For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నీ అయిపోయాక బ్రేకప్ చెప్పింది.. ఏం చెయ్యాలో అర్థం కాలేదు

|

ఆ రోజు ఆదివారం. ఎలాగో ఆఫీస్ ఉండదని కాస్త లేట్ గా లేచాను. ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేయడం నా అలవాటు. వెంటనే వాట్సాప్ లో నా బేబీకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపుదామనుకున్నాను. అప్పటికే తన నుంచి చాలా మెసేజ్ లు వచ్చాయి.

ఇంకా వరుసగా మెసేజ్ లు వస్తున్నాయి. వాటిని చదువుతుంటే నాకేమి అర్థం కావడం లేదు. అసలు ఎందుకిలా మెసేజ్ లు పంపిందో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇక ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడను. ఇంతటితో మన స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అంటే ఏవేవో మెసేజ్ లు పంపింది.

నమ్మకం లేదు

నమ్మకం లేదు

‘ నాపై నీకు నమ్మకం లేదు. నన్ను ఎప్పుడూ అనుమానిస్తుంటావు అంది. నువ్వు నా వ్యక్తిత్వాన్నీ గౌరవించవు. నా అభిప్రాయాలకు విలువ ఇవ్వవు. ఐ హేట్‌ యూ' అంది వాటిని చూడగానే నాకు చాలా బాధేసింది. శ్వేత విషయంలో నేను ఎప్పుడు కూడా ఒక తప్పుమాట అనలేదు. అలాంటిది ఎందుకిలా నన్ను అసహ్యించుకుంటూ మెసేజ్ లు పంపిందో నాకు అర్థం కాలేదు.

తనకు ఫోన్ చేశా

తనకు ఫోన్ చేశా

వెంటనే నేను తనకు ఫోన్ చేశా. నంబర్ ఛేంజ్ చేసింది. సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. వెంటనే బార్ కెళ్లి బీర్ కొడుతూ నా మెమోరీస్ గుర్తు తెచ్చుకున్నాను. ఇంటర్ అయిపోగానే నేను బీటెక్ జాయినయ్యాను. తను కూడా నా బ్రాంచ్ లోనే జాయినయ్యింది.

తనవైపు లాగేవి

తనవైపు లాగేవి

మొదటి రోజు నుంచి నా చూపులన్నీ తనవైపు లాగేవి. కొన్నాళ్లకు ఇద్దరం పరిచయం అయ్యాం. తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ గా మారాం. మొదట గంటలు కూడా మా మాటలతో క్షణాలుగా మారిపోయేవి. ఇద్దరం వాట్సాప్ లో చాటింగ్ లతో, మెసేంజర్ లో వీడియో కాల్స్ తో ఫుల్ బిజీగా గడిపేవాళ్లం.

ప్రేమ గురించి ఏనాడు చెప్పుకోలేదు

ప్రేమ గురించి ఏనాడు చెప్పుకోలేదు

కానీ ఇద్దరం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ గురించి ఏనాడు చెప్పుకోలేదు. కొన్ని రోజులకు నేను తనకి ప్రపోజ్ చేశాను. తను ఒకే అంది. నువ్వు ఒకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అన్నాను. తను కాస్త టైమ్ ఇవ్వాలని అడిగింది. సరే అన్నాను.

ఏదో ఒక సాకు చెప్పి

ఏదో ఒక సాకు చెప్పి

నేను పెళ్లి టాపిక్ తీసుకొచినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. మొత్తానికి ఒక రోజు తనతో పెళ్లి టాఫిక్ గురించి సీరియస్ గా డిస్కస్ చేశా. చెప్పు శ్వేత.. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? అన్నాను. నాలుగేళ్లుగా మనం ప్రేమించుకుంటున్నాం ఇక పెళ్లి చేసుకుందాం అన్నాను.

నాకు కోపం వచ్చింది

నాకు కోపం వచ్చింది

ఇప్పుడే వద్దు ఒకరికొకరం అర్థం చేసుకున్నాక చేసుకుందాం అంది. నాకు కోపం వచ్చింది. ఎప్పుడూ ఇదే మాట చెబుతావ్. నేనింకా నీకు అర్థం కాలేదా. ఇద్దరి మధ్య దాదాపు అన్ని పనులు కూడా అయిపోయాయి. ఐ మీన్... కిస్సింగ్స్, హగ్గులు ఇలా అన్నీ అయిపోయాయి. ఇంకేమీ అర్థం చేసుకోవాలి అన్నాను.

తీక్షణంగా చూసింది

తీక్షణంగా చూసింది

ఆమె కళ్లు ఎరుపెక్కాయి. నా వైపు తీక్షణంగా చూసింది. నాకు భయమేసింది. సరే అని నేను బైక్ స్టార్ చేసి రూమ్ కు వచ్చేశాను. తను కూడా స్కూటీపై వెళ్లిపోయింది. ఛ..నాకు అన్ని సంబంధాలు వచ్చినా బుద్ధిగడ్డి తిని దీని కోసమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటూ రూమ్ కు వెళ్లాను.

బ్రేకప్ చెప్పింది

బ్రేకప్ చెప్పింది

ఆ రోజు అర్ధరాత్రి పడుకున్నాను. మరుసటి రోజే నాకు తను బ్రేకప్ చెప్పింది. అందుకే బార్ కు వచ్చా. మళ్లీ ఒక బీర్ తెప్పించుకుని తాగుతూ కూర్చొన్నా. ఇంతలో నాకు ఏవేవో డౌట్స్ వచ్చాయి.

కొన్ని విషయాలు మాట్లాడాను

కొన్ని విషయాలు మాట్లాడాను

మొన్న సరితకు ఫోన్‌ చేసి శ్వేత గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాను. సరిత, నాకు శ్వేతకు ఫ్రెండ్. వారిద్దరూ ఒకే రూమ్ లో ఉంటారు. సరిత నాతో కాకుండా ఇంకెవరితోనైనా ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం చేస్తుందా అని సరితను అడిగాను. అందుకు సరిత అలాంటిదేమీ శ్వేత చేయదని చెప్పింది.

కళ్లముందు తిరిగింది

కళ్లముందు తిరిగింది

నాకు ఆ సంఘటన గిర్రున కళ్లముందు తిరిగింది. వెంటనే సరితకు ఫోన్‌ చేసి ఆరాతీశా. అప్పుడు అసలు విషయం అర్థమైంది. శ్వేత చెవిన అన్ని విషయాలు వేసింది సరితే! అదీ అసలు విషయం.

సారీ..శ్వేత

సారీ..శ్వేత

వాట్సాప్‌లో ‘సారీ..శ్వేత.' అన్న మెసేజ్‌ పెట్టాను. రిప్లై లేదు. సాయంత్రం ఆరింటిదాకా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నా. వూహూ.. అటునుంచి స్పందన రాలేదు. ఆశ చచ్చిపోయింది. అప్పుడొచ్చిందొక మెసేజ్‌.

ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి

ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి

‘మన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నేను నిన్ను ఏ రోజు మోసం చేయలేదు. నన్ను నువ్వు అనసవరంగా అనుమానిస్తున్నావు. నువ్వు చేసింది తప్పు అని అంగీకరిస్తే.. ఈ రోజు సాయంత్రం నన్ను నువ్వు ఎప్పుడూ కలుసుకునే చోట కలువు అంంది. లేదంటే మళ్లీ నాకు మెసేజ్ చెయ్యకు అంది. ' వెంటనే బయలుదేరాను.

అలా మాకు బ్రేకప్ ఒక్క రోజు కూడా నిలబడలేదు.

English summary

i spent 4 years with her and i dont know how to tell her this

i spent 4 years with her and i dont know how to tell her this