For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యాలోచనలు మీ సంబంధాలను సైతం నాశనం చేయగలవు ... ఎలాగో చూడండి .

అత్యాలోచనలు మీ సంబంధాలను సైతం నాశనం చేయగలవు ... ఎలాగో చూడండి .

|

ఒక్కోసారి మనకు తెలీకుండానే తీవ్రమైన ఆలోచనలను చేస్తుంటాం. ఈ విషయాన్ని మనం గమనించేలోపే కొన్ని జరగాల్సిన అనర్ధాలు జరిగిపోయి ఉంటాయి. తర్వాత నాలిక కరచుకుని కూడా ఎటువంటి లాభం ఉండదు. ఈ అత్యాలోచనలకు రెండు కోణాలు ఉంటాయి, ఒకటి సానుకూల దృక్పధం , రెండవది ప్రతికూల దృక్పధం.

సానుకూల దృక్పధo అనే కోణం లో ఉన్నవాడు , తన జీవితానికి కొన్ని సరిహద్దులను నిర్మించుకుని ఉంటాడు. తద్వారా తమ ఉన్నతికై ప్రాకులాడుతూ అత్యాలోచనలు చేస్తుంటాడు.

కానీ ప్రతికూల దృక్పధం అనే కోణంలో ఉన్నవాడు, సరిహద్దులను దాటి వ్యసనాలకు బానిసై , ఆ వ్యసనాలను తమకు అనువుగా మలచుకునే ప్రయత్నాలతో అత్యాలోచనలు చేస్తుంటాడు. ఇలాంటివి జీవితంలో పెనుమార్పులనే తెస్తుంది. వీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా వీరు తీవ్రంగా ఆలోచిస్తుంటారు, ఇవి శారీరిక మానసిక సమస్యలను కూడా తెస్తుంటాయి.

5 REASONS WHY OVERTHINKING IS BAD IN A RELATIONSHIP

ఒక్కోసారి చిన్న చిన్న మాటలు, కాన్వర్సేషన్స్ కూడా సంబంధాలు చెడిపోయేంతలా ప్రభావితం అవుతాయి. దీనికి కారణం అత్యాలోచనలే. ఉన్న విషయాన్ని భూతద్దం లో చూసినట్లు పెద్దవిగా ఊహించుకోవడం వలన చినికి చినికి గాలివానగా మారినట్లు, అసంబద్ధ మాటలు కూడా అనేక ప్రతికూల ప్రభావాలను తెస్తుంటాయి.

ఇలా అత్యాలోచనలు సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూడండి.

1. సంబంధంలోని ప్రేమని హరించే దిశగా ..

ఏదేని ఒక సంబందం ఏర్పడాలి అంటే ఇద్దరి ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ లోని జ్ఞాపకాలు మధురానుబూతులు ఒక సంబంధానికి పునాదులు వంటివి, కానీ అత్యాలోచనలు ఈ పునాదులను బీటలు వారేలా కీలకపాత్రను పోషిస్తాయి. చివరికి భాగస్వామి విలువలను సైతం కాలరాసేలా అత్యాలోచనలు తయారవుతాయి.

కూర్చుని సావధానంగా మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యలను సంబంధాలు తునాతునకలు చేసేదాకా తీసుకువెళ్లడం సరికాదు. కావున ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందన్న భావన మీ మెదడుకు తోచిన వెంటనే, ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా మీ మనసును సిద్దపరచుకోవాలి. తద్వారా సమస్య పెద్దది కాకుండా, సంబంధాలు నాశనం దిశగా వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు.

2. అభద్రతా భావానికి తొలి మెట్టు

నిజం, ఇలా అత్యాలోచనలు చేసేవారు ఎక్కువగా అభద్రతా భావానికి లోనై జీవిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు తమ సంబంధాలు నాశనమవుతాయేమో అన్న అభద్రతా భావంలోనే ఎక్కువగా జీవిస్తుంటారు. తద్వారా ఎన్నో సమస్యలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారు. ఇలాంటి అభద్రతా భావాలు నెమ్మదిగా డిప్రెషన్ వైపుకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి, కావున అభద్రతా భావాలు కలిగి ఉండడం మెదడులో దెయ్యాల కుంపటిని పెంచిపోషించడమే అన్న విషయాన్ని గ్రహించాలి.

5 REASONS WHY OVERTHINKING IS BAD IN A RELATIONSHIP

3. నమ్మకాలను కాలరాస్తుంది

అత్యాలోచనలు చేసేవారు నెమ్మదిగా భాగస్వామి పట్ల అపనమ్మక ధోరణిని పెంచుకుంటూ ఉంటారు. కేవలం ఇలాంటి కారణాలవల్లనే ప్రపంచంలో అనేక సంబంధాలు దెబ్బతినే దిశగా వెళ్తున్నాయి. భాగస్వామి పట్ల ప్రేమ , నిజాయితీ ఉన్నా కూడా అత్యాలోచనలు వారిపై నమ్మకాన్ని నాశనం చేసే దిశగా కొనసాగుతాయి. తద్వారా కలహాలతో కూడిన జీవితాన్ని నడపాల్సివస్తుంది, లేదా సంబంధం విచ్ఛిన్నం దిశగా కొనసాగుతుంది అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

4. సంబంధాన్ని కూడా అవమానిస్తారు

మీ మెదడులోని ప్రతి ఆలోచన కూడా మీ భాగస్వామికి వ్యతిరేకంగా ఉండేలా అత్యాలోచనలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు, తద్వారా మీరు మీ భాగస్వామినే కాకుండా మీరు ఉన్న సంబంధాన్ని కూడా అవమానించేలా తయారవుతారు. తద్వారా మీ భాగస్వామి విసుగు చెందే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మీ సంబంధం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తుంది. కావున అత్యాలోచనలు చేస్తున్నప్పుడు, వీటికి ఉన్న ప్రతికూల ప్రభావాలు ఏమిటో తెలుసుకుని తద్వారా మీలో మార్పును తీసుకుని వచ్చేలా ప్రవర్తించడం మేలు.

5. మీకే తెలియని విషయాలకై ఏడుస్తున్నారా ..

ఇది అత్యంత కీలకమైన ఘట్టం, కొందరు అనాలోచితంగా కారణాలు పెద్దగా ఏమీ లేకపోయినా కూడా ఏడుస్తూ, లోలోపల మదనపడుతూ కనిపిస్తుంటారు. దీనికి కారణం ఈ ఆలోచనల స్థాయి తీవ్రతరం కావడమే. డిప్రెషన్ వంటి మానసిక రోగాలకి కూడా ఈ ఆలోచనలు కారణమవుతాయి. తద్వారా ప్రతి చిన్న విషయాన్ని తమకు ప్రతికూల అంశాలుగా భావించి, లోలోపల మదనపడుతూ అకారణంగా ఏడుస్తూ ఉంటారు. చివరికి భాధపడదానికి కూడా స్థలాలు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. వీరిలో తెలియని ఒంటరి తనం ఆవహిస్తుంది, తద్వారా ఆలోచనలు తీవ్రపరిస్థితులకు దారితీసి, గుండెపోటుకు కూడా దారి తీస్తాయి. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇలా ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆలోచనలు చేసేవాళ్లే ఆత్మహత్యలకు కూడా పూనుకుంటున్నారు.

5 REASONS WHY OVERTHINKING IS BAD IN A RELATIONSHIP

5 వ తరగతి ఫెయిల్ అయిన కారణానికి ఒక పసిపిల్లవాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో ఒక కలకాలాన్నే సృష్టించింది. పరిస్థితులు వంద ఉండవచ్చు, కానీ ఆత్మహత్యకు పసిపిల్లవాడు ఆలోచించాడు అంటే ఈ ప్రభావం వయసుతో సంబంధంలేకుండా ఉన్నదని తెలుస్తూనే ఉంది.

కొన్ని కూర్చుని చర్చించుకుంటే సమసిపోయే సమస్యలను కూడా అతిగా ఆలోచించి ఆత్మహత్యలదాకా వెళ్తున్నారు అంటేనే ఈ పరిస్తితి ఎంతఘోరంగా తయారవుతుందో ఊహాకే అందని సమస్యగా ఉందని వేరే చెప్పనవసరం లేదు.

నిజానికి ఇది ఒకరకమైన అలవాటు, నెమ్మదిగా వేరే పనులమీద అంశాల మీద దృష్టిని కేంద్రీకరించడం వలన కానీ, వ్యసనాలను దూరం చేయుట, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా కానీ తగ్గించవచ్చు.

ఒక్కోసారి శరీరం లో క్రొవ్వు చేరడంవలన అది రక్తపోటుకు కారణం అవుతుంది. ఇలాంటి సమయాల్లో, ఆరోగ్యంపట్ల దృష్టిని కేంద్రీకరించడం చాలామంచిది. ఒక్కోసారి ఇలాంటి అనారోగ్య పరిస్థితులు కూడా డిప్రెషన్, మరియు అత్యాలోచనలకు ప్రధాన కారకాలు గా మారవచ్చు. వీరు తమని ఎవ్వరూ ప్రేమించడంలేదన్న అపోహలో ఉంటారు, కానీ ఒక్కసారి వాస్తవిక ప్రపంచానికి వచ్చి చూస్తే ఆ నిరాశా నిస్పృహలు పక్కకు వెళ్ళడం గారెంటీ.

కావున మీరు అత్యాలోచనలు చేస్తున్నారని మీకు అనిపిస్తే వాటిని నాశనం చేసే దిశగా అడుగులు వేయండి, లేకుంటే మీ సంబంధాలే నాశనమయ్యే అవకాశాలు లేకపోలేదు.

English summary

5 REASONS WHY OVERTHINKING IS BAD IN A RELATIONSHIP

We are overthinkers whether we are aware of it or not. Overthinking has two sides two it, first being positive, second being negative. Positive sides are often when we think about ourselves in order to improve or build ourselves into a broader and a better version. We contemplate a lot about it. Read the article to know more.
Story first published:Wednesday, April 4, 2018, 18:23 [IST]
Desktop Bottom Promotion