నాతో బాగా తిరిగింది.. ఇప్పుడేమో వాళ్ల బావను పెళ్లి చేసుకుంటుందట - #mystory119

Written By:
Subscribe to Boldsky

నా పేరు రవి. నాకు రెండేళ్లుగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్సిటీలో ఉంటూ పీజీ చేస్తున్నాం. తన పేరు భవిత. నాకు చిన్నప్పటి నుంచి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు.

గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు

గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు

ఎప్పటి నుంచో ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు అని మనస్సులో అనుకునేవాణ్ని. ఇక వర్సిటీలో జాయినయ్యాక నాకు చాలా మంది అమ్మాయిలు పరిచయం అయ్యారు. మా క్లాస్ లో అబ్బాయిలు చాలా తక్కువగా ఉన్నారు.

క్లాసులకు సరిగ్గా రారు

క్లాసులకు సరిగ్గా రారు

ఉన్న ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కూడా క్లాసులకు సరిగ్గా రారు. దీంతో నాకు మంచి ఛాన్స్ దొరికింది. ప్రతి అమ్మాయి నా పక్కనే వచ్చి కూర్చొని మాట్లాడేది. అలా భవితతో కూడా పరిచయం పెరిగింది. క్లాస్ మొత్తంలో ఎక్సలెంట్ ఫిగర్ అంటే భవిత ఒక్కరే.

అమ్మాయిలతో మాట్లాడేవాణ్ని కాదు

అమ్మాయిలతో మాట్లాడేవాణ్ని కాదు

పీజీలో చేరకముందు నేను అస్సలు అమ్మాయిలతో మాట్లాడేవాణ్ని కాదు. నాకు చాలా సిగ్గు ఉండేది. కానీ పీజీలో జాయినయ్యాక ఒక్క నిమిషం అమ్మాయిలతో మాట్లాడకున్నా.. అమ్మాయిలతో చాటింగ్ చేయకున్నా ఉండలేని పరిస్థితి వచ్చింది.

మొదటి రోజు నుంచే

మొదటి రోజు నుంచే

భవితను నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇష్టపడుతూ ఉన్నాను. మొదట తనతో ఒక్కసారి మాట్లాడితే చాలు అనుకునేవాణ్ని. ఇక తన పరిచయం ఏర్పడ్డ తర్వాత తనతో ఒక్క క్షణం మాట్లాడకున్నా నా ప్రాణం పోయినట్లుగా ఉండేది.

ఎట్రాక్ట్ అయిపోయాను

ఎట్రాక్ట్ అయిపోయాను

అలా భవితకు ఎట్రాక్ట్ అయిపోయాను. భవిత కూడా మొదట్లో నాతో పెద్దగా మాట్లాడేది కాదు. రానురాను తను కూడా నాతో ఒక్కక్షణం మాట్లాడకపోయినా ఉండలేని స్థితికి వచ్చింది. ఇద్దరం రోజూ సినిమాలకు వెళ్లేవాళ్లం. సాయంత్రం వేళల్లో సరదాగా బైక్ పై అలా తిరిగి వచ్చేవాళ్లం.

ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం

ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం

మా యూనివర్సిటీ చుట్టు పక్కల అంతా గ్రామాలుండేవి. అక్కడ జాతర్లు జరిగేవి. వాటికి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్లం. ఆ ఆనందం కొన్ని కోట్లు వెచ్చించినా కూడా దొరకదు. యూనివర్సిటీ చుట్టు పక్కల మేమిద్దరం తిరగని ప్లేస్ లేదు.

మనస్సులో మాట చెప్పలేదు

మనస్సులో మాట చెప్పలేదు

అలా నేను, భవిత ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. కానీ నా మనస్సులో మాట ఎప్పుడూ కూడా భవితకు చెప్పలేదు. ఎన్నో సార్లు నేను భవితకు నా మనస్సులో మాట చెప్పాలని ఉండేది. తాను ఎంత దగ్గరైనా కూడా నాకు ధైర్యం చాలలేదు.

మాట రాలేదు

మాట రాలేదు

ఒక రోజు నా మనస్సులో మాట చెప్పాను. ఆ క్షణంలో తాను చెప్పిన మాట విని గొంతులో నుంచి మాట రాలేదు. తనకు వాళ్ల బావతో పెళ్లి నిశ్చయం అయ్యిందట. త్వరలో పెళ్లి ఉందని చెప్పింది.

నాతో ఎందుకు చెప్పలేదు

నాతో ఎందుకు చెప్పలేదు

మరి మీ బావతో పెళ్లి నిశ్చయం అయిన విషయం నాతో ఎందుకు చెప్పలేదన్నాను. ఆ సందర్భం ఎప్పుడూ రాలేదు అందుకే చెప్పలేదని సింపుల్ గా చెప్పింది.

బావను పెళ్లిచేసుకుంటా

బావను పెళ్లిచేసుకుంటా

వాళ్ల బావను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అదేంటి.. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వు, నేను చాలా క్లోజ్ అయ్యాం. నువ్వుంటే నాకు చాలా ఇష్టం అన్నాను.

నేనలా ఎప్పుడూ భావించలేదని చెప్పింది.

కోపమొచ్చిందా

కోపమొచ్చిందా

మళ్లీ తను హాస్టల్ కు వెళ్లాక ఫోన్ చేసింది. ఏం కన్నా.. కోపమొచ్చిందా అంటూ బుజ్జగిస్తూ మాట్లాడింది. నాకు ఒక పక్క మండుతోంది. అయినా నీలాంటి వాళ్లను నమ్మినందుకు నాకు ఇలాగే కావాలిలే అని తనతో అన్నాను.

స్నేహం ఇలాగే ఉండాలి

స్నేహం ఇలాగే ఉండాలి

అవన్నీ ఏమి మనస్సులో పెట్టుకోకు. మన ఇద్దరి స్నేహం ఇలాగే ఎప్పటికీ ఉండాలి అంది. ఎప్పటికీ ఒకరినొకరం మర్చిపోకుండా ఉండాలంది. ఇప్పటికీ తను నాకు అర్థం కావడంలేదు.

ప్రేమ జోలికి వెళ్లకూడదు

ప్రేమ జోలికి వెళ్లకూడదు

ఆడవారిలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ప్రేమ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. మా అమ్మనాన్న చూసిన సంబంధాన్నే ఒప్పుకుని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నా.

English summary

she only broke my heart she couldn't break my virtue and beliefs

she only broke my heart she couldn't break my virtue and beliefs
Story first published: Wednesday, March 21, 2018, 9:33 [IST]