Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ప్రేమను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం.. ఎందుకంటే?
మిమ్మల్ని గమనించకుండానే.. కనీసం మీ వైపు కూడా చూడకుండానే ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పారా? అలాంటి సందర్భమేదైనా మీకెదురైందా? ఐలవ్‌యూ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎటో చూస్తూ చెప్పడం వల్ల ఎదుటివారికి ఆ మాట మొక్కుబడిగా అంటున్నట్టుగా అనిపిస్తుంది.
ప్రేమిస్తున్నాను అనే మూడు పదాల మాట చాలా చిన్నదే కావొచ్చు. కానీ దానికున్న విలువ అంతా ఇంతా కాదు. తెగిపోయే బంధాన్ని కూడా అక్కున కలిపేసుకునే శక్తి ఆ మాటలకు ఉంటుంది. ఈ మూడు మాటలు చాలు బంధాలు దృఢంగా కొనసాగేందుకు. అందుకే ప్రేమకు అంత పవర్ ఉంది.
ఈ మూడు మాటలకు అంత శక్తి ఎలా ఉంది? అంత రసరమ్యంగా, అంత ప్రశాంతంగా అది చెప్పినవారికి మీరే లోకంగా ఎలా చేయగలిగే మహిమ ఎలా ఉంటుంది. ప్రేమిస్తున్నాను ప్రియ అనే మాటల ప్రభావం చాలా కాలం మదిలో నిలిచిపోతుంది. ఎక్కువ కాలంపాటు రిలేషన్‌షిప్‌లోఉన్నవారు ప్రేమ వ్యక్తీకరించడాన్ని ఓ మొక్కుబడి వ్యవహారంగా చూస్తారు. ఈ ప్రభావంతో వారి మధ్య సులువుగా భేదాభిప్రాయాలు వచ్చేస్తుంటాయి. ఆ మూడు మాటలు చెప్పేందుకు కారణాలు వెతుక్కుంటారు. అయితే ఐలవ్‌యూ చెప్పడం అంటే యాదృచ్చికంగా ప్రేమ కురిపించేందుకే అనే విషయాన్ని మర్చిపోతారు. ఆ భావనలో ఉండి ఏం చెపుతాం లే అని ధోరణితో ఉంటారు. కారణం లేకపోయినా సరే ప్రేమిస్తున్నానని చెబితే ఎదుటివారు ఎంత భద్రగా ఫీలవుతారో చెప్పలేం. కాబట్టి మీ ప్రేమను దాచుకోకండి. దాన్ని వ్యక్తపరిచేందుకు సమయం కోసమో కారణం కోసమో ఎదురుచూడకండి.
ఆ మూడు పవిత్రమైన పదాలు వ్యక్తపర్చడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. తరచూ చెప్పడం వల్ల మీ మధ్య బంధం ఎలా గట్టిపడుతుందో ప్రేమకున్న నిజమైన విలువ ఏమిటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

నమ్మకం కుదురుతుంది
ప్రేమ అనేది చాలా గొప్పది. దాన్ని వ్యక్తపర్చడంతో తరచూ విఫలమవుతుంటాం. మీరు ప్రేమించే వ్యక్తి మీ కళ్లలోకి చూస్తూ తన్మయత్వంతో చేతులను పట్టుకొని నడుస్తుంటే ఆ ఆలోచనే గిలిగింతలు పెట్టేస్తుంది కదూ! కొందరు దంపతులు ప్రేమను వ్యక్తపర్చడం అంత ముఖ్యంగా భావించరు. అయితే ఈ సారి మీ భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు రెండు చేతులు పట్టుకొని కళ్లలోకి చూస్తూ ఆ మూడు పదాలను చెప్పేసేయండి. అవతలి వాళ్లు ఎంత ఆనందంగా ఉంటారో మీరే చూడండి.

భద్రత పెంపొందుతుంది
మీరు వ్యక్తీకరించే ప్రేమ వల్ల మీ భాగస్వామికి ఒక రకమైన భద్రత కలుగుతుంది. అంతవరకు మీరు తన జీవితంలో ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారో అనేది సందిగ్ధంగానే అనిపిస్తుంది. మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్న కొద్దీ వారికి మీ పట్ల ప్రత్యేక స్థానం మదిలో కలుగుతూ ఉంటుంది. మీరు తనను విడిచి వెళ్లరనే భద్రత పెరిగేలా చేస్తుంది.

మంచి భవిష్యత్తు ఉంటుంది
మీరు తనను ప్రేమిస్తున్నాననే విషయం చెప్పడం వల్ల మీరు తనతోనే జీవితాన్ని పంచుకుంటారని నమ్మకం ఏర్పడుతుంది. భవిష్యత్ ను కూడా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకునే అవకాశం ఇచ్చినవారమవుతాం. భవిష్యత్‌లో ఇద్దరు కలిసి ఉండేదానికి ప్రేమ వ్యక్తీకరణ కీలకమైన పాత్రను పోషిస్తుంది. మీ తోనే జీవితం అనే భావన బలపడిపోతుంది. కాబట్టి ప్రేమను వ్యక్తం చేయడంలో తటపటాయించకండి.

ఆరోగ్యమైన సంబంధాల దిశగా..
మీరు ఆమెకు ప్రపోజ్ చేసిన ప్రతిసారీ ఆమెలో చిరునవ్వు గమనించే ఉంటారు. దీని వల్ల మీ ప్రేమ జీవితంలో బంధం బలపడుతుంది. కాబట్టి ప్రేమను వ్యక్తపర్చడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. ఇది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గిపోతుంది కూడా!

సహజంగా వచ్చేస్తుంది
మనం ఎవరినైనా మనస్పూర్తిగా ప్రేమిస్తే ప్రేమ వ్యక్తీకరించడం అనేది సహజంగా జరిగిపోతుంది. ఊపిరి పీల్చుకున్నట్టుగా, దాహం వేసినప్పుడు నీరు తాగినంత సులభంగా ప్రేమించినవారికి మన ప్రేమ గురించి చెప్పగలుగుతాం. అలా చెప్పేటప్పుడు మనల్ని మనలో మనకు నియంత్రణ ఉండదు. కాబట్టి ఇలా వ్యక్తపర్చడం కూడా ఒకరకంగా మీ ప్రియమైనవారికి చాలా సంతోషాన్ని కలగజేస్తుంది.



Click it and Unblock the Notifications