Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
భాగస్వామితో సంతోషంగా లేరా? బ్రేకప్ చెప్పడానికి ముందు ఇది చదవండి!
ఇద్దరి మధ్య సంబంధాన్ని విజయవంతంగా నడిపించడానికి ఏ మాయా మంత్రమూ లేదు. దాదాపు అందరు దంపతులు చిన్నా చితకా వాటికి గొడవపడుతూనే ఉంటారు. ఒక్కోసారి బంధాన్ని దృఢంగా ఉంచుకునేందుకు కొన్ని సర్దుబాట్లు తప్పవు.
ఐతే కొన్ని సార్లు ఇలా సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో అనేక సార్లు రాజీ పడాల్సి వస్తుంది. ఇది మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. జీవితాన్ని సైతం మలుపులు తిప్పగలదు. మీ బంధాన్ని లాగే బదులు తెగ్గోసుకోవడం మేలు అని చెప్పొచ్చు.

ఆప్యాయత కరవైతే...
మాటలతో లేదా ఒకరితో ఒకరు శారీరకంగా ఎలాంటి ఆప్యాయతను వ్యక్తపర్చకపోతే అప్పుడు ఆలోచించాల్సిందే. మీ భాగస్వామితో తీపి కబుర్లు చెప్పి ఎన్ని రోజులైందో గుర్తుకు తెచ్చుకోండి. మీ ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నా ఇద్దరి మధ్య మాటలు కరువైతే అప్పుడు దగ్గర ఉండి కూడా దూరంగా ఉన్నట్టే లెక్క. ఇక ఇద్దరు బ్రేకప్ చెప్పుకోవడమే మంచిదేమో ఆలోచించండి.

జీవిత లక్ష్యాలు వేరు...
రిలేషన్‌షిప్ ప్రారంభించిన కొత్తలో ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనా తీరు, జీవితం పట్ల వైఖరి ఒకేలా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. తర్వాత తర్వాత ప్రాథమ్యాలు మారతాయి. ఒకరికేమో పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంటే మరొకరికి పెళ్లనే మాటే జలదరింపు తెస్తుంది. ఒకరికేమో విదేశాలకు వెళ్లి కెరీర్ మలచుకోవాలనిపిస్తే మరొకరికి ఉన్న ఊర్లోనే సుఖంగా అనిపిస్తుంది. ఇలా ఇద్దిరికీ పొంతన కుదరక మధ్యేమార్గం లేకుండా చేసుకుంటే మాత్రం ఆ బంధాన్ని కొనసాగించడం కష్టమే.

కబుర్లు లేకపోతే..
సంబంధంలో ఉండగా ప్రారంభంలో ప్రతి రోజు ఎలా గడిచింది అని ఆరా తీసుకునేవారు ..ఆ కాస్త కొన్ని నెలలు గడిచాక అసలు ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోతే ఆలోచించాల్సిందే. ఏ స్నేహితుల ముందో, బంధువుల ఎదుటో మా వారు నన్ను పట్టించుకోవడం మానేశాడు అని చెప్పుకునే పరిస్థితి దాపురిస్తే ఇక బ్రేకప్‌కు టైమ్ అన్నట్టే లెక్క.

మీరొక్కరే మారాలంటే ఎలా...
సంబంధంలో ఉండగా భాగస్వాములిద్దరు ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలతో సర్దుబాట్లు చేసుకుంటే మంచిదే. అలాగని చెప్పి ఒక్కరే ప్రతి విషయాన్ని సర్దుకొని పోవడం వల్ల ఆ బంధం తొందరగా తెగిపోయే ప్రమాదముంది. ఒకర్ని సంతోషపెట్టడానికి మరొకరు ఎప్పుడూ త్యాగం చేయడమూ మంచిది కాదు. అందుకని ఇద్దరూ ఒకరికోసం ఒకరు సర్దుబాట్లు చేసుకోవాలి.

లేకపోయినా ఫర్వాలేదనిపిస్తే...
మీ మధ్య బంధం ఏమంత ఆశాజనకంగా లేదు. ఇద్దరు కలిసి సంతోషంగా గడిపిన క్షణాలు అసలు మీకు గుర్తు కూడా లేవా? మీ బంధపు భవిత్యవం గురించి మరో ఆలోచనలున్నాయా? ఇది నడిచే పని కాదని అనిపిస్తుందా? మీ భాగస్వామి లేకపోయినా ఫర్వాలేదనిపిస్తుందా? అయితే మీ బంధానికి వీడ్కోలు చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పొచ్చు.
ఏదేమైనా విడిపోయే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకుంటే మానసికంగా మంచిది.



Click it and Unblock the Notifications