్‌గా అనిపించొచ్చు గాక కానీ దీర్ఘ‌కాలంలో అదేమంత మంచి ఆలోచ‌న కాదు. ఆ వ్య‌క్తి మీ జీవితంలోకి ప్ర‌వేశించి మీలో ఉన్న అన్ని లోపాల‌తో అడ్జెస్ట్ కాగ‌ల‌డు అన్న గ్యారెంటీ ఏమిటి?

English summary

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship

Why You Must Never Compare Your Relationship With Others | Never Compare Your Relationship,The couples around you with fake smiles may be fighting with each other amidst closed walls. So, never never compare your relationship with others.
Subscribe Newsletter