Latest Updates
-
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే తనతో పరిచయం, వాడొక పెద్ద కోతి, వాడి తర్వాత నీతోనే శ్రావణి #mystory373
నీ నవ్వు.. నీ కురులు.. నీ మోము అన్నీ అదిరిపోయాయి. బాపు కుంచె నుంచి జాలువారిన అందమైన అమ్మాయి చిత్రంలా ఉన్నావన్నాడు. శ్రవణ్ మాటలకు నేను లోలోపల పొంగిపోయేదాన్ని. వాడొక కోతిఏంటీ విశాంత్.. నీకు ఇలాంటి
తను నా బీఈడీ క్లాస్ మేట్. పేరు విశాంత్. అతను నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. క్లాస్ లో ఎవరితో మాట్లాడేవాడు కాదు. కానీ నేనంటే మాత్రం అతనికి చాలా అభిమానం. నేను ఏ పని చెప్పినా కూడా చేసేవాడు. దేనికీ నో అనేవాడు కాదు. బ్లాక్ టీచింగ్ మా ఇద్దరికీ ఒకే స్కూల్ లో పడింది. దీంతో ఇద్దరం రోజూ తన బైక్ పైనే స్కూల్ కు వెళ్లేవాళ్లం.
మా ఫ్రెండ్ షిస్ చూసి అందరూ కుల్లుకునేవారు. కొందరు మా ఇద్దరినీ లవర్స్ అనుకునేవారు. ఆ మాటలు విని మేము నవ్వుకునేవాళ్లం. ఎందుకంటే మా మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప ఇంకేమీ ఉండేది కాదు.

మరదలితో పెళ్లి
విశాంత్ కు ఆల్రెడీ తన మరదలితో పెళ్లి కూడా నిశ్చయమైంది. ఆమె గురించి నాకు ప్రతి రోజూ చెప్పేవాడు. వారిద్దరూ మాట్లాడుకునే ప్రతి మాటను చెప్పేవాడు. ఆమె ఫొటోలు చూపించేవాడు. వారిద్దరి జంట చూడముచ్చటగా ఉండేది.

పెళ్లి కుదిరినప్పటి నుంచి
మా బీఈడీ పూర్తవ్వగానే అతను తను మరదలను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లికి మూహూర్తాలు పెట్టించారు. ఇక నన్ను వారం రోజుల ముందుగానే తాను ఇన్వైట్ చేశాడు. తనకు పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి విషయంలో నా సలహా తీసుకునేవాడు.

బలవంతంగా తీసుకెళ్లాడు
ఇక పెళ్లిబట్టలు తీసుకునే సమయంలో కూడా నన్ను పిలిచాడు. నేను రాను అంటే ఇంటికొచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. వాళ్ల ఇంట్లో వాళ్లంతా కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. అలా నెల రోజుల ముందు నుంచే నేను వాలింట్లో మనిషి అయిపోయాను.

తను కూడా విశాంత్ మాదిరే..
పెళ్లికి వారం రోజుల ముందు విశాంత్ బెస్ట్ ఫ్రెండ్, రిలేటివ్ శ్రవణ్ వచ్చాడు. తను విశాంత్ మాదిరిగానే కలుపుగోలు మనిషి. వచ్చీరాగానే అంతా హడావుడి చేసేశాడు. హేయ్ నువ్వు శ్రావణి కదూ అన్నాడు. అవును.. నా పేరు నీకు ఎలా తెలుసు అన్నాను.

లవ్ చేస్తున్నాడేమో అనుకున్నా
నీ గురించి ఎప్పుడూ విశాంత్ చెప్పేవాడు. వాడు నిన్ను ఏమైనా లవ్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ కేవలం మీ ఇద్దరిదీ ఫ్రెండ్ షిప్ అని తెలిసింది. కనీసం విశాంత్ ఫొటో కూడా నాకు చూపించలేడు. కానీ నువ్వు ఎలా ఉంటావో అతను చెప్పేవాడు... సేమ్ అలాగే ఉన్నావు.

బాపు కుంచె నుంచి జాలువారిన
నీ నవ్వు.. నీ కురులు.. నీ మోము అన్నీ అదిరిపోయాయి. బాపు కుంచె నుంచి జాలువారిన అందమైన అమ్మాయి చిత్రంలా ఉన్నావన్నాడు. శ్రవణ్ మాటలకు నేను లోలోపల పొంగిపోయేదాన్ని.

వాడొక కోతి
ఏంటీ విశాంత్.. నీకు ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడని నాకు అస్సలు ఒక్క రోజు కూడా చెప్పలేదు అన్నాను. శ్రవణ్ గురించా నువ్వు అడుతుగున్నది.. వాడొక కోతి. సొంతం మా అమ్మ అన్న కొడుకు. మేమిద్దరం ఏ రోజు కూడా రిలేటివ్స్ మాదిరిగా ఉండలేదు.

నీతోనే శ్రావణి
చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్లం. ఇప్పటి కూడా వాణ్ని నా బావ అని ఎవ్వరూ అనుకోరు. ఫ్రెండే అని అనుకుంటారు. నేను వాడి తర్వాత అంతగా క్లోజ్ గా ఉండేది నీతోనే శ్రావణి అని అన్నాడు విశాంత్.

శ్రవణ్ చాలా మంచి కోతి
విశాంత్ అతన్ని కోతి అన్నాడు కానీ శ్రవణ్ చాలా మంచి కోతి. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూనే ఉంటాడు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడు. అతనిపై రోజురోజుకు నాకు తెలియకుండానే ఇష్టం పెరిగిపోయింది. తను ఒక్క క్షణం కనపడకపోయినా వెలితిగా అనిపించేది.




Click it and Unblock the Notifications
