మహిళలలో పురుషులు ఆకర్షణకు లోనయ్యే అంశాలు ఇవే ..!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రతి మహిళలోనూ కొన్ని ప్రత్యేకమైన అంశాలు పురుషుని ఆకర్షించేవిగా ఉంటాయి. కొందరు మహిళలు కొన్ని ప్రత్యేకమైన పద్దతులను అనుసరించడం ద్వారా పురుషులను ఆకర్షించగలిగితే, కొందరు ఎటువంటి పద్దతులను అనుసరించకపోయినా కూడా వారి సహజసిద్దమైన లక్షణాలతో పురుషులను ఆకర్షించగలుగుతారు.

ఎక్కువ మంది పురుషులు ఏపని చేస్తున్నా , ఎలాంటి పరిస్తుతుల్లో ఉన్నా కూడా , నలుగురు అమ్మాయిల సమూహం కనిపించినా, ఒక అందమైన అమ్మాయి వాళ్లని దాటి వెళ్ళినా, వారి చూపులు వాళ్ళ వెన్నంటే వెళ్ళడం సహజ లక్షణం.

కానీ పురుషులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను స్త్రీలలో గమనిస్తుంటారు . ఒక పురుషుడు కొన్ని సందర్భాలలో ఏ మహిళనైనా 2 సెకన్ల కంటే ఎక్కువగా తీక్షణంగా గమనించడం చూసారా? దీనికి కారణం కొన్ని ప్రత్యేకలక్షణాలను ఆ మహిళ కలిగి ఉండడమే. అందులో ముఖ్యమైనవి ఇక్కడ పొందుపరచడం జరిగినది.

ఆత్మ విశ్వాసం:

ఆత్మ విశ్వాసం:

కొందరి మహిళలలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంటుంది . సాధారణం గా పురుషులు ఆత్మవిశ్వాసం, తెలివితేటల ప్రదర్శన, వస్త్రధారణల పైనే ఎక్కువగా ఆకర్షితమవుతూ ఉంటారు. తద్వారా సమూహం లో వీరు ప్రవర్తించే తీరు, మాట్లాడేవిధానం కూడా కారకాలుగా ఉంటాయి. కావున మీ ఆత్మవిశ్వాసమే ఇక్కడ మొదటి మెట్టు. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి మానసిక దృఢత్వాన్ని మరియు తెలివితేటలను కూడా సాధారణంగానే కలిగి ఉంటుంది.

తక్కువగా మాట్లాడడం:

తక్కువగా మాట్లాడడం:

నాటకీయత జోడించిన మాటలను వినుటకు పురుషులు ఎప్పటికీ సిద్దంగా ఉండరు. సాధారణంగా తక్కువగా మాట్లాడువారు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు, వీరికి వినడం సహజ లక్షణంగా ఉంటుంది. తద్వారా అర్ధం చేసుకునే గుణం ఉంటుంది. కావున సహజంగానే తక్కువగా మాట్లాడేవారి పట్ల ఆకర్షితులవుతుంటారు.

తెలివితేటల ప్రదర్శన:

తెలివితేటల ప్రదర్శన:

మెదడు పని చేయని మహిళను ఖాళీ సిలిండర్ తో సమానంగా భావిస్తారు పురుషులు. ముఖ్యంగా వీరు మహిళలు మాట్లాడునప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల వారికున్న అవగాహన, వారు ఇచ్చే సూచనలమీద దృష్టి సారిస్తారు. తద్వారా ఆ మహిళ పట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఒక తెలివైన అమ్మాయి లక్ష్యసాధన పట్ల కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంటుంది. ఇలాంటి మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

పొడవాటి కాళ్ళు:

పొడవాటి కాళ్ళు:

ఇది భౌతికపరమైన విషయమే అయినా నిజం, ఎక్కువగా పొడవాటి కాళ్ళు కలిగిన మహిళపట్ల సాధారణంగానే ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇలాంటి కాళ్ళు కలిగి ఉండడమే కాదు, ఎంపిక చేసుకునే దుస్తులపట్ల కూడా జాగ్రత్త తీసుకొనవలసి ఉంటుంది.

నీలం కళ్ళు:

నీలం కళ్ళు:

నీలం కళ్ళు కలిగిన మహిళలు చాలా అరుదుగా తారసపడుతుంటారు. ఒక ప్రత్యేకమైన లక్షణంగా వీటిని భావించి పురుషులు ఆకర్షణకు లోనవుతుంటారు.

పెద్దరికం:

పెద్దరికం:

మహిళలు తమ వయసుని మించిన తెలివితేటలు కలిగి ఉండుటను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలా పెద్దరికం ప్రదర్శించేవారిపట్ల ఆకర్షణకు లోనవడం పరిపాటిగా ఉంటుంది.

తిరుగులేని వ్యక్తిత్వం :

తిరుగులేని వ్యక్తిత్వం :

ఒక మనిషిని ఒక స్థానంలో ఉంచగలిగే అంశాలలో ప్రముఖమైనది వ్యక్తిత్వం లేదా వైఖరి. సానుకూల దృఖ్పధంతో కూడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. చీటికీ మాటికీ గొడవలు పడుతూ, అర్ధం లేని ప్రేలాపనలు చేసే మహిళలను పెద్దగా ఇష్టపడరు అన్నది సత్యం.

జుట్టు:

జుట్టు:

అనేక సార్లు వినేవుంటారు కూడా. జుట్టు మహిళలకు కొత్త అందాన్ని తీసుకుని వస్తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు. కానీ కొందరు పొడవాటి జుట్టును ఇష్టపడితే, కొందరు వంపులు తిరిగిన, అలంకరించిన జుట్టును ఇష్టపడుతారు. కానీ వీటన్నిటికన్నా చిక్కుపడని నునుపైన జుట్టు కలిగి ఉండడం అన్నిటికన్నా శ్రేయస్కరం. మహిళల పరoగా జుట్టు అనేది ఒక పెద్ద అంశమే. జుట్టు అందానికై, పోషణకు, అలంకరణకు ఎక్కువ తాపత్రయాన్ని ప్రదర్శిస్తుంటారు కూడా. పురుషులు అత్యధికంగా ఆకర్షణకు లోనయ్యేది కూడా దీనికే మరి.

వంపులు:

వంపులు:

స్త్రీ అనగానే సాధారణంగా మన తెలుగు వారికి స్పురించేది బాపు బొమ్మ, వంపుసొంపుల నయగారాలను ఒలికిపోసే ఆ బొమ్మ స్త్రీత్వాన్నికి ప్రత్యేకమైన చిహ్నంగా ఉంటుంది అనడం లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. దీనికి కారణం పురుషులు స్త్రీలలో కోరుకునే లక్షణాలను ఆ బొమ్మలో ప్రదర్శించడమే. అంతగా పురుషులు స్త్రీల నయగారాలకు ప్రాధాన్యతని ఇస్తారు.

సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా, చలోక్తులు ప్రదర్శించగలరా :

సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా, చలోక్తులు ప్రదర్శించగలరా :

ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా తమ చలోక్తులతో, తెలివితేటలతో చక్కదిద్దగలిగిన మహిళల పట్ల పురుషులు ఎక్కువగా ఆకర్షణకు లోనవుతుంటారు. వీరు జీవితాన్ని ఎంతో సున్నితoగా నడపగలరన్న భావన పురుషులలో సాధారణంగానే కలుగుతుంది. తద్వారా ఈ భావాలు ప్రదర్శించే మహిళలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అనుమానాస్పద వైఖరి :

అనుమానాస్పద వైఖరి :

ఎక్కువగా మాట్లాడే మహిళల గురించి తెలుసుకోవాలన్న ఆలోచన పురుషులకు ఉండదు. దీనికి కారణం వీరి గురించి మాకు తెలుసు అన్న భావన లేదా , ఏదో ఒకరోజు పూర్తిగా వీరికి వీరే చెప్పేస్తారు అన్న ఆలోచన. తద్వారా వీరి పట్ల ఆసక్తి కూడా తక్కువగానే ఉంటుంది. కానీ, తక్కువ మాట్లాడే మహిళల గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తిని కూడా సహజంగానే కలిగి ఉంటారు.

వస్త్రధారణ:

వస్త్రధారణ:

మారుతున్న సమాజానికి తగిన విధంగా ఉన్న వస్త్రధారణ కలిగి ఉండడo కొందరు ఇష్టపడితే, కొందరు సాంప్రదాయక దుస్తులను ధరించేవారి పట్ల ఆకర్షణకు లోనవుతూ ఉంటారు. కానీ ఇక్కడ తమ ఆలోచనలకు, తమ వైఖరికి, తమ రూపురేఖలకు నప్పే విధంగా దుస్తులు ధరించడం వలన సహజంగానే కొత్తదనాన్ని పరిచయం చేసిన అనుభూతి కలుగుతుంది. తద్వారా పురుషులు ఆకర్షితులవుతారు.

గ్లాసెస్ :

గ్లాసెస్ :

నిజం, ఒక్కోసారి కళ్ళకు ధరించే కళ్ళజోడు కూడా పురుషులను ఆకర్షించడం లో ప్రధానపాత్ర పోషిస్తుంది. కారణాలు ఏవైనా కావొచ్చు, గ్లాసెస్ ధరించడం సర్వసాధారణం అయిపోయిన ఈరోజుల్లో, ధరించే గ్లాసెస్ పట్ల శ్రద్ద తీసుకోవడం అంతే ముఖ్యం. సన్ గ్లాసెస్, కంటి చూపు సంబంధిత గ్లాసెస్ , స్మార్ట్ గ్లాసెస్, కంప్యూటర్ గ్లాసెస్ ఇలా అనేక రకాలుగా గ్లాసెస్ అందుబాటులో ఉంటాయి. కానీ తమ ముఖానికి నప్పేలా గ్లాసెస్ ధరించడం ఎంతో ముఖ్యంగా సూచించబడినది.

English summary

13 MOST ATTRACTIVE THINGS ABOUT A WOMAN THAT ATTRACTS MEN

Every woman has her own charm. Women always have their ways to attract the attention of a guy. Sometimes, without any intention, these charms work their way out. No matter what guys are doing or where they are just by watching a group of girls happily chatting or having a cute girl passing by catches their attention.
Story first published: Saturday, April 7, 2018, 17:10 [IST]