భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కోరుకొనే 10 విషయాలు ఏమిటో మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

భారతదేశంలో స్త్రీలు తాము పెళ్లిచేసుకున్న వ్యక్తులు తమ పై విపరీతమైన దృష్టిని పెట్టాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మీ భార్య పట్ల ఎక్కువ ప్రేమని కురిపిస్తారో, ఆమెని ఎక్కువగా సంరక్షిస్తారో అటువంటి సమయంలో ఆమె దగ్గర నుండి కూడా అలాంటి ప్రతిస్పందనే మీకు వస్తుంది.

కానీ, భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కొన్ని నిర్దిష్టమైన విషయాలను ఖచ్చితంగా కోరుకుంటారు. భారతీయ స్త్రీలు వారు జీవితాంతం గడపబోయే భర్తల దగ్గర నుండి ఏమి కోరుకుంటారు అనే విషయాన్ని గనుక పరిశీలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

 Things Indian Women Want | Things Indian Women Want From Husbands | Women Want From Husbands

మొదట మనం బంగారం నుండి మొదలుపెడతాం. భారతీయ స్త్రీలకు బంగారం పై మక్కువ ఎక్కువ. దాదాపు ఎవ్వరు కానీ, మాకు బంగారం వద్దు అని చెప్పరు. వారికి బంగారు వస్తువులను బహుమతులుగా ఇచ్చినప్పుడు ఆ క్షణం వారు వ్యవహరించే తీరు, చూపించే ఆతురత వెలకట్టలేనిది . అందుచేతనే సందర్భం ఏదైనా చాలామంది భారతీయ పురుషులు భార్యలకు బంగారు ఆభరణాలను కొనిస్తుంటారు.

వస్తు రూపంలో ఉండే విషయాలను పక్కన పెడితే, భార్యలు భర్తల దగ్గర నుండి కొన్ని కోరికలు కోరుతారు. వాటిని ప్రతి పురుషుడు నెరవేర్చవల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఆమె కోరికలు అంతగా బాగుండకపోవచ్చు. కానీ, మంచి ఆనందకరమైన వివాహ జీవితాన్ని కలకాలం గడపాలని ఉంటే వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది.

వస్తు రూపంలో లేని ఏ విషయాలను భారతీయ స్త్రీలు, భర్తల దగ్గర నుండి ఆశిస్తారో, వెతికి ప్రాధాన్యత ఇస్తారో అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తల్లి కంటే, కూడా భర్త తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని భార్యలు ఆశిస్తారు. వృత్తిపరంగా పనిచేసే దగ్గర తక్కువ సమయం గడపాలని, ఇంట్లో ఎక్కువ సమయం ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఇలా ఎన్నో విషయాలు భారతీయ స్త్రీలు భర్తల దగ్గర నుండి కోరుకుంటారు. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం.

ఇంటి వద్ద ఎక్కువ సమయం గడపడం :

ఇంటి వద్ద ఎక్కువ సమయం గడపడం :

పెళ్ళైన తర్వాత చాలా విషయాల్లో మార్పు వస్తుంది. వాటిల్లో అతిముఖ్యమైనది. భార్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం. ఎందుకంటే, ఆమె భర్తను ఒక అమ్మలా దగ్గర ఉండి చూసుకుంటుంది. అలానే పిల్లలకు కూడా అమ్మలా తన బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. కాబట్టి మీ అమ్మ కంటే, కూడా ఆమె దగ్గరే ఎక్కువ సమయం గడపవల్సిన అవసరం ఉంది.

ఆమె ఏమి చెప్తుందో వినడానికి ప్రయత్నించండి :

ఆమె ఏమి చెప్తుందో వినడానికి ప్రయత్నించండి :

చాలామంది ఏమని భావిస్తారంటే, పురుషులు చెప్పిందే సరైనది అనుకుంటారు. కానీ, స్త్రీలు కూడా కొన్ని సమయాల్లో, అలోచించి మంచి విషయాలను చెబుతారని గుర్తించరు. కానీ, తమ భర్తలు అలా గుర్తించాలని స్త్రీలు కోరుకుంటారు. కాబట్టి భర్తలందరూ అహాన్ని పక్కన పెట్టి, భార్యలు ఏమిచెబుతున్నారో వినాలి.

వండటం కూడా నేర్చుకోవాలి :

వండటం కూడా నేర్చుకోవాలి :

మీ భార్య అనారోగ్యం పాలైనప్పుడు, ఆమె మీకు కడుపు నిండా తినుబండారాలు పెట్టాలని ఆశించకండి. పరిస్థితులు క్లిష్టతరంగా మారినప్పుడు మీరు వంట చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు భర్తలు కూడా వంటలు చేయాలి.

చీపురు కూడా పట్టుకోవాలి :

చీపురు కూడా పట్టుకోవాలి :

భర్త ఇంటిపని కూడా చేయాలని చాలామంది భార్యలు ఆశిస్తారు. మీరు ఉంటున్న ఇల్లు మీ ఇల్లు కూడా కదా. కాబట్టి భర్తలందరూ పనిచేయడం మొదలుపెట్టాలి. చీపురు తీసుకొని మీ పని ప్రారంభించండి.

పిల్లలను సంరక్షించాలి :

పిల్లలను సంరక్షించాలి :

ఇంటి పనుల్లో సాధారణంగా భార్యలు తీరిక లేని సమయాన్ని గడుపుతుంటారు. అటువంటి సమయంలో భర్తలు తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తూ, పిల్లల ఆలనా పాలనా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసినప్పుడు కుటుంబం చాలా ఆనందమయంగా ఉంటుంది.

భార్యకు ప్రాముఖ్యత ఇవ్వండి :

భార్యకు ప్రాముఖ్యత ఇవ్వండి :

చాలామంది భారతీయ స్త్రీలు తమ భర్తలు తమకు అధిక ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇవ్వాలని అనుకుంటారు. కొంతమంది భర్తలు స్నేహితుల మద్యగాని లేదా కుటుంబ సభ్యుల మద్యగాని ఉన్నప్పుడు అసలు తనకు ఒక భార్య ఉంది అనే విషయాన్నే మరచిపోతారు.

నెలసరి సమయం గుర్తించి, అందుకు తగినట్లు ప్రవర్తించండి :

నెలసరి సమయం గుర్తించి, అందుకు తగినట్లు ప్రవర్తించండి :

భర్తలు తమ నెలసరి సమయాన్ని గుర్తించి అందుకు తగినట్లు ప్రవర్తించాలని చాలామంది స్త్రీలు కోరుకుంటారు. ఈ సమయంలో స్త్రీలు తాము ప్రేమించే వారిని ఆప్యాయంగా కౌగలించుకోవాలని కోరుకుంటారు. వారితో దగ్గరగా ఉండి, తల వాల్చి సేద తీరాలని భావిస్తారు.

కొద్దిగా గౌరవం ఇవ్వండి :

కొద్దిగా గౌరవం ఇవ్వండి :

చాలామంది స్త్రీలు తమ భర్తలు తమకు గౌరవం ఇవ్వాలని భావిస్తారు. ఎప్పుడు గాని మీరు మీ భార్య పై చేయి ఎత్తకండి, అరచకండి లేదా తిడుతూ మాట్లాడకండి.

మనం సరిగ్గానే చేస్తున్నాం :

మనం సరిగ్గానే చేస్తున్నాం :

పురుషులుగా మీరు మీ భార్య ఏమనుకుంటుందో, తన ఆలోచన విధానం ఏమిటి అనే విషయాన్ని వ్యక్తీకరించడానికి అవకాశం ఇవ్వాలి. అలా అని ఆమె చెప్పిన అన్నింటితో మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఆమె కూడా చదువుకున్న మహిళ అయి ఉండవచ్చు, స్వతంత్రంగా ఆలోచించే భావాలూ కలిగి ఉండవచ్చు, సమాజంలో ఎలా బ్రతకాలో తెలిసి ఉండవచ్చు.

నన్ను ప్రేమించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించండి :

నన్ను ప్రేమించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించండి :

కొంతమంది పురుషులు భార్యలను ప్రేమించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించరు. మీకు గనుక భార్య ఉంటే, మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటే, అటువంటి భార్యకు మీరు ప్రేమ మాటలు మాత్రమే చెబితే సరిపోదు. ఆమెకు మీ ప్రేమను చూపించాలి.

English summary

Things Indian Women Want | Things Indian Women Want From Husbands | Women Want From Husbands

Apart from materialistic things, there are other desires a married man has to meet to please his wife. Though, she may seem devious to him at times, it is important to grant her wishes for a long and happy marriage.The non-materialistic things Indian women want from their husband is to give priority to their wife other than their mother! She also wants him to spend less time at work and more time at home. Like these, there many more things Indian women want from their husbands. Take a look:
Story first published: Friday, May 11, 2018, 19:00 [IST]