స్నేహితుడి కంటే ఎక్కువగా ఊహిస్తుంద‌ని చెప్పేందుకు 7 సంకేతాలు

By: Sujeeth
Subscribe to Boldsky

ఎదుటి వారి మ‌న‌సులో ఏం ఉందో క‌నుక్కోగలిగితే డేటింగ్ చాలా సుల‌భ‌మ‌య్యేది. చాలా సంద‌ర్భాల్లో మ‌నం వారిని అడ‌గ‌కుండా వారి మ‌న‌సులోని భావాల‌ను అంచ‌నా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం.

ప్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న స్నేహాన్ని త‌రువాతి ద‌శ‌కు తీసుకెళ్లేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు? మీ గ‌ర్ల్ ఫ్రెండ్ స్నేహ ప‌రిధిని దాటి మీ తో ఏడ‌డుగులు న‌డిచేందుకు సిద్ధంగా ఉందో లేదో క‌నుగొన‌డం ఎలా? కొన్ని సంకేతాలు ఆ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తాయి...

1. మీ గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే కుతుహలం...

1. మీ గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే కుతుహలం...

ఆమె మిమ్మ‌ల్ని ఇష్ట‌ప‌డితే మీ గురించి తెలుసుకోవాల‌నే కుతుహ‌లం బాగా ఉంటుంది. మీ రోజువారీ అల‌వాట్ల నుంచి మీ ఫ్యాష‌న్ సెన్స్, మీ ఆహార్యం, న‌డ‌క‌, న‌డ‌త ఇలా ప్ర‌తి చిన్న విష‌యాన్ని ఆమె గ‌మ‌నిస్తూ ఉంటుంది. మీరేదైనా చెబుతుంటే చెవుల‌న్నీ క‌ళ్లు చేసుకొని వింటుంది. విష‌యం ఎలాంటిదైనా దానికి సంబంధించి ప్ర‌శ్న‌లు అడిగి మిమ్మ‌ల్ని అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.

2. మీరేం అన్నా గుర్తుంచుకుంటుంది....

2. మీరేం అన్నా గుర్తుంచుకుంటుంది....

మీరెప్పుడైనా ఫ‌లానా చైనీస్ రెస్టారెంట్ ఇష్ట‌మ‌ని చెబితే ఆ విష‌యాన్ని ఆమె గుర్తుపెట్టుకొని మ‌రో రోజుకు అక్క‌డికి డేట్‌కు తీసుకెళుతుంది. మీ ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడైనా చెబితే వాటిని దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్ సంభాష‌ణ‌లు కొన‌సాగిస్తుంది. ఆమె అది వ‌ర‌కే మీ ఇద్ద‌రి మ‌ధ్య పోలిక‌ల‌ను నోట్ చేసుకొని ఇద్ద‌రికీ ద‌గ్గ‌రి సంబంధం ఉంద‌ని సంకేతాల‌ను ఇస్తుంది.

4. మీ కోసం స‌మ‌యం కేటాయిస్తుంది...

4. మీ కోసం స‌మ‌యం కేటాయిస్తుంది...

ఆమె వీకెండ్ ప్లాన్స్‌ను మీతో గ‌డిపేందుకు చూస్తుంది. మీకే ప్రాధాన్య‌త ఇస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా స‌రే కాస్త స‌మ‌యం మీ కోసం కేటాయిస్తుంది. మీతో డేట్‌ను పొడిగించుకునేందుకు చూస్తుంది. ఇంటికి వెళ్లేందుకు తోడు ర‌మ్మ‌ని కోరుతుంది. ఇది కాదా మంచి సంకేతం?

5. ఆమె స్నేహితుల‌తో మీ ప్ర‌స్తావ‌న‌

5. ఆమె స్నేహితుల‌తో మీ ప్ర‌స్తావ‌న‌

ఆమె క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడేట‌ప్పుడు మీ పేరును త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటుంది. వాళ్లంద‌రికీ మీ ఇద్ద‌రు క‌లిసి తిరుగుతార‌న్న విష‌యం తెలిసి ఉంటుంది. ఆమె స్నేహితుల‌తో క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌తార‌న్న విష‌యం అడిగి తెలుసుకుంటుంది. ఆమె కూడా మిమ్మ‌ల్ని మీ స్నేహితుల‌తో, కుటుంబ‌స‌భ్య‌లతో క‌లిపించాల‌ని అడుగుతుంది.

6. మెసేజింగ్ , కాల్స్‌తో త‌ర‌చూ ట‌చ్‌లో...

6. మెసేజింగ్ , కాల్స్‌తో త‌ర‌చూ ట‌చ్‌లో...

ఆమె త‌న దిన‌చ‌ర్య‌ను మీకు మెసేజీ చేయ‌డంతో ప్రారంభించి, ముగుస్తుంది. మీతో మాట్లాడేందుకు కార‌ణాన్ని వెతుక్కుంటూ మెసేజీల‌తో స‌ర‌దా సంభాష‌ణ చేసేందుకు సాకు వెతుక్కుంటుంది. ఇవి కాకుండా ఇంకేం కావాలి?

7. ఆమె బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది...

7. ఆమె బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది...

ఆమె మీతో ఐ కాంటాక్ట్ ఉంచుతుంది. మీరు ఆమెని చూడ‌కున్నా మీ వంక అదే ప‌నిగా చూస్తుంటుంది. మీరు ఉండగా ఆమె మొహంలో న‌వ్వు చెద‌ర‌నివ్వ‌దు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మిమ్మ‌ల్ని తాకే ప్ర‌య‌త్నం చేయ‌వ‌చ్చు. శృంగార‌ప‌ర ఉద్దేశంతో కాక‌పోయినా మీ భుజాల‌పై చేతులు వేయ‌డం, మీ జుట్టుపై వేళ్ల‌ను పోనిచ్చి, లేదా మీ చేతుల‌ను ప‌ట్టుకోవ‌డం లాంటి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

English summary

signs that say a girl likes you more than just a friend

Dating a person would have been easier if we could understand what exactly is going on his or her mind. Most of the times, we rely on our intuitions (rather than asking her!), and keep guessing whether she wants to take the friendship to the next level or not.
Story first published: Thursday, February 8, 2018, 10:32 [IST]
Subscribe Newsletter