For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యింది.. సంకనాకిచ్చింది - #mystory176

ఇప్పుడు చాలా మంది డేటింగ్ యాప్స్ వినియోగిస్తూ ఉంటారు. టిండర్‌, క్యుపిడ్‌, హింజ్‌, హ్యాపెన్‌ వంటివి చాలా డేటింగ్‌ యాప్‌లున్నాయి. వీటన్నింటిలో చాలా మంది యాక్టివ్‌ గా ఉంటారు. డేటింగ్ యాప్, డేటింగ్ మోసాల

|

ఇప్పుడు చాలా మంది డేటింగ్ యాప్స్ వినియోగిస్తూ ఉంటారు. టిండర్‌, క్యుపిడ్‌, హింజ్‌, హ్యాపెన్‌ వంటివి చాలా డేటింగ్‌ యాప్‌లున్నాయి. వీటన్నింటిలో చాలా మంది యాక్టివ్‌ గా ఉంటారు. అలాగే నేను కూడా ఏదో ఒక అమ్మాయి డేటింగ్ చేద్దామనుకుని ఒకరోజు డేటింగ్ యాప్ ఇన్ స్టాల్ చేశాను.

ఇక రోజూ నాకు పది అమ్మాయిల నుంచి రిక్వస్ట్‌లు వందలాది మంది అమ్మాయిల నుంచి లైక్ లు వచ్చేవి. ఇక రోజూ నేను చాటింగ్ లతో దుమ్ములేపేవాణ్ని.

మూడు రోజులకే

మూడు రోజులకే

ఒక అమ్మాయితో పరిచయం మొదలైన మూడు రోజులకే నాకు బాగా క్లోజ్ అయిపోయింది. ఆ అమ్మాయి మొదట నా గురించి డిటేల్స్ అడిగింది. అన్నీ చెప్పేశాను. నువ్వెలా ఉంటావు... చూడాలని ఉంది అని అంది. వెంటనే నా సెల్ఫీ పంపేశా.

పిల్ల భలే ఉంటుంది

పిల్ల భలే ఉంటుంది

ఆమెది ఉత్తరప్రదేశ్. పిల్ల భలే ఉంటుంది. నా సెల్ఫీ చూశాక తను కూడా సెల్ఫీ పంపింది. నా అభిరుచుల్ని చెప్పాను. తను కూడా సేమ్ టు సేమ్ నాలాంటి అభిరుచుల్నే కలిగి ఉంది. అయితే నువ్వు నార్త్‌. నేను సౌత్‌. భాషలు.. సంస్కృతీ సంప్రదాయలు వేరు. వందల మైళ్ల దూరం.. అయినా ఒకేలా ఎలా ఉంటున్నామంటే గ్రేట్ కదా అన్నాను.

సౌత్‌కి ఎప్పుడొస్తావు

సౌత్‌కి ఎప్పుడొస్తావు

ఇక నువ్వు నార్త్‌ నుంచి సౌత్‌కి ఎప్పుడొస్తావు అన్నాను. నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నా. నేను రెడీ. నువ్వు ఇప్పుడంటే ఇప్పుడు వస్తా అంది. సరే వచ్చే సండే హైదరాబాద్ వచ్చేసెయ్ అన్నాను. సండే వచ్చింది.. తను కూడా హైదరాబాద్ వచ్చింది.

కారులో పికప్ చేసుకుని

కారులో పికప్ చేసుకుని

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి కారులో పికప్ చేసుకుని వచ్చాను. హైదరాబాద్ లో అన్నీ చూపించాను. ఒక రోజంతా నాతోనే ఉంది. మరుసటి రోజు కూడా నాతోనే నా రూమ్ లోనే గడిపింది. మా మధ్య చాలా జరిగాయి.

ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి

ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి

తర్వాత తనకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి, ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ ఎక్కించాను. ఇంటికెళ్లాక తన నుంచి మెసేజ్ వచ్చింది.

నాన్నకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్లా. ఖర్చులన్నీ నేనే భరించాలి అంది. ఇప్పుడు హాస్పటల్‌లోనే ఉన్నా అంది. ఏవేవో టెస్ట్‌లు రాశారు. చేయిస్తున్నా. డబ్బు సరిపడా తీసుకురాలేదు అంది.

వెంటనే పంపించేశా

వెంటనే పంపించేశా

నాకు ఒక ఇరవై వేలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తావా? అంది. వెంటనే పంపించేశా. చెక్‌ చేసుకో అన్నాను. థ్యాంక్స్‌.. అంటూ నన్ను పొగడ్తలతో ముంచెత్తింది. మళ్లీ రాత్రి ఫోన్ చేశా. మా నాన్నకి క్యాన్సర్‌ అట.. కీమో స్టార్ట్‌ చేయాలంట. నా దగ్గర అంత డబ్బు లేదు అంది. ఎంతవుతుంది అన్నాను.

మూడు లక్షలు

మూడు లక్షలు

ప్రస్తుతానికి ఓ మూడు లక్షలు అవుతుందన్నారని చెప్పింది. బాగా ఏడ్చింది. సరే నువ్వేం కంగారు పడకు అని నేను ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని లక్ష పంపాను. ఇంకా వీలైతే అడ్జెస్ట్ చేస్తాను అన్నాను. మళ్లీ థ్యాంక్స్ చెప్పి నన్ను దేవుణ్ని చేసేసింది.

లక్నో వస్తాను

లక్నో వస్తాను

సరే నేను వీలు చూసుకుని లక్నో వస్తాను అన్నాను. వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. తర్వాత ఎన్ని సార్లు తనకు చేసినా ఫోన్‌ రింగ్‌ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు. మెసేజ్‌లకు రిప్లూ లేదు. చివరకు ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌.

ఎలాంటి స్పందన లేదు

ఎలాంటి స్పందన లేదు

రెండు వారాలు.. మెసేజ్‌లు పంపాను. ఎలాంటి స్పందన లేదు. నేను మోసపోయానా అని అనిపించింది. కానీ నమ్మలేకపోతున్నా. నాకు డబ్బు పోయినదానికంటే...ఆమెకు ఎమోషనల్‌గా కనెక్టు అయ్యాననే విషయం ఎక్కువగా బాధిస్తోంది. చివరకు తెలిసింది నన్ను తను మోసం చేసిందని.

మోసపోవడమే కాదు

మోసపోవడమే కాదు

డియర్‌... అంటూ కలిసే ఈ డేటింగ్‌ల వల్ల నాలాగా మోసపోవడమే కాదు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. ఎంతో మంది అబ్బాయిలు మోసపోయిన తీరుని కొందరు నాకు చెప్పడంతో విని షాక్‌ అయ్యా.

సంకనాకించి వెళ్తారు

సంకనాకించి వెళ్తారు

నా లైఫ్‌లో జరిగినట్లు ఎవరికీ కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా మంది అమ్మాయిలు ఇలా మాయ చేస్తారు. ప్రేమంటారు. నువ్వు లేక నేను లేనని నమ్మిస్తారు. సాయం కోరతారు. చివరకు ఇలా సంకనాకించి వెళ్తారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరూ కూడా బుద్ది ఉంటే డేటింగ్ యాప్స్ ని ఇన్ స్టాల్ చేసుకోకండి.

English summary

i met her on a dating app and fell in love but ill never forget what she did that day

i met her on a dating app and fell in love but ill never forget what she did that day
Desktop Bottom Promotion